Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

గంటాకు సీటు ఖరారు - టీడీపీ తుది జాబితా విడుదల, లిస్టులో..!!

టీడీపీ అధినేత చంద్రబాబు తమ పార్టీ అభ్యర్దుల తుది జాబితా విడుదల చేసారు. 4 ఎంపీ, 9 మంది ఎమ్మెల్యే అభ్యర్దులను ప్రకటించారు. పొత్తులో భాగంగా టీడీపీ 144 అసెంబ్లీ, 17 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తోంది. ఇప్పటి వరకు రెండు విడతలుగా ప్రకటించిన జాబితాల్లో 13 ఎంపీ, 135 మంది ఎమ్మెల్యే అభ్యర్దులను ఖరారు చేసారు. పొత్తుల్లో సర్దుబాట్లలో భాగంగా కొన్ని సీట్లలో మార్పు జరిగింది. దీంతో, చివరి విడత జాబితా లో పెండింగ్ ఉన్న ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్దులను ఖరారు చేసారు.

ఎంపీ అభ్యర్దులు
ఎంపీ స్థానాల్లో విజయనగరం నుంచి కలిశెట్టి అప్పలనాయుడును బరిలోకి దించారు. అదే విధంగా ఒంగోలు స్థానం నుంచి తొలుత మాగుంట తనయుడు రాఘవరెడ్డి పేరు ఖరారు చేయాలని భావించినా, ఢిల్లీ లిక్కర్ కేసు కారణంగా తిరిగి మాగుంట శ్రీనివాసుల రెడ్డి పేరును ప్రకటించారు. 2019 ఎన్నికల్లో మాగుంట వైసీపీ నుంచి ఒంగోలు ఎంపీగా గెలుపొందారు.

TDP Announces contesting candidates for Pending Loksabha and Assembly seats

అనంతపురం నుంచి అనూహ్యంగా అంబికా లక్ష్మీనారాయణ పేరును ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇక, కడప నుంచి భూపేష్ రెడ్డికి అవకాశం కల్పించారు. భూపేష్ రెడ్డి జమ్మలమడుగు స్థానం ఇంఛార్జ్ గా ఉన్నారు. జమ్మలమడుగు పొత్తులో భాగంగా బీజేపీకి వెళ్లటంతో అక్కడ ఎమ్మెల్యేగా ఆదినారాయణ రెడ్డి పోటీ చేస్తున్నారు.

ఎమ్మెల్యే స్థానాలు ఖరారు
దీంతో, భూపేష్ రెడ్డికి కడప స్థానం నుంచి అవకాశం కల్పించారు. పెండింగ్ లో ఉన్న తొమ్మది ఎమ్మెల్యే స్థానాల్లోనూ టీడీపీ అభ్యర్దులను ఖరారు చేసింది. చీపురుపల్లి నుంచి టీడీపీ ఏపీ మాజీ అధ్యక్షుడు కళా వెంకట్రావు పేరును ప్రకటించారు. ఈ స్థానం నుంచి పోటీ చేయాలని గంటాను చంద్రబాబు కోరారు. అయితే, పలుమర్లు చర్చల తరువాత గంటా అక్కడ నుంచి పోటీకి సుముఖత వ్యక్తం చేయలేదు.

దీంతో, చివరగా గంటా కోరుకున్నట్లుగానే భీమిలి సీటు ఖరారు చేసారు. పాడేరు నుంచి కిల్లు రమేష్ నాయుడు ను అభ్యర్దిగా టీడీపీ ఖరారు చేసింది. దర్శి నుంచి అనూహ్యంగా గొట్టిపాటి లక్ష్మీ పేరును టీడీపీ ప్రకటించింది. ఇక్కడ తొలుత సిద్దా కుటుంబానికి ఇవ్వాలని భావించారు. కానీ, సిద్దా తాజాగా సీఎం జగన్ తో భేటీ తరువాత నిర్ణయం మారింది.

అనూహ్య ఎంపిక
వీటితో పాటుగా రాజంపేట నుంచి సుగవాసి సుబ్రమణ్యం, ఆలూరు నుంచి వీరభద్ర గౌడ్, గుంతకల్ నుంచి గుమ్మనూరు జయరాం పేర్లు ప్రకటించారు. గుంతకల్ లో టీడీపీ నుంచి ముగ్గురు నేతలు టికెట్ కోసం రేసులో ఉన్నారు. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన జయరాంకు సీటు ఖాయం చేసారు. దీంతో, అక్కడ ఇతర పోటీ నేతల నుంచి స్పందన ఎలా ఉంటుందనేది చూడాలి.

అదే విధంగా..అనంతపురం నుంచి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ పేరు ప్రకటించారు. కదిరి నుంచి కందికుంట వెంకట ప్రసాద్ పేరును ఖరారు చేసారు. దీని ద్వారా టీడీపీ నుంచి పోటీ చేసే మొత్తం 17 మంది ఎంపీ, 144 మంది అభ్యర్దుల పేర్లను టీడీపీ అధికారికంగా ప్రకటించింది. ఈ జాబితా తరువాత సీటు ఆశించి..భంగపడిన వారి స్పందన ఎలా ఉంటుందనేది చూడాలి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+