చంద్రబాబుకు ఆపరేషన్ - హైకోర్టులో హౌస్ మోషన్ పిటీషన్..!!
తెలుగుదేశం అధినేత చంద్రబాబు హైకోర్టులో హౌస్ మొన్ పిటీషన్ దాఖలు చేసారు. బెయిల్ పిటీషన్ అత్యవసరంగా విచారాణ జరపాలని కోరారు. మూడు నెలల క్రితమే చంద్రబాబు ఎడమ కంటికి కాటరాక్ట్ ఆపరేషన్ జరిగిందని పిటీషన్ లో పేర్కొన్నారు. ఇప్పుడు కుడి కంటికి ఆపరేషన్ జరపాల్సి ఉందని వివరించారు. దీని పైన న్యాయస్థానం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అయితే, వెకేషన్ బెంచ్ లో బెయిల్ పిటీషన్ రేపు విచారణకు లిస్టు అయింది.
కంటికి ఆపరేషన్:చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఏపీ హైకోర్టులో హౌస్ మోషన్ పిటీషన్ దాఖలైంది. హైకోర్టులో దాఖలు చేసిన ఈ పిటీషన్లతో పాటుగా చంద్రబాబు ఆరోగ్యానికి సంబంధించిన నివేదికలను న్యాయవాదులు జత చేసినట్లు తెలుస్తోందిస్కిల్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబు తొలి నుంచి క్వాష్ కోసమే ప్రయత్నం చేసారు. హైకోర్టులో క్వాష్ పిటీషన్ డిస్మిస్ కావటంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

సుప్రీంలో సుదీర్ఘ వాదనలు జరిగాయి. 17ఏ చంద్రబాబుకు వర్తిస్తుందని..గవర్నర్ అనుమతి లేకుండా అరెస్ట్ చేయటం సరి కాదని చంద్రబాబు తరపు న్యాయవాదులు వాదించార. అయితే, 17ఏ సవరణకు ముందే స్కిల్ కేసు విచారణ ప్రారంభమైందని..చంద్రబాబుకు ఈ సెక్షన్ వర్తించదని సీఐడీ తరపు న్యాయవాదులు కోర్టు ముందు గత తీర్పులను ప్రస్తావన చేసారు.
హౌస్ మోషన్ పిటీషన్:రెండు వైపుల వాదనలు విన్న సుప్రీంకోర్టు నవంబర్ 8వ తేదీకి తీర్పు రిజర్వ్ చేసింది. ఇదే సమయంలో ఫైబర్ కేసులో మధ్యంతర బెయిల్ ను వచ్చే నెల 9వ తేదీన విచారణకు నిర్ణయించింది. ఈ సమయంలోనే స్కిల్ స్కాంలో హైకోర్టులో బెయిల్, మధ్యంతర బెయిల్ కోసం దాఖలు చేసిన అనుబంధ పిటీషన్ లపైన వెకేషన్ బెంచ్ రేపు (శుక్రవారం) విచారణ జరపనుంది. న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యతిర్మయి ప్రతాప బెంచ్ ముందు శుక్రవారం 8వ కేసుగా ఈ బెయిల్ పిటీషన్ విచారణ జాబితాలోకి వచ్చింది.
స్కిల్ కేసులో ఏసీబీ కోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించటంతో చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. ఈ నెల 19న హైకోర్టు ఈ పిటీషన్ పై విచారణ జరిపి వెకేషన్ బెంచ్ ముందకు వాయిదా వేసింది. చంద్రబాబుకు సంబంధించిన వైద్య నివేదికలను 27 నాటి విచారణకు కోర్టు ముందు ఉంచాలని రాజమహేంద్రవరం కేంద్రం కారాగార అధికారులను ఆదేశించింది.

నిర్ణయంపై ఉత్కంఠ:చంద్రబాబుకు సంబంధించిన వైద్య నివేదికలను 27 నాటి విచారణకు కోర్టు ముందు ఉంచాలని రాజమహేంద్రవరం కేంద్రం కారాగార అధికారులను ఆదేశించింది. సుప్రీంలో క్వాష్ తీర్పు పైన ఆసక్తి నెలకొంది. వచ్చే నెల 8, 9 తేదీల్లో సుప్రీంలో చంద్రబాబుకు సంబంధించిన కీలక తీర్పులు వెలువడే అవకాశం ఉంది. ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో చంద్రబాబు బెయిల్ పైన రాజకీయంగానూ టీడీపీలో చర్చ మొదలైంది. దీంతో, చంద్రబాబు మధ్యంతర బెయిల్ విషయంలో హైకోర్టు విచారణ తరువాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఉత్కంఠకు కారణం అవుతోంది.












Click it and Unblock the Notifications