వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్‌కు షాక్: పోలవరంపై బిజెపి, టిడిపిల ఏకాభిప్రాయం, వైసీపీకి బాబు చెక్

By Narsimha
|
Google Oneindia TeluguNews

అమరావతి: పోలవరం ప్రాజెక్టుపై విపక్షాల నుండి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న తరుణంలో మిత్ర పక్షాల మధ్య ఏకాభిప్రాయం సాధించడంలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు విజయం సాధించారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలంటే కేంద్రంలోని బిజెపి సహకారం అవసరం. దీంతో చంద్రబాబునాయుడు ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు వ్యూహత్మక అడుగులు వేస్తున్నారు.

కేంద్రంతో బాబు రహస్య ఒప్పందం: జనసేనకు అనుమానాలు,శ్వేతపత్రంపై వెనక్కి, ప్రజలు క్షమించరుకేంద్రంతో బాబు రహస్య ఒప్పందం: జనసేనకు అనుమానాలు,శ్వేతపత్రంపై వెనక్కి, ప్రజలు క్షమించరు

2014 ఎన్నికల్లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో బిజెపి, టిడిపిలు మిత్రపక్షాలుగా పోటీ చేశాయి. ఏపీ రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వంలో చేరింది. కేంద్రంలో టిడిపి కూడ భాగస్వామిగా మారింది.అయితే ఈ మూడేళ్ళ కాలంలో రాజకీయ పరిస్థితుల్లో మార్పులు చోటు చేసుకొన్నాయి.

పోలవరం: నేడు గడ్కరీతో బాబు కీలక భేటీ, 'ఆ ట్విస్ట్‌కు కేంద్రానిదే బాధ్యత'పోలవరం: నేడు గడ్కరీతో బాబు కీలక భేటీ, 'ఆ ట్విస్ట్‌కు కేంద్రానిదే బాధ్యత'

తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని బిజెపి ఇప్పటికే ప్రకటించింది.అయితే 2014 ఎన్నికల వరకు ఏపీ రాష్ట్రంలో టిడిపితో పొత్తులు ఉంటాయని బిజెపి ప్రకటించింది. ఏపీకి చెందిన బిజెపి నేతలు, ఆ పార్టీ ప్రజాప్రతినిధులతో చంద్రబాబునాయుడు బుదవారం నాడు అమరావతిలో సమావేశమయ్యారు.

 చంద్రబాబుతో వ్యూహత్మక అడుగులు

చంద్రబాబుతో వ్యూహత్మక అడుగులు

ఏపీ రాష్ట్రంలో చోటు చేసుకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో టిడిపి అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు వ్యూహత్మకగా అడుగులు వేస్తున్నారు. బిజెపితో ఇటీవల కాలంలో దూరం పెరుగుతున్న వాతావరణం నెలకొందనే ప్రచారం సాగుతున్న తరుణంలో చంద్రబాబునాయుడు వ్యూహత్మకంగా అడుగులు వేస్తున్నారు. బిజెపితో దూరం పెరిగితే కొంత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని చంద్రబాబునాయుడు భావిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు బిజెపి సహకారం కావాలంటే ఏపీకి చెందిన బిజెపి నేతలతో చంద్రబాబునాయుడు వ్యూహత్మకంగా అడుగులు వేస్తున్నారు.

పోలవరం ప్రాజెక్టుపై ఏకాభిప్రాయం

పోలవరం ప్రాజెక్టుపై ఏకాభిప్రాయం

పోలవరం ప్రాజెక్టును 2019 ఎన్నికల నాటికి పూర్తి చేయాలని చంద్రబాబునాయుడు లక్ష్యంగా పెట్టుకొన్నారు. అయితే ఈ ప్రాజెక్టు పనులను నిలిపివేయాలని కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి ఇటీవల లేఖ రాశారు. ఈ లేఖ విషయమై అసెంబ్లీలో చంద్రబాబునాయుడు నిప్పులు చెరిగారు.అవసరమైతే కేంద్రానికి దండం పెట్టి ప్రాజెక్టు పనులను కేంద్రానికి అప్పగిస్తానని మాట్లాడారు.పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై బిజెపి నేతలు కొందరు వ్యవహరించిన తీరుపై టిడిపి అధినేత చంద్రబాబునాయుడు ఆ సమయంలో తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ పరిణామాలు విపక్ష వైసీపీకి రాజకీయంగా అనుకూలంగా మారే అవకాశం ఉందని భావించారు. దరిమిలా బిజెపి, టిడిపిల మధ్య ఏకాభిప్రాయం కోసం చంద్రబాబునాయుడు బిజెపి నేతలతో సమావేశాన్ని నిర్వహించారు.ఈ సమావేశం సత్పలితాలను ఇచ్చింది.పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై బిజెపి, టిడిపిల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది.

టిడిపి, బిజెపి నేతలు ఢిల్లీకి

టిడిపి, బిజెపి నేతలు ఢిల్లీకి

ఈనెల 19, 20 తేదీల్లో ఢిల్లీ వెళ్లాలని బీజేపీ నిర్ణయించింది. రెండు నెలలకోసారి రాష్ట్ర ప్రాజెక్టులపై చర్చించాలని ఈ భేటీలో నిర్ణయించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన నిధులు ఇవ్వాలని కేంద్రంపై బిజెపి నాయకులు కూడ ఒత్తిడి తెచ్చేలా టిడిపి వ్యూహత్మకంగా అడుగులు వేస్తోంది. పోలవరం ప్రాజెక్టు పూర్తి కాకపోతే ఆ నెపం బిజెపిపై నెట్టివేస్తే రాజకీయంగా బిజెపికి కూడ ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే అవకాశాలు కూడ లేకపోలేదు. అయితే ఈ పరిణామాలను కూడ బిజెపి నిశితంగా పరిశీలిస్తోంది. ఈ తరుణంలోనే రెండు పార్టీలు రాష్ట్ర అవసరాలపై కేంద్రం వద్ద చర్చలకు వెళ్ళాలని నిర్ణయం తీసుకొన్నారు.

బీజేపీ, టిడిపి ల మధ్య గ్యాప్ లేదు

బీజేపీ, టిడిపి ల మధ్య గ్యాప్ లేదు

విశాఖ రైల్వేజోన్‌పై ఈ సమావేశాల్లోనే నిర్ణయం ప్రకటించి..ఎన్నికల హామీని నెరవేర్చాలని కేంద్రంపై ఒత్తిడి తెస్తామని విశాఖ ఎంపీ హరిబాబు తెలిపారు.ఎంపీ రామ్మోహన్‌ నాయుడు పెట్టిన ప్రైవేట్ బిల్లుకు మద్దతిస్తాని, గిరిజన, సెంట్రల్ వర్సిటీల బిల్లు పెట్టే అవకాశం ఉందని ఆయన అన్నారు. బీజేపీ, టీడీపీ మధ్య ఎలాంటి గ్యాప్ లేదన్నారు.

ఇళ్ళ కేటాయింపులో బిజెపి కార్యకర్తలకు ప్రాధాన్యత

ఇళ్ళ కేటాయింపులో బిజెపి కార్యకర్తలకు ప్రాధాన్యత

దేవాదాయ, జన్మభూమి కమిటీల్లో బీజేపీ నాయకులకు అవకాశం ఇచ్చేందుకు సీఎం అంగీకరించారని విష్ణుకుమార్‌రాజు, ఆకుల సత్యనారాయణ చెప్పారు. ఇళ్ల కేటాయింపులో బీజేపీ కార్యకర్తలకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరామన్నారు. నేరుగా తనకే జాబితా ఇస్తే అర్హులకు ఇళ్లు కేటాయిస్తామని విష్ణుకుమార్‌ చెప్పారు.

English summary
Tdp, Bjp leaders will go to Delhi on Dec 19. both party leaders will discuss with union ministers of various state issues . Bjp leaders met Ap CM Chandrababu naidu on Wednesday at Amaravathi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X