టీడీపీ కూటమి ముందంజ - అక్కడ హోరా హోరీ..!!

ఏపీలో ఎన్నికల ఫలితాల ట్రెండ్స్ వస్తున్నాయి. తొలి ట్రెండ్స్ లో టీడీపీ కూటమి ఆధిక్యత కనిపిస్తోంది. నాలుగు ఎంపీ, అయిదు ఎమ్మెల్యే స్థానాల్లో కూటమి అభ్యర్దుల ముందంజలో ఉన్నారు. వైసీపీ మూడు నియోజకవర్గాల్లో లీడ్ లో ఉంది. కొన్ని నియోజకవర్గాల్లో హోరా హోరీగా ఓట్లు కనిపిస్తున్నాయి. టీడీపీ బలంగా చెప్పుకున్న నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్దులకు ఆధిక్యత కొనసాగుతోంది. పిఠాపురంలో పవన్ ఆధిక్యత కొనసాగుతోంది.

రాజమండ్రి, నంద్యాల, నర్సరావుపేట,విజయవాడ పార్లమెంట్ స్థానాల్లో టీడీపీ కూటమి అభ్యర్దులు లీడ్ లో ఉన్నారు. కావలి లో వైసీపీ, కోవూరులో టీడీపీ అభ్యర్దులు లీడ్ లో ఉన్నారు. జగ్గంపేటలో టీడీపీ అభ్యర్ది జ్యోతుల నెహ్రూ ముందజంలో కనిపిస్తున్నారు. నర్సరావుపేటలో టీడీపీ అభ్యర్ది లావు శ్రీక్రిష్ణ దేవరాయులు 509 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. నెల్లూరులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లీడ్ కొనసాగుతోంది. విజయవాడ లో టీడీపీ అభ్యర్ది కేశినేని శివనాథ్ 1200 ఓట్లతో ముందంజలో కొనసాగుతున్నారు.

TDP alliance leads in Four loksbaha Seats and fiive Assembly segments as first trends

తిరుపతి ఎంపీ స్థానంలో బీజేపీ అభ్యర్ది వరప్రసాద్ ఆధిక్యత కొనసాగుతోంది. నగరిలో మంత్రి రోజా వెనుకంజలో ఉన్నారు. కపడ లో ఎంపీ అవినాశ్ రెడ్డి 2,274 ఓట్ల ఆధిక్యతలో ఉన్నారు. అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ 12, వైసీపీ 3, జనసేన 1 సీట్లో అధిక్యత కనిపిస్తోంది. మంగళగిరిలో టీడీపీ అభ్యర్ది నారా లోకేష్ ముందంజలో కొనసాగుతున్నారు. పెడన లో ఎన్డీఏ అభ్యర్థి కాగిత కృష్ణ ప్రసాద్ లీడింగ్ లో ఉన్నట్లు తొలి ట్రెండ్స్ స్పష్టం చేస్తున్నాయి. వెల్లడవుతున్న తొలి ట్రెండ్స్ తో టీడీపీ కూటమిలో జోష్ కనిపిస్తోంది.

తూర్పు గోదావరి ముమ్మిడివంలోనూ టీడీపీ అభ్యర్ది ఆధిక్యతలో ఉన్నారు. అమలాపురం అసెంబ్లీ స్థానంలో టీడీపీ అభ్యర్ది లీడ్ లో కొనసాగుతున్నారు. పిఠాపురంలో పవన్ 4300 ఓట్ల ఆధిక్యతలోకి వచ్చారు. అదే విధంగా గుంటూరు పార్లమెంట్ స్థానంలో పెమ్మసాని చంద్రశేఖర్ లీడ్ లో ఉన్నారు. కోవూరు లో తొలి రౌండ్ లో ప్రశాంతి రెడ్డి వెనుకంజలో ఉండగా.. రెండో రౌండ్ సమయానికి ఆధిక్యతలో ఉన్నారు. అయితే, పోస్టల్ బ్యాలెట్ తో పాటుగా కలిసి కౌంటింగ్ కొనసాగుతున్న వేళ..హోరా హోరీగా ట్రెండ్స్ కనిపిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+