టీడీపీ అభ్యర్థికి ఘోర అవమానం..ఫ్యాన్‌కే ఓటు వేస్తామన్న ప్రజలు (వీడియో)
ఎన్నికల ప్రచారంలో టీడీపీ అభ్యర్థికి ఘోర అవమానం ఎదురైంది. సైకిల్ గుర్తుకు వేసి తనని గెలిపించాలని టీడీపీ అభ్యర్థి కోరగా..అక్కడే ఉన్న ప్రజలు తాము ఫ్యాన్ గుర్తుకు ఓటు వేస్తామని చెప్పి..ఆ టీడీపీ నేతకు షాకిచ్చారు. ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లా , తిరువూరు నియోజకవర్గంలో చోటు చేసుకుంది. తిరువూరు టీడీపీ అభ్యర్థిగా కొలికపూడి శ్రీనివాసరావు పేరును టీడీపీ అధిష్టానం ఖారారు చేసింది. జిల్లాలు దాటి వచ్చి మరి కొలికపూడి శ్రీనివాస్ తిరువూరులో పోటీ చేస్తున్నారు.
తిరువూరు టీడీపీ అభ్యర్థి కొలికపూడికి రోడ్ షో లో ప్రజల తిరుగుబాటు...!#TDP #KolikapudiSrinivasaRao #Tiruvuru #APElections2024 #AndhraPradesh #Oneindiatelugu pic.twitter.com/e9DIiXYcXD
— oneindiatelugu (@oneindiatelugu) March 29, 2024
అమరావతి రైతులకు మద్దతుగా పలు టీవీ చర్చల్లో పాల్గొన్న ఆయనకు చంద్రబాబు తిరువూరు నియోజకవర్గ బాధ్యతలను అప్పగించారు. తిరువూరు బాధ్యతలు చేపట్టిన కొలికపూడి శ్రీనివాస్ నియోజకవర్గంలో విసృతంగా పర్యటిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని స్థానికులను కోరగా..అక్కడున్న పలువురు మహిళలు తాము ఫ్యాన్‌కే ఓటు వేస్తామని ధైర్యంగా చెప్పారు.

ఇది అర్థం కాని కొలికపూడి శ్రీనివాస్ సైకిల్ సైకిల్ అని అనగా.. మహిళలు మరింత గట్టిగా ఫ్యాన్.. ఫ్యాన్ అంటూ అరిచారు. దీంతో కొలికపూడి శ్రీనివాస్ సైతాన్ సైతాన్ అంటూ అక్కడ నుంచి మెల్లగా ముందుకుసాగారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. టీడీపీ నుంచి కొలికపూడి శ్రీనివాస్ బరిలో ఉండగా, అధికార పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాసు పోటీ చేస్తున్నారు.సిట్టింగ్ ఎమ్మెల్యే రక్షణ నిధిని పక్కన పెట్టి మరి టీడీపీ నుంచి పార్టీలోకి వచ్చిన స్వామిదాసుకు వైసీపీ అధిష్టానం టికెట్ కేటాయించింది. వీరిద్దరిలో తిరువూరు ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపుతారో చూడాలి.












Click it and Unblock the Notifications