వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సూపర్ హోం మినిస్టర్; దాడులపై మాట్లాడరు కానీ జగన్ ను ఒక్క మాట అంటే స్క్రిప్ట్ తో సహా.. అనిత కౌంటర్

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో అధికార వైసిపి, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఒకరిపై ఒకరు విమర్శలు ప్రతి విమర్శలతో తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. ఇక తాజాగా అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలపై మండిపడిన హోంమంత్రి మేకతోటి సుచరితను టార్గెట్ చేస్తూ టిడిపి మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు.

మహిళలపై దాడులు జరిగితే మాట్లాడని సూపర్ హోం మినిస్టర్

మహిళలపై దాడులు జరిగితే మాట్లాడని సూపర్ హోం మినిస్టర్

ఆడబిడ్డలను చంపినా, హత్యలు, అత్యాచారాలు చేసినా సూపర్ హోమ్ మినిస్టర్ మీడియా ముందుకు రారని, కానీ జగన్ ను ఎవరైనా ఒక్క మాట అంటే స్క్రిప్టు పట్టుకొని యుద్ధానికి వస్తారంటూ ద్వజమెత్తారు. 30 ఏళ్ల నాటి ఘటనలో నెమరేసుకుంటూ అప్పుడు శాంతిభద్రతలు లేవని ఇప్పుడు మేము శాంతిభద్రతలను చూస్తున్నామని చెప్పుకోడానికి హోం మంత్రికి సిగ్గుండాలి అని విమర్శించారు. వంగవీటి మోహన్ రంగా హత్య జరిగినప్పుడు చంద్రబాబు సీఎంగా లేరని గుర్తు చేశారు. అయ్యన్నపాత్రుడు మాట్లాడిన దాంట్లో ఎలాంటి తప్పు లేదని, హోం మంత్రి సుచరితకు అందులో తప్పులు ఏం కనిపిస్తున్నాయో చెప్పాలని నిలదీశారు.

ఆడబిడ్డలకు అన్యాయం జరిగితే కాపాడలేని పదవి ఎందుకు ?

ఆడబిడ్డలకు అన్యాయం జరిగితే కాపాడలేని పదవి ఎందుకు ?


ఉన్న పదవికి న్యాయం చేయాల్సిందిగా పోయి ఎవరి అడుగులకో మడుగులొత్తుతూ మోకాళ్ళ కింద నీళ్ళు తాగడం సిగ్గుమాలిన చర్య అని ఘాటుగా విమర్శించారు. రాష్ట్రంలో మహిళలపై అరాచకాలు పెట్రేగిపోతున్నా ఒక్క మాట కూడా మాట్లాడని హోంమంత్రి సుచరిత ముందు మహిళలపై జరుగుతున్న దారుణాలకు సమాధానం చెప్పాలన్నారు. ఆడబిడ్డలకు అన్యాయం జరుగుతుంటే రక్షణ కల్పించలేని పదవి ఎందుకు అంటూ హోం మంత్రి సుచరిత ను ప్రశ్నించారు. రాష్ట్రంలో లేని దిశ చట్టంతో ముగ్గురికి ఉరిశిక్ష వేసి, 20 మందికి పైగా శిక్షలు వేశామని చెప్పడానికి సిగ్గు ఉందా అంటూ ప్రశ్నించారు.

మహిళలపై జరుగుతున్న దారుణాలపై మాట్లాడటానికి నీకు నోరు లేదా ?

మహిళలపై జరుగుతున్న దారుణాలపై మాట్లాడటానికి నీకు నోరు లేదా ?

సీతానగరం దగ్గర యువతిపై సామూహిక అత్యాచారం జరిగితే ఏం చేసావ్ అంటూ ప్రశ్నించారు. పట్టపగలు నడిరోడ్డుపై మీద ప్రేమోన్మాది రమ్యను హత మారిస్తే ఇప్పటివరకు న్యాయం జరిగిందా అంటూ నిలదీశారు వంగలపూడి అనిత. దళిత ఆడబిడ్డను మానభంగం చేసి దిశ స్టేషన్ ముందు వదిలి వెళితే నీ నోరు ఏమైంది అంటూ హోంమంత్రి సుచరిత ను ప్రశ్నించారు. ఆడబిడ్డలకు అన్యాయం జరిగితే పరామర్శించడానికి వెళ్ళిన లోకేష్ ను రోడ్డు మీద తిరగనివ్వమని పోలీసులతో అరెస్టు చేస్తున్నారని పేర్కొన్న వంగలపూడి అనిత ఆంధ్రా నీ అమ్మ మొగుడు జాగీరా అంటూ హోంమంత్రి సుచరిత పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో ఇన్ని రోజులుగా ఆడపిల్లల పై దాడులు జరుగుతుంటే స్పందించని హోంమంత్రి అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యలపై స్పందించడం ఆమె తీరుకు అద్దం పడుతుందని వంగలపూడి అనిత విమర్శించారు.

తనను రాజీనామా చెయ్యమని అడగటానికి అయ్యన్న ఎవరన్న సుచరిత వ్యాఖ్యలు

తనను రాజీనామా చెయ్యమని అడగటానికి అయ్యన్న ఎవరన్న సుచరిత వ్యాఖ్యలు

ఇదిలా ఉంటే అంతకుముందు అయ్యన్నపాత్రుడు పై విరుచుకుపడిన హోంమంత్రి సుచరిత తనను రాజీనామా చేయమని అడగడానికి అయ్యన్నపాత్రుడు ఎవరు అంటూ ప్రశ్నించారు. అయ్యన్నపాత్రుడు మాట్లాడుతున్న భాష ఏంటి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ హయాంలో రంగాను హత్య చేసినప్పుడు అయ్యన్నపాత్రుడు కు శాంతిభద్రతలు గుర్తుకు రాలేదా అంటూ ప్రశ్నించారు. జగన్ పై కోడి కత్తితో దాడి చేసిన సమయంలో మాట్లాడలేదు ఎందుకు అంటూ నిలదీశారు.

సుచరిత వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన వంగలపూడి అనిత

దళిత మహిళను హోం మంత్రిని చేస్తే మీకు కడుపు మంటగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేసిన మేకతోటి సుచరిత సీఎం జగన్ ఆదేశిస్తే ఏ క్షణంలోనైనా రాజీనామా చేస్తానంటూ పేర్కొన్నారు. గతంలో టిడిపి మహిళలకు ఏం న్యాయం చేసిందో చెప్పాలని, చంద్రబాబుకు మహిళలపై గౌరవం ఉంటే అయ్యన్నపాత్రుడు పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహిళల గురించి మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలని పేర్కొన్న సుచరిత తెలుగుదేశం పార్టీ తీరుపై నిప్పులు చెరిగారు. ఇక సుచరిత వ్యాఖ్యలపై మండిపడిన వంగలపూడి అనిత హోం మంత్రి వ్యాఖ్యలకు ఘాటుగా సమాధానమిచ్చారు.

English summary
Vangalapudi Anita reverse attack on home minister sucharitha. Anitha asked home minister to resign her post as a minister. She criticised that home minister never speak about atrocities on women but home minister will broke out over opposition comments on jagan
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X