హెరాయిన్, డ్రగ్స్ మాఫియాపై సీఎం జగన్ కు నవరత్నాల్లాంటి తొమ్మిది ప్రశ్నలు; సమాధానం చెప్పమన్న టీడీపీ !!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియా రెచ్చిపోతోందని, ఇక ఈ డ్రగ్స్ మాఫియా వెనుక అధికార పార్టీ నేతలు ఉన్నారని తెలుగుదేశం పార్టీ అధికార వైసీపీపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏకంగా సీఎం జగన్ నే టార్గెట్ చేసి మరీ ఆరోపణలు చేస్తున్నారు. జగన్ ఈ వ్యవహారంపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఏపీలో జోరుగా డ్రగ్స్ స్మగ్లింగ్ జరుగుతుందని, తాడేపల్లికి కూతవేటు దూరంలోనే జరుగుతుంటే జగన్ కు తెలీదా అని టీడీపీ నేతలు పదే పదే జగన్ ను టార్గెట్ చేస్తున్నారు.

డ్రగ్స్ వ్యవహారంపై జగన్ కు టీడీపీ ప్రశ్నాస్త్రాలు, సమాధానం చెప్పాలని డిమాండ్
తాజాగా తెలుగు దేశం పార్టీ డ్రగ్స్ వ్యవహారంలో జగన్ కు పలు ప్రశ్నాస్త్రాలు సంధించింది. ఏపీలో జగన్ నవరత్నాలు పేరుతో సంక్షేమ పథకాలను అమలు చేస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు నవరత్నాల అమలుపై దృష్టి పెట్టి పలు సంక్షేమ పథకాలను అందిస్తున్నారు. టీడీపీ జగన్ నవరత్నాలను డ్రగ్స్ వ్యవహారంలో తాము సంధిస్తున్న ప్రశ్నలకు లింక్ చేసి నవరత్నాలు లాంటి ప్రశ్నలు అంటూ జగన్ సర్కార్ సమాధానం చెప్పాలని సోషల్ మీడియా వేదికగా టీడీపీ పదునైన ప్రశ్నాస్త్రాలు సంధిస్తోంది.

హెరాయిన్ పై జగన్ కు టీడీపీ సంధించిన నవరత్నాల్లాంటి తొమ్మిది ప్రశ్నలు
టిడిపి సంధించిన ప్రశ్నలను చూస్తే హెరాయిన్ సరుకు తాలిబన్ల నుండి వచ్చింది నిజమా కాదా? సరుకు మీద ఉన్న ఆషి ట్రేడింగ్ కంపెనీ విజయవాడలో ఉందా లేదా? జిఎస్టి నెంబర్ ఉందా లేదా ? జగన్ సమాధానం చెప్పాలని తెలుగుదేశం పార్టీ ప్రశ్నించింది. గుజరాత్ లోని ముంద్రా పోర్టులో భారీగా దొరికిన హెరాయిన్ విజయవాడ అడ్రస్ తో ఉండడంతో, ఆ సరుకు ఆఫ్ఘనిస్తాన్ నుండి వచ్చింది కావడంతో, ఇక జీఎస్టీ నెంబర్ కూడా దానికి ఉన్న నేపథ్యంలో ఈ ప్రశ్నను సంధించింది. హెరాయిన్ వార్త వచ్చిన గంటలో నే విజయవాడ సీపీ క్లీన్ చిట్ ఎలా ఇస్తారు? కనీసం ప్రాథమిక ఎంక్వైరీ చేశారా ? అంటూ ప్రశ్నించింది. ఏపీకి సంబంధించిన అడ్రస్ తో భారీ డ్రగ్స్ పట్టుబడ్డాయి అని వార్త వచ్చిన గంటలోనే విజయవాడ సీపీ క్లీన్ చిట్ ఇవ్వడంపై టిడిపి ప్రశ్నిస్తోంది.

డ్రగ్స్ కేసు వెనకున్న బిగ్ బాస్ పై ఎందుకు విచారణ చేయలేదని ప్రశ్న
అంతేకాదు ఇప్పటివరకు కాకినాడకు చెందిన సుధాకర్ ఆషీకీ ట్రేడింగ్ కంపెనీ ఓనర్ పై, అతని భార్య పై మీ ప్రభుత్వం ఏం దర్యాప్తు చేసింది అని తెలుగుదేశం పార్టీ నిలదీసింది. ఏ ప్రాతిపదికన ఇంత పెద్ద హెరాయిన్ ముఠాతో మీకు సంబంధం లేదని క్లీన్ చిట్ ఇస్తారని ప్రశ్నించింది. అతి సాధారణ వ్యక్తిగా కనిపిస్తున్న మాచవరపు సుధాకర్ విజయవాడలో ఆఫీసు పెట్టి తాలిబన్ల నుంచి 72 వేల కోట్ల హెరాయిన్ స్మగ్లింగ్ చేస్తాడా? ఇతని వెనుకున్న బిగ్ బాస్ పై మీరు ఎందుకు విచారణ చేయలేదు అంటూ జగన్ సర్కార్ కు సూటి ప్రశ్నలు సంధించింది.

జూన్ లో 24 టన్నుల హెరాయిన్ ఆఫ్ఘనిస్తాన్ నుండి విజయవాడకు .. దీనికి సమాధానం
గత జూన్ నుంచి 24 టన్నుల హెరాయిన్ ఆఫ్ఘనిస్తాన్ నుండి విజయవాడకు వచ్చిందని నేషనల్ మీడియా చెప్పిందని దీనిపై ఎందుకు మాట్లాడరో చెప్పాలని టిడిపి ప్రశ్నించింది. ఆషి ట్రేడింగ్ కంపెనీ గతేడాది రిజిస్టర్ అయిందని, విజయసాయిరెడ్డికి చెందిన కాకినాడ పోర్ట్ నుండి 24 టన్నుల సరుకు విదేశాలకు పంపిస్తుంటే మీకు అనుమానం రాలేదా? అని ప్రశ్నించింది. నెల రోజుల క్రితం బెంగుళూరులో పట్టుబడిన సింథటిక్ డ్రగ్స్ మూలాలు ఏపీలో ఉన్నాయని తేలాయని, దీనిపై ఎందుకు స్పందించలేదని టీడీపీ ప్రశ్నించింది.

డీఆర్ఐ అధికారుల హెచ్చరికలపై ఏమంటారు ?
డీఆర్ఐ అధికారులు ఆంధ్ర బోర్డర్స్ లో జాగ్రత్తగా ఉండాలని మన పక్క రాష్ట్రాలను ఎందుకు హెచ్చరిస్తున్నారో చెప్పాలని జగన్ సర్కార్ కు సూటి ప్రశ్నలు వేసింది టిడిపి.ఇప్పటికే ఏపీ కేంద్రంగా పెద్ద ఎత్తున డ్రగ్స్ మాఫియా సాగుతోందని, వైసీపీ ప్రభుత్వానికి హెరాయిన్ లింకులు ఉన్నట్లుగా టిడిపి నేతలు విమర్శలు చేస్తున్నారు. పట్టుబడిన 72 వేల కోట్ల హెరాయిన్ వెనుక బిగ్ బాస్ ఎవరంటే వైసిపి భుజాలు తడుముకుంటోంది అని జగన్ ను టార్గెట్ చేస్తూ ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఇదే సమయంలో డ్రగ్స్ పై తాము రాజకీయం చెయ్యటం లేదని ఏపీ భవిష్యత్ ముఖ్యమని టీడీపీ నేతలు చెప్తున్నారు.

ఏపీ అతి పెద్ద డ్రగ్స్ మాఫియాకి కేంద్రం కావటం వెనుక కింగ్ పిన్ ఎవరు?
దేశంలోనే ఏపీ అతి పెద్ద డ్రగ్స్ మాఫియాకి కేంద్రం కావటం వెనుక కింగ్ పిన్ ఎవరు అని ప్రశ్నిస్తున్నారు టీడీపీ నేతలు. జగన్ సమాధానం చెప్పాలని అంటున్నారు. డ్రగ్స్ వ్యవహారంలో ఇంత దుమారం కొనసాగుతున్నా ఏపీ పోలీసులు ఎందుకు ఇప్పటి వరకు ఎలాంటి విచారణ చెయ్యటం లేదని ప్రశ్నిస్తున్నారు. హెరాయిన్ కేసులో అరెస్ట్ అయిన సుధాకర్ ది ద్వారపూడి అని అక్కడ ఎమ్మెల్యేతో సుధాకర్ కు ఏమైనా లింకులు ఉన్నాయా అన్నది విచారణ జరపాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. జగన్ కు, వైసీపీ నేతలకు ఈ వ్యవహారంతో సంబంధం లేకుంటే సీబీఐ విచారణ కోరాలని డిమాండ్ చేస్తున్నారు. ఆఫ్ఘనిస్థాన్ వంటి దేశాల నుండి ఎపీకి డ్రగ్స్ దిగుమతి అవుతున్నాయని, ఇక రాష్ట్రం నుండి బ్లాక్ మనీ ఎక్స్ పోర్ట్ అవుతుందని మండిపడుతున్నారు. ప్రతిపక్షాల ప్రశ్నలకు బాధ్యత ఉన్న ముఖ్యమంత్రిగా సమాధానం చెప్పాలని టీడీపీ నేతలు పదేపదే డిమాండ్ చేస్తున్నారు.
-
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..!












Click it and Unblock the Notifications