ఎంత డబ్బు: కేసీఆర్‌కు జగన్ మద్దతు వెనుక..!

విశాఖ: తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసన సభ్యుడు రేవంత్ రెడ్డి ఇష్యూపై టీడీపీ నేతలు విశాఖలో ఆందోళన చేపట్టారు.

తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ ఒక్కటై రేవంత్‌ను కుట్రపూరితంగా కేసులో ఇరికించారని ఆరోపించారు.

కేసీఆర్‌‍కు జగన్ అమ్ముడుపోయారని ఆరోపించారు. అనకాపల్లి నెహ్రూ చౌక్ కూడలిలో బుధవారం నిరసన చేపట్టారు.

విశాఖ

విశాఖ

ఏపీ అభివృద్ధికి చంద్రబాబుకు సహకరించాల్సింది పోయి జగన్ తెలంగాణ సీఎంకు అమ్ముడుపోవడం దారుణమని వ్యాఖ్యానించారు.

విశాఖ

విశాఖ

టీడీపీని అప్రతిష్టపాలు చేయడమే జగన్ ధ్యేయంగా కనిపిస్తోందన్నారు. రేవంత్ వ్యవహారంలో చంద్రబాబుకు ఎటువంటి సంబధం లేకపోయినా, ఇరికించాలని చూస్తున్నారన్నారు.

విశాఖ

విశాఖ

వైయస్ రాజశేఖర రెడ్డి ఆనాడు తెరాస ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తే, ఇప్పుడు కేసీఆర్ అదే బాటలో నడుస్తున్నారని ఆరోపించారు.

విశాఖ

విశాఖ


శాసన మండలి ఎన్నికల్లో తెరాసకు ఓటు వేయించినందుకు జగన్ ఎంత డబ్బు తీసుకున్నాడో ప్రజలకు చెప్పాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు.

విశాఖ

విశాఖ


రేవంత్ రెడ్డిని తప్పుడు కేసులో ఇరికించారని, అసెంబ్లీలో జగన్ వ్యవహరిస్తున్న తీరుకు శాసన సభ్యుడిగా సిగ్గుపడుతున్నానని ఎమ్మెల్యే గోవింద సత్యనారాయణ అన్నారు.

విశాఖ

విశాఖ

రాష్ట్ర విభజనకు కారకుడైన కేసీఆర్‌కు జగన్ మద్దతు తెలపడం శోచనీయమన్నారు. హైదరాబాదులోని ఆస్తులను కాపాడుకునేందుకే జగన్ తెరాసకు మద్దతు పలుకుతున్నారని ఆరోపించారు.

విశాఖ

విశాఖ

ఎమ్మెల్యే అనిత మాటాలాడుతూ.. డబ్బుతో రాజకీయాలు చేయడం జగన్‌కే తెలుసునని, టీడీపీ ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారని వైసీపీ నేత జ్యోతుల నెహ్రూ చెప్పడం విడ్డూరమన్నారు.

విశాఖ

విశాఖ

ఒక్క ఎమ్మెల్యే పార్టీ మారినా తాను రాజకీయాల నుండి తప్పుకుంటానని, దొంగల పార్టీలోకి వెళ్లడానికి ఎవరూ సిద్ధంగా లేరని అనిత అన్నారు.

విశాఖ

విశాఖ

టీడీపీ నేతలు, కార్యకర్తలు మానవహారంగా ఏర్పడి.. జగన్, కేసీఆర్‌లకు వ్యతిరేకంగా నినాదాలు చేసి, వారి దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు.

విశాఖ

విశాఖ

గోపాలపట్నం పెట్రోల్ బంకు కూడలిలో జగన్, కేసీఆర్ దిష్టిబొమ్మల దగ్ధం సమయంలో పోలీసులు, టీడీపీ కార్యకర్తలకు వాగ్వాదం జరిగింది. ఈ ఘటనలో టీడీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+