Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

గంజాయి సాగు ఆపలేని పోలీసులు, నక్కా ఆనంద్ బాబుకు నోటీసులు ఇవ్వటానికి వచ్చారా? టీడీపీ ఎటాక్ !!

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత,మాజీ మంత్రి నక్కా ఆనందబాబుకు నర్సీపట్నం పోలీసులు నోటీసులు ఇవ్వడం తెలుగుదేశం పార్టీ నేతలకు ఆగ్రహం తెప్పిస్తుంది. రాష్ట్రం గంజాయి దందాకు అడ్డాగా మారుతున్నా, డ్రగ్స్ స్మగ్లింగ్ కొనసాగుతున్నా, గంజాయి సాగును నివారించలేని, డ్రగ్స్ ను పూర్తిగా అరికట్టలేని పోలీసులు ఇదేంటి అని ప్రశ్నిస్తున్న టిడిపి నేతలకు నోటీసులు ఇవ్వడాన్ని తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్రంగా తప్పు పడుతున్నారు.

నర్సీపట్నం పోలీసులు గుంటూరు వచ్చి మరీ నోటీసులిస్తారా ?

నర్సీపట్నం పోలీసులు గుంటూరు వచ్చి మరీ నోటీసులిస్తారా ?

మాజీ మంత్రి నక్కా ఆనందబాబు పోలీసులు నోటీసులు ఇవ్వడం దారుణం అంటూ టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.రాష్ట్రంలో మాదకద్రవ్యాల పై ఆనంద్ బాబు మీడియా సమావేశంలో మాట్లాడితే అర్ధరాత్రి పోలీసులు ఆనంద్ బాబు ఇంటి పైకి రావడం ఏమిటీ అంటూ మండిపడ్డారు. నర్సీపట్నం పోలీసులు అక్కడి నుండి గుంటూరు రావడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసిన పట్టాభి పక్కనున్న ఏజెన్సీ ప్రాంతంలో గంజాయి సాగు జరుగుతుంటే అక్కడికి వెళ్లే తీరిక లేకుండా పోలీసులు ఉన్నారని, కానీ ఆనంద్ బాబు కు నోటీసులు ఇవ్వడానికి మాత్రం నర్సీపట్నం నుంచి గుంటూరు దాకా ఆగమేఘాల మీద వచ్చారు అంటూ మండిపడ్డారు.

 ఏపీని డ్రగ్స్ కి అడ్డాగా మార్చేశారు : బోండా ఉమా

ఏపీని డ్రగ్స్ కి అడ్డాగా మార్చేశారు : బోండా ఉమా

పోలీసులు అన్ని విషయాల్లో ఇంత మెరుపు వేగంతో పని చేస్తే బాగుండేదని ఎద్దేవా చేశారు. ఇదే సమయంలో దళితులపై దాడులు జరిగినా పోలీసుల స్పందన కరువు అంటూ ఆయన అసహనం వ్యక్తం చేశారు టీడీపీ నేత పట్టాభి. నక్క ఆనంద్ బాబు కు పోలీసులు నోటీసులు జారీ చేయడంపై టిడిపి పోలిట్బ్యూరో సభ్యుడు బోండా ఉమా ఏపీ సర్కార్ ను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మాదకద్రవ్యాల అడ్డాగా వైసీపీ మార్చేసిందని, ఇదే విషయాన్ని మేం మాట్లాడితే నోటీసులు ఇస్తారా అంటూ మండిపడ్డారు. గంజాయి పై వాస్తవాలను ప్రజలకు తెలియజేస్తే నక్కా ఆనందబాబుకు నోటీసులు ఇవ్వడంలో అర్థం ఏమిటి అంటూ ప్రశ్నించారు.

వైసిపి నాయకులు గంజాయి వ్యాపారం హోల్ సేల్ గా చేస్తున్నారు : బోండా ఉమా

వైసిపి నాయకులు గంజాయి వ్యాపారం హోల్ సేల్ గా చేస్తున్నారు : బోండా ఉమా

ఒక్క విశాఖ లోనే కాదు రాష్ట్రమంతటా వైసిపి నాయకులు గంజాయి వ్యాపారం హోల్ సేల్ గా చేస్తున్నారంటూ బోండా ఉమ తీవ్ర విమర్శలు చేశారు. పోలీసులు అసలు వ్యాపారం చేస్తున్న వారిని వదిలేసి ప్రశ్నిస్తున్న టిడిపి నేతలకు నోటీసులు జారీ చేయడం ఏమిటి అంటూ నిలదీశారు. తెలుగుదేశం పార్టీ నాయకులను పోలీసులు వేధిస్తున్నారంటూ మండిపడ్డారు. జగన్ సర్కార్ నిందితులకు రక్షణ కల్పిస్తూ, ప్రశ్నిస్తున్న వారిని వేధిస్తోంది అంటూ అసహనం వ్యక్తం చేశారు బోండా ఉమ.

తెలంగాణా పోలీసులు వచ్చింది గంజాయి స్మగ్లర్ల కోసం కాదా : బోండా ఉమా

తెలంగాణా పోలీసులు వచ్చింది గంజాయి స్మగ్లర్ల కోసం కాదా : బోండా ఉమా

కేంద్ర నిఘా వర్గాల అంచనా ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేల ఎకరాలలో గంజాయి సాగు జరుగుతుందని, ఇతర రాష్ట్రాల్లో దొరుకుతున్న గంజాయికి కూడా ఏపీలోనే మూలాలు ఉన్నాయి అని పక్క తెలంగాణ రాష్ట్రంలో కూడా ఏపీ గంజాయి ముఠాలు దొరుకుతున్నాయని పేర్కొన్నారు. తెలంగాణ పోలీసులు విశాఖ ఏజెన్సీ లోకి వచ్చి గంజాయి స్మగ్లర్ల కోసం గాలిస్తున్నారంటే దాని అర్ధం ఏమిటో చెప్పాలని ప్రశ్నించారు. తెలంగాణ పోలీసులు విశాఖకు వచ్చింది గంజాయి స్మగ్లర్ల కోసం కాదా అంటూ ప్రశ్నించిన బోండా ఉమ, ఇదే విషయాన్ని ప్రశ్నిస్తే నోటీసులు ఇస్తారా చెప్పాలంటూ పోలీసులను డిమాండ్ చేశారు.

నక్కా ఆనందబాబు ఇంటికి అర్ధరాత్రి పోలీసులు రావడం దుర్మార్గం : ప్రత్తిపాటి పుల్లారావు

నక్కా ఆనందబాబు ఇంటికి అర్ధరాత్రి పోలీసులు రావడం దుర్మార్గం : ప్రత్తిపాటి పుల్లారావు

ఇదిలా ఉంటే మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఇంటికి అర్ధరాత్రి పోలీసులు రావడం దుర్మార్గమని మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో గంజాయి సాగు, అమ్మకాలు విచ్చలవిడిగా సాగుతున్నాయని ఆయన ఆరోపించారు. పోలీస్ వ్యవస్థ వైసీపీ నేతలకు ఊడిగం చేస్తోందని పత్తిపాటి పుల్లారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో గంజాయి సాగు, గంజాయి అక్రమ రవాణా విచ్చలవిడిగా సాగుతుంటే ప్రశ్నించని పోలీసులు, సమస్యను ఎత్తిచూపి వారిని బెదిరించి ధోరణి అవలంబిస్తున్నారు అంటూ మండిపడ్డారు.

ప్రశ్నిస్తే నోటీసులు ఇస్తారా : ప్రత్తిపాటి పుల్లారావు

ప్రశ్నిస్తే నోటీసులు ఇస్తారా : ప్రత్తిపాటి పుల్లారావు

కొంతమంది పోలీసులు వల్ల పోలీసుశాఖ పరువు పోతుందని పత్తిపాటి పుల్లారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు సైతం పోలీసుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గంజాయి దందా జరుగుతుంటే దాన్ని అడ్డుకోవడం పోయి, ప్రశ్నించిన టీడీపీ నేతలకు నోటీసులు ఇవ్వడం ఏమిటంటూ ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. పోలీసుల తీరును పదేపదే ప్రశ్నిస్తున్నారు. తాము అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పాలని టీడీపీ నేతలు పోలీసులను నిలదీస్తున్నారు.

తెలంగాణా పోలీసులపై విశాఖ ఏజెన్సీ స్మగ్లర్ల దాడిపై నక్కా ఆనంద్ బాబు సూటి ప్రశ్నలు

తెలంగాణా పోలీసులపై విశాఖ ఏజెన్సీ స్మగ్లర్ల దాడిపై నక్కా ఆనంద్ బాబు సూటి ప్రశ్నలు

సోమవారం టిడిపి నాయకుడు, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఏపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖ ఏజెన్సీలో గంజాయి స్మగ్లర్లు తెలంగాణ పోలీసులపై సినీఫక్కీలో దాడికి పాల్పడిన ఘటనపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. అక్రమార్జన, దోపిడీ కోసం రాష్ట్రాన్ని మాదకద్రవ్యాల ముఖ్య కేంద్రంగా మార్చారని, అన్నపూర్ణలాంటి ఆంధ్రప్రదేశ్ ను గంజాయి అడ్డాగా మార్చారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

విశాఖ ఏజెన్సీలో తెలంగాణ పోలీసులు వచ్చి దాడి చేసే వరకూ ఏపీ ప్రభుత్వానికి అక్కడ గంజాయి దందా జరుగుతుంది తెలీదా అంటూ ప్రశ్నించారు. తెలంగాణ పోలీసులకు ఉన్న గంజాయి స్మగ్లర్ల సమాచారం ఏపీ పోలీసులకు లేదా అంటూ నిలదీశారు. గంజాయి సాగుకు, అక్రమ రవాణాకు ప్రభుత్వ సహాయ సహకారాలు ఉండబట్టే ఏపీ పోలీస్ శాఖ ఏమీ చేయలేక పోతుందని ఆయన జగన్ సర్కార్ ను టార్గెట్ చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+