ఏపీ ఆర్థిక పరిస్థితి దివాలా.. మద్యం ఆదాయంతోనే జగన్ పాలన !! : అయ్యన్న పాత్రుడు

ఏపీలో రాజకీయం వేడెక్కింది. ఆధికార, విఫక్షాల మధ్య మాటల యుద్దం తారాస్థాయికి చేరింది. సీఎం జగన్ పాలన ఆరాచకాలకు కేరాఫ్‌గా మారిందని ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. రాష్ట్రంలో వైసీపీ నేతలు దారుణాలకు తెగబడుతున్నారని విమర్శించారు. ప్రజల ప్రాణాలకు రక్షణ లేకుండా పోతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు అధికారమిచ్చింది.. దోపిడీలు, దౌర్జ‌న్యాలు, కబ్జాలు, అడ్డొచ్చినవారిపై కేసులు, లేక చంపడమే లైసెన్సుగా వైసీపీ నాయకులు భావిస్తున్నారని మండిపడ్డారు. మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 ఏపీ ఆర్థిక పరిస్థితి దివాలా..

ఏపీ ఆర్థిక పరిస్థితి దివాలా..


రాష్ట్రాన్ని అప్పులు కుప్పగా ముఖ్యమంత్రి జగన్ మార్చేశారని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలన చేతకాని సీఎం మనకు ఉండడం దౌర్భాగ్యమని దుయ్యబట్టారు. ప్రజల జీవితాలతో జగన్ ఆడుకుంటున్నారని మండిపడ్డారు. వైసీపీ మూడేళ్లపాలనలో ఏపీ ఆర్థికంగా దివాలా తీసిందని ఆరోపించారు. రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ తీసుకురాని జగన్.. మద్యం అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయంతోనే రాష్ట్రాన్ని పాలిస్తున్నారని విమర్శించారు. ఈ విషయాన్ని స్వయంగా ముఖ్యమంత్రి జగన్ అసెంబ్లీలో అనడం సిగ్గుచేటని విరుచుకుపడ్డారు.

 రాష్ట్ర ఖ‌జానాను దోచుకుంటున్న వైసీపీ ..

రాష్ట్ర ఖ‌జానాను దోచుకుంటున్న వైసీపీ ..

వైసీపీ నేతల దౌర్జన్యాలతో ఏపీకి వచ్చిన పరిశ్రమలు కూడా పొరుగు రాష్ట్రాలకు పారిపోతున్నాయని అయ్యన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర సంపదను దొచుకుంటున్నారని విమర్శించారు. వైసీపీ నేతల దుర్మార్గాలకు ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఖజానాలో ఉన్న డబ్బులను కూడా దోచేశారని దుయ్యబట్టారు. సుమారు 48 వేల కోట్లకు సంబంధించిన వాటికి లెక్కలు లేవన్న విషయాన్ని కాగ్ తన నివేదికలో స్పష్టం చేసిందని అయన్న పాత్రుడు గుర్తు చేశారు.

 ఏపీ అప్పు.. రూ.7ల‌క్ష‌ల కోట్లు

ఏపీ అప్పు.. రూ.7ల‌క్ష‌ల కోట్లు

ఏపీలో ఇంతటి దుర్మార్గాలు జరుగుతున్నా కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు నిలదీశారు. కాగ్ నివేదికలో పేర్కొన్న రూ.48 వేల కోట్లకు సంబంధించిన లెక్కలపై సీబీఐతో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. ఈ మూడేళ్లలో దాదాపు రూ.7 లక్షల కోట్లు అప్పులు చేశారని.. ఆ సొమ్మును ఎవరు తీరుస్తారని జ‌గ‌న్‌ను అయ్య‌న్న నిల‌దీశారు. ప్రజల నెత్తిన పన్ను వేసి పీల్చుకుతింటున్నారని దుయ్యబట్టారు. కల్తీ మద్యంతో ప్రజల ప్రాణాలు పోతున్నా.. సీఎం జగన్ హేళనగా మాట్లాడుతున్నరని దుయ్యబట్టారు. ఇప్పటికైన జగన్ తన వైఖరిని మార్చుకోవాలని అయ్యన్న హితవు పలికారు. ప్రజలు బుద్ది చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+