వైయస్ లేఖ వల్లే: ట్రిబ్యునల్ తీర్పుపై పయ్యావుల
హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి ఇచ్చిన లేఖ వల్లనే కృష్ణా జలాల పంపకంపై బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పులో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని తెలుగుదేశం పార్టీ నాయకుడు పయ్యావుల కేశవ్ విమర్సించారు. మిగులు జలాలపై హక్కును వదులుకుంటామని వైయస్ రాజశేఖర రెడ్డి గతంలో లేఖ రాశారని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. రాష్ట్రానికి బ్రిజేష్ ట్రిబ్యునల్ తీర్పుతో తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆయన అన్నారు. తమ పార్టీ చేసిన పోరాటాన్ని ప్రభుత్వం నీళ్ల పాలు చేసిందని వ్యాఖ్యానించారు.
కృష్ణా జలాల వినియోగానికి సంబంధించి బ్రిజేష్ కుమార్ ఇచ్చిన ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు రాష్ట్ర రైతాంగానికి గొడ్డలిపెట్టని తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు దూళిపాళ్ల నరేంద్ర విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ట్రిబ్యునల్ ముందు సమర్థమైన వాదనలు వినిపించడంలో విఫలమైందని, అందుకే ఈ పరిస్థితి వచ్చిందని ఆయన అన్నారు. మిగులు జలాల అవసరం లేదని గతంలో అప్పటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి లేఖ రాశారని, ఈ పాపం రాజశేఖర రెడ్డిదేనని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. కృష్ణా జలాలపై అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలని గతంలో తాము డిమాండ్ చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదని ఆయన అన్నారు.

ట్రిబ్యునల్ తీర్పుతో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని తెలుగుదేశం పార్టీ నాయకుడు తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. కృష్ణా జలాలను రాష్ట్రం వాడుకునే హక్కు ఉందని ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. తాము చెప్పిన ఒక్క అంశాన్ని కూడా సాధించలేకపోయిందని ఆయన అన్నారు. రాష్ట్రాన్ని శాశ్వతంగా ముంచేశారని ఆయన వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టుకు వెళ్లి మళ్లీ పరిశీలించేలా చేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
బ్రిజేష్ ట్రిబ్యునల్ ముందు సరిగా వాదనలు వినిపించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ఆరోపించారు. ట్రిబ్యునల్ తీర్పుతో రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చొరవ ప్రదర్శించి అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకుని వెళ్లాలని ఆయన డిమాండ్ చేశారు.
రాష్ట్రం బలమైన వాదనలు వినిపించకపోవడం వల్లనే ఈ దుస్థితి ఏర్పడిందని ట్రిబ్యునల్ తీర్పు అనంతరం తెలుగుదేశం పార్టీ తరఫున వాదించిన న్యాయవాది ఢిల్లీలో అన్నారు. వాదనలకు అనుగుణంగా ప్రభుత్వం సాక్ష్యాలను సమర్పించలేకోపయిందని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ తరఫున సుప్రీంకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్ వేస్తామని ఆయన చెప్పారు.
హక్కు కాదు, స్వేచ్ఛ మాత్రమే..
మిగులు జలాలపై రాష్ట్రానికి హక్కు లేదని, స్వేచ్ఛ మాత్రమే ఉందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫు న్యాయవాది సుదర్శన్ రెడ్డి అన్నారు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు అనంతరం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. మన డిమాండ్లపై సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ పెండింగులో ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. సుప్రీంకోర్టు స్పెషల్ లీవ్ పిటిషన్‌పై తీర్పు తర్వాతనే ట్రిబ్యునల్ తీర్పుపై నోటిఫికేషన్ వెలువడుతుందని ఆయన చెప్పారు. రాష్ట్రం విడిపోతే ఏం చేయాలనే విషయంతో ట్రిబ్యునల్‌కు సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు.
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications