ఏపీలో టీడీపీ బీజేపీ పొత్తు: అమిత్ షాతో భేటీలో ఫైనల్ అయ్యిందిదే!!

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా గడిపారు. నిన్న రాత్రి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తో చంద్రబాబు భేటీ అయ్యి కీలక అంశాలను మాట్లాడారు. ఈ క్రమంలో ఇరు పార్టీలు పొత్తులపై క్లారిటీకి వచ్చినట్టుగా తెలుస్తుంది. అమిత్ షా తో భేటీ సందర్భంగా ఇరు పార్టీలు కలిసి పనిచేయాలని భావిస్తున్నట్లుగా సమాచారం.

దేశ, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇరు పార్టీలు కలిసి పనిచేయడం పైన నిన్న రాత్రి జరిగిన చర్చల్లో ఒక అవగాహనకు వచ్చినట్టు తెలుస్తుంది. నిన్న రాత్రి 11:30 గంటల సమయంలో చంద్రబాబుతో బీజేపీ అగ్రనేతలైన అమిత్ షా, జేపీ నడ్డా ఇరువురు నేతలు సమావేశమై సుమారు గంట పాటు చర్చలు జరిపారు.

TDP-BJP alliance in AP: chandrababu meeting with Amit Shah is finalized!!

రానున్న పార్లమెంట్ ఎన్నికలలో నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఎన్డీఏ కూటమిని బలోపేతం చేయడంలో భాగంగా ప్రధానంగా దృష్టి సారించినట్టు పేర్కొన్న అమిత్ షా , దేశాన్ని అన్ని ప్రాంతాల్లో బలోపేతం చేయాలంటే తమ కూటమికి కలిసొచ్చే ప్రాంతీయ పార్టీల పొత్తు కూడా అవసరమని అమిత్ షా చంద్రబాబుకు చెప్పినట్టు సమాచారం.

లోక్ సభ ఎన్నికల్లో 400 సీట్లకు పైగా సాధించాలని విజయాన్ని లక్ష్యంగా పెట్టుకొని ముందుకు వెళ్తున్నట్టు అమిత్ షా పేర్కొన్నట్టు సమాచారం. రాష్ట్రంలో బిజెపి తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకుంటే సీట్ల సర్దుబాటు ఎలా అన్న అంశం పైన కూడా ఇరువురు నేతలు చర్చించినట్టు సమాచారం. బిజెపి గెలిచే అవకాశాలున్న సీట్ల గురించి కూడా అమిత్ షా చంద్రబాబుతో ఆరా తీసినట్లు గా చెబుతున్నారు.

రాష్ట్రంలో జగన్ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని తమకు సమాచారం ఉందని అమిత్ షా చంద్రబాబుతో చెప్పినట్టు కూడా ప్రచారం జరుగుతుంది. ఒకరికొకరు పరస్పరంగా సహాయం చేసుకుంటూ ముందుకు సాగాలని కూడా భేటీలో చర్చకు వచ్చింది. అయితే తాజాగా బయటకు వస్తున్న విషయాల ప్రకారం టీడీపీ బీజేపీ పొత్తు ఫైనల్ అని, అయితే అధికారికంగా ప్రకటించాల్సి ఉందని ప్రచారం జోరుగా సాగుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+