Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వైఎస్సార్ లానే జగన్.. రాయలసీమకు అన్యాయం; దమ్ముంటే కేసీఆర్ ఇంటిని ముట్టడించాలని టీడీపీ సవాల్

రాయలసీమ ప్రాంతానికి నాడు వైయస్ రాజశేఖర్ రెడ్డి, నేడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వల్ల తీరని నష్టం జరుగుతుందని తెలుగుదేశం పార్టీ నేతలు అభిప్రాయపడ్డారు. రాయలసీమ ప్రాజెక్టుల భవితవ్యం అనే అంశంపై కడప జిల్లాలో నిర్వహించిన సదస్సులో పాల్గొన్న టిడిపి నేతలు జగన్ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. జిల్లాలోని ముఖ్య నేతలంతా ఈ సదస్సుకు హాజరై రాయలసీమ ప్రాజెక్టుల భవితవ్యంపై తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

రాయలసీమను కాపాడుకోవటం కోసం టీడీపీ సదస్సు
జగన్మోహన్ రెడ్డి ధన దాహానికి గురవుతున్న రాయలసీమను కాపాడుకోవడానికి, టిడిపి సదస్సులు నిర్వహిస్తోంది అని మాజీ మంత్రులు కాల్వ శ్రీనివాసులు, అమర్నాథ్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణా సీఎం కేసీఆర్ రాయలసీమ ఎత్తిపోతల పథకానికి బ్రేకులు వేసేందుకు ప్రయత్నాలు చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు కూడా నోరు ఎత్తడం లేదని విమర్శించారు. రాయలసీమకు నీటి వాటాలు దక్కక పోవడానికి, రాయలసీమ ప్రాంత రైతులు దుర్భిక్ష పరిస్థితులు ఎదుర్కోవడానికి నాడు వైఎస్ రాజశేఖరరెడ్డి కారణమయ్యారని నేతలు విమర్శించారు.

TDP challenge to ysrcp MLAs, to seize KCR house for Rayalaseema water

నీటి వాటా హక్కులు వదులుకుంటామని సీమకు అన్యాయం చేసిన వైఎస్సార్; టీడీపీ ఫైర్
వెలిగొండ, గాలేరు-నగ,రి హంద్రీనీవా లకు కృష్ణ నీటి వాటా హక్కులను వదులుకుంటామని 2006లోనే వైయస్ రాజశేఖర్ రెడ్డి కృష్ణా ట్రిబ్యునల్ కు లేఖ రాశారని గుర్తుచేశారు. ఇప్పుడు వైఎస్సార్ తనయుడు జగన్ మోహన్ రెడ్డి రాయలసీమ ప్రాజెక్టులకు నిధులు కేటాయించకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయలసీమ ప్రాంతానికి రావాల్సిన నీటి వాటాలు విషయంలో తెలంగాణ సీఎం కెసిఆర్ సీఎం జగన్ మోహన్ రెడ్డి లాలూచీ రాజకీయాలు చేస్తున్నారని రాయలసీమకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని విమర్శలు గుప్పించారు.

49 మంది వైసీపీ ఎమ్మెల్యేలకు దమ్ముంటే ఆ పని చెయ్యాలన్న టీడీపీ
రాయలసీమ ప్రాంతంలోని 49 మంది వైసీపీ ఎమ్మెల్యేలకు దమ్ముంటే తెలంగాణ సీఎం కేసీఆర్ ఇంటిని ముట్టడించాలని సవాల్ విసిరారు. సీమ ప్రాజెక్టుల కోసం జగన్మోహన్ రెడ్డి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని విమర్శించారు. కేవలం ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రాజెక్టుల పేరుతో నిధులు కొల్లగొట్టడం కోసం ప్రయత్నిస్తున్నారని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి తీరు వల్ల రాయలసీమలో దుర్భిక్ష పరిస్థితులు నెలకొనే ప్రమాదం ఉందని టిడిపి నేతలు అసహనం వ్యక్తం చేశారు. అంతేకాదు నీటి ప్రాజెక్టులపై కేంద్రం విడుదల చేసిన గెజిట్ ను ఉపసంహరించుకోవాలని టిడిపి నేతలు డిమాండ్ చేశారు. రాయలసీమలో పుట్టిన సీఎం జగన్ సీమకు ద్రోహం చేస్తున్నారని తెలుగుతమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాయలసీమ నీటి వాటాల కోసం, ప్రాజెక్టు పనుల కోసం పోరాటం సాగిస్తామన్న టీడీపీ నేతలు
జగన్ తన కేసుల మాఫీ కోసం కేంద్రంతో కుమ్మక్కై రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. రాయలసీమ నీటి వాటాల కోసం, ప్రాజెక్టు పనుల కోసం పోరాటం సాగిస్తామని తెలుగుదేశం పార్టీ నేతలు స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ జిల్లా స్థాయి సదస్సులు పూర్తయిన తర్వాత నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ప్రజలను చైతన్య పరుస్తామని తెలుగుదేశం పార్టీ నేతలు ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలపై పలు తీర్మానాలను చేసిన టీడీపీ నేతలు రాయలసీమ ప్రాంతానికి జరుగుతున్న నష్టం పై పోరు బాట పడతామని వెల్లడించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+