వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అంబులెన్స్‌ల నిలిపివేత-కేసీఆర్‌పై ఏపీ విపక్షాల ఫైర్‌-కేసులు పెట్టాలని డిమాండ్‌

|
Google Oneindia TeluguNews

ఏపీ, తెలంగాణ మధ్య విభజన తర్వాత నెలకొన్న సమస్యల పరిష్కారానికే ఇప్పటికీ దిక్కులేని పరిస్ధితి. ఉన్న వివాదాలనే పరిష్కరించుకోలేక ఇబ్బందులు పడుతున్న ఇరు ప్రభుత్వాలు ఇప్పుడు కోవిడ్‌ సమయంలో మానవత్వం మరిచి పోలీసులు సరిహద్దుల్లో అంబులెన్స్‌లు నిలిపేస్తున్నా ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్ధితుల్లోకి వెళ్లిపోయాయి.. సాక్షాత్తూ తెలంగాణ హైకోర్టు అక్షింతలు వేసినా పట్టించుకోకుండా మరోసారి ఏపీ సరిహద్దుల్లో తెలంగాణ పోలీసులు అంబులెన్స్‌లు నిలిపేస్తుండంపై విపక్షాలు మండిపడుతున్నాయి.

 అంబులెన్స్‌ల్ని మళ్లీ అడ్డుకున్న తెలంగాణ

అంబులెన్స్‌ల్ని మళ్లీ అడ్డుకున్న తెలంగాణ

ఏపీ నుంచి తెలంగాణకు వెళ్లే సరిహద్దుల్లో ఏపీకి చెందిన అంబులెన్స్‌లను అడ్డుకుంటూ తెలంగాణ పోలీసులు ఇవాళ మరోసారి కర్కశత్వం ప్రదర్శించారు. ఆస్పత్రులకు వెళ్లే్ందుకు తమకు అన్ని అనుమతులు ఉన్నాయని చెప్పినా పోలీసులు మాత్రం పట్టించుకోలేదు. ఆస్పత్రుల్లో బెడ్లు ఖాళీగా ఉన్నాయని తేలాకే పంపుతామని ఓసారి, తెలంగాణ హెల్త్‌ డైరెక్టర్‌ అనుమతి కూడా ఉండాలని మరోసారి అంబులెన్స్‌ డ్రైవర్లకు చెప్పి నిలిపేశారు. దీంతో రోగులు సరిహద్దుల్లో నరకయాతన అనుభవిస్తున్నారు.

 కేసీఆర్‌, జగన్ స్పందించాలన్న టీడీపీ

కేసీఆర్‌, జగన్ స్పందించాలన్న టీడీపీ

తెలంగాణ సరిహద్దుల్లో ఏపీ అంబులెన్స్‌ల నిలిపివేతపై ఇరురాష్ట్రాల సీఎంలు కేసీఆర్‌, జగన్‌ స్పందించాలని టీడీపీ డిమాండ్‌ చేసింది. కోర్టులు చెప్తున్నా ప్రభుత్వాలు స్పందించకపోవడం దౌర్భాగ్యమని టీడీపీ సీనియర్‌ నేత బుచ్చయ్యచౌదరి ట్వీట్‌ చేశారు.

కేసుల మాపీ కోసం రాష్ట్ర ప్రయోజనాలు కేంద్రానికి తాకట్టు పెట్టినట్టు స్వ ప్రయోజనాలకు రాష్ట్ర హక్కుల్ని కూడా కేసీఆర్ కి తాకట్టు పెట్టారా?
అని టీడీపీ ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు జగన్‌ సర్కార్‌ను ప్రశ్నించారు. వెంటనే కేసీఆర్‌తో మాట్లాడి జగన్‌ ఈ సమస్యకు పరిష్కారం చూపాలన్నారు.

 కేసీఆర్‌పై జగన్‌ కేసు పెట్టాలన్న బీజేపీ

కేసీఆర్‌పై జగన్‌ కేసు పెట్టాలన్న బీజేపీ

హైదరాబాద్‌లో సెక్షన్ 8 చట్టాన్ని కేసీఆర్‌ సర్కార్‌ కాలరాస్తోందని బీజేపీ నేత విష్ణువర్ధన్‌రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ పోలీసులు ఏపీ ప్రజలను రెండో తరగతి ప్రజలుగా చూస్తున్నారని, ఓ మనిషి పుట్టిన ప్రాంతాన్ని బట్టి వ్యత్యాసం చూపించడం రాజ్యాంగం ఇచ్చిన ప్రాధమిక హక్కులను ఉల్లంఘించడమేనని విష్ణు అన్నారు. విదేశాల నుంచి వచ్చే వారిని అనుమతిస్తూ ఏపీ వారిని అడ్డుకోవడమేంటని ఆయన ప్రశ్నించారు. ఏపీ రోగుల మరణానికి కారణమవుతున్నవారిపై ఏపీ సర్కార్‌ కేసులు నమోదు చేయాలని సూచించారు. తెలంగాణ పోలీసులైనా, ప్రభుత్వంలో ముఖ్యమంత్రి స్ధాయి వ్యక్తులైనా, మంత్రులు, ఉన్నతాధికారులైనా చట్టానికి అతీతులేం కాదని విష్ణు అన్నారు. వారిపై కేసులు నమోదుచేయాలని, ఏపీ ముఖ్యమంత్రి స్పందించాలని విష్ణు డిమాండ్‌ చేశారు.

English summary
oppositition parties in andra pradesh on today slams both andhra and telangana governments for restrictions on ambulances at state borders.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X