అమరావతి పాదయాత్రకు వైసీపీ అడ్డంకులు-కేంద్రం జోక్యం కోరిన రైతులు, టీడీపీ- ప్రధానికి ఫిర్యాదు
అమరావతిలోనే రాజధాని కోరుతూ రైతులు అరసవిల్లికి సాగిస్తున్న పాదయాత్ర తూర్పుగోదావరి జిల్లాలోకి ప్రవేశించబోతోంది. ఈ క్రమంలోనే వైసీపీ ఎమ్మెల్యేలు,స్ధానిక నేతలు జనాన్ని రెచ్చగొట్టి యాత్రకు ఆటంకాలు కల్పించేందుకు చేస్తున్న ప్రయత్నాలపై టీడీపీ, అమరావతి జేఏసీ మండిపడుతున్నాయి. ఇదే అంశంపై కేంద్రానికి తాజాగా వేర్వేరు ఫిర్యాదులు కూడా చేశాయి. హైకోర్టు అనుమతి ఉన్నా వైసీపీ సర్కార్ తమ పార్టీ నేతలతో యాత్రను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు వారు ఆరోపించారు.

అమరావతి పాదయాత్రకు అడ్డంకులు
అమరావతిలో ఒకే రాజధాని కోరుతూ అరసవిల్లికి రైతులు చేపట్టిన పాదయాత్ర కొనసాగుతోంది. అయితే దీనికి వైసీపీ సర్కార్ నుంచి అడ్డంకులు మొదలయ్యాయి. ఓవైపు పోలీసులు, మరోవైపు వైసీపీ నేతలు అమరావతి పాదయాత్రకు అడుగడుగునా అడ్డంకులు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే తణుకులో పాదయాత్ర సందర్భంగా తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. దీంతో రైతులు అతికష్టం మీద బయటపడాల్సి వచ్చింది. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లాలోనూ రైతుల్ని అడ్డుకోవాలని వైసీపీ నేతలు పిలుపునిస్తున్నారు. దీంతో ఈ వ్యవహారం చినికిచినికి గాలివానగా మారుతోంది.

హైకోర్టు అనుమతి ఉన్నా తప్పని అడ్డంకులు
అమరావతి నుంచి అరసవిల్లికి రైతులు పాదయాత్ర కోసం అనుమతి అడిగితే వైసీపీ సర్కార్ అనుమతించలేదు. దీంతో రైతులు హైకోర్టును ఆశ్రయించి అనుమతి తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వం పోలీసులు, పార్టీ నేతల సాయంతో యాత్రను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోందని రైతులు ఆరోపిస్తున్నారు. హైకోర్టు ఆదేశాల్ని పోలీసులు పట్టించుకోకుండా ఆంక్షలతో తమ యాత్రను టార్గెట్ చేస్తున్నారనేది ప్రధాన ఆరోపణ. ఇప్పటికే రూట్ మ్యాప్ విడుదల చేసి యాత్ర కొనసాగిస్తున్నా ఇంకా పోలీసులు ఆంక్షలు పెట్టడంలో అర్ధంలేదని రైతులు చెప్తున్నారు. దీంతో హైకోర్టు ఆదేశాలు అమలు కావడం లేదని మరోసారి పిటిషన్ వేసేందుకు సిద్దమవుతున్నారు.

కేంద్రం జోక్యం కోరిన టీడీపీ ఎంపీలు
హైకోర్టు అనుమతితో సాగుతున్న అమరావతి పాదయాత్రకు వైసీపీ సర్కార్, నేతలు, పోలీసులు అడ్డంకులు కల్పించడంపై నిన్న కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ ను కలిసి టీడీపీ ఎంపీలు గల్లా జయదేవ్, కనకమేడల రవీంద్రకుమార్ ఫిర్యాదుచేశారు. వైసీపీ సర్కార్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ జనాన్ని రెచ్చగొడుతోందని వారు ఆరోపించారు. తక్షణం జోక్యంచేసుకునేలా సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని వారు కోరారు. దీనిపై వివరాలు తెప్పించుకుంటానని నిత్యానందరాయ్ చెప్పినట్లు తెలుస్తోంది.

రక్షణ కోరుతూ ప్రధానికి అమరావతి జేఏసీ లేఖ
అమరావతి రైతుల పాదయాత్రకు వైసీపీ అడ్డంకులపై అటు అమరావతి పరిరక్షణ సమితి తరపున అమరావతి జేఏసీ చైర్మన్ జీవీఆర్ శాస్త్రి ఇవాళ లేఖ రాశారు. అమరావతి రైతుల మహాపాదయాత్రకు అధికార గణం అడ్డంకులు సృష్టిస్తోందని లేఖలో ప్రధానికి తెలిపారు. హైకోర్టు అనుమతి ఇచ్చినా వైసీపీ సర్కార్ రైతుల పాదయాత్రను అడ్డుకుంటోందని, జనాన్ని రెచ్చగొడుతోందని ఈ లేఖలో ఫిర్యాదు చేశారు. కాబట్టి కేంద్రం వెంటనే జోక్యం చేసుకుని హైకోర్టు తీర్పు అమలయ్యేలా చూడాలని అమరావతి జేఏసీ ప్రధానికి రాసిన లేఖలో కోరింది. ఈ మేరకు హోంశాఖ కార్యదర్శికి పాదయాత్రకు రక్షణ కల్పించేందుకు ఓ కమిటీ ఏర్పాటు చేసేలా తగిన ఆదేశాలు ఇవ్వాలని జేఏసీ ఛైర్మన్ కోరారు.
-
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
Chandrababu: కాఫీ విత్ చంద్రబాబు-కార్యకర్తల కోసం కొత్త కబుర్లు ఇవే..! -
ఏలినాటి శని వెంటాడుతోందా? 'పొంగు శని'ని దర్శించుకుంటే అష్టైశ్వర్యాలే! -
బంగారం ధరల్లో లాభాల మోత -
బెంగళూరు, మైసూర్ కు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్











Click it and Unblock the Notifications