చంద్రబాబు "దూకుడు" - 72 ఏళ్ల వయసులో అలవోకగా : వైరల్..!!

టీడీపీ అధినేత చంద్రబాబు ఫిట్ నెస్ మరోసారి చర్చల్లోకి వచ్చింది. రాజకీయంగా దూకుడుగా కనిపిస్తున్న చంద్రబాబు వయసు - ఆరోగ్యం పైన మరోసారి చర్చ మొదలైంది. 72 ఏళ్ల వయసులో చంద్రబాబు ముందుకు దూకుతూ పొలాల మధ్య గట్లను అలవోకగా దాటిన ఫొటోలు..వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పల్నాడు జిల్లాలో చంద్రబాబు పర్యటించారు. భారీ వర్షాలతో దెబ్బ తిన్న రైతులను పరామర్శించారు. వారి పొలాలను సందర్శించారు. ఆ సమయంలో చంద్రబాబు ఓ కాలువను దాటాల్సి వచ్చింది.

ఏ మాత్రం సంకోచించకుండా ఆ కాలువను అలవోకగా దాటేశారు. ఎవరి సాయం తీసుకోలేదు. పక్కన ఉన్న సిబ్బంది చేయి కాలువ దాటేందుకు చేయి అందించే ప్రయత్నం చేసారు. కానీ, ఆయన తిరస్కరించి ఒక సారిగా కాలువ దాటేసారు. 72 ఏళ్ల వయసులో చేసిన ఆ జంపింగ్ ఇప్పుడు టీడీపీ సర్కిల్స్ లో పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. పార్టీ నేతలతో పాటుగా అక్కడే ఉన్న పార్టీ కార్యకర్తలు ఆ పరిణామాన్ని ఆసక్తిగా గమనించారు. చంద్రబాబు ఈ వయసులోనూ ఫిట్ గా ఉన్నారనే విషయాన్ని మరోసారి నిరూపించారంటు పార్టీ నేతల మధ్య చర్చ కనిపించింది. దెబ్బతిన్న పంటలను స్వయంగా పరిశీలించిన ఆయన.. పంట నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు. రాత్రి పొద్దుపోయిన తరువాత చంద్రబాబు గురజాల చేరుకున్నారు.

TDP Cheif Chandra Babu jumps on canal barrears in Palanadu area became Viral in social media

నాలుగేళ్ల తరువాత చంద్రబాబు తమ ప్రాంతానికి రావటంతో పెద్ద సంఖ్యలో అభిమానులు తరలి వచ్చారు. సాయంత్రం 4 గంటలకు జరగాల్సిన కార్యక్రమం రాత్రి 11 గంటల సమయంలో జరిగింది. పెద్ద సంఖ్యలో వచ్చిన అభిమానులు..కార్యకర్తలతో గుజరాలలో చంద్రబాబు రోడ్ షోలో భారీ జనసందోహం కనిపించింది. ముఖ్యమంత్రి జగన్ లక్ష్యంగా చంద్రబాబు విమర్శలు చేసారు. వచ్చే ఎన్నికల్లో జగన్‌ పార్టీని రైతులు చిత్తు చిత్తుగా ఓడిస్తారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. బటన్‌ నొక్కడం వల్ల ప్రజాసమస్యలు తీరడం లేదని ఆరోపించారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక రైతులు ఆత్మహత్యలు పెరగాయని పేర్కొన్నారు. జగన్‌కు బుద్ది చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని బాబు పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+