Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రెండు చోట్ల చంద్రబాబు, పవన్ పోటీ - బాలయ్య, లోకేష్ సీట్ల మార్పు : ఇదీ లెక్క..!!

వైసీపీలోనే కాదు టీడీపీలోనూ సీట్ల మార్పు కసరత్తు మొదలైంది. టీడీపీకి నవ్ ఆర్ నెవర్ గా మారిన ఈ ఎన్నికల్లో టీడీపీ ముఖ్య నేతలు..జనసేనాని పోటీ చేయాల్సిన స్థానాల పైన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కీలక సూచనలు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో, చంద్రబాబు - పవన్ కల్యాణ్ రెండు స్థానాల చొప్పున పోటీ చేయనున్నారు. లోకేష్, నందమూరి బాలయ్య పోటీ చేసే స్థానాల్లోనూ మార్పు ఖాయమని తెలుస్తోంది.

టీడీపీ ముఖ్యుల పోటీ
వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడించాలనేది చంద్రబాబు - పవన్ లక్ష్యం. ఇందులో భాగంగా ఎన్నికల వ్యూహాల పైన చంద్రబాబు తాజాగా రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో సమావేశమయ్యారు. ఆ సమయంలో చంద్రబాబు, లోకేష్, పవన్, బాలయ్య పోటీ చేసే స్థానాల పైన చర్చ జరిగినట్లు తెలుస్తోంది. చంద్రబాబు ప్రస్తుతం పోటీ చేస్తున్న కుప్పంతో పాటుగా ఉత్తరాంధ్రలోని మరో స్థానం నుంచి పోటీ చేయాలని పీకే సూచించినట్లు తెలుస్తోంది.

TDP Chief Chandra Babu and Pawan Kalyan likely to contest from Two seats, Balakrishna from Undi

దీంతో, భీమిలి వైపు చంద్రబాబు చూస్తున్నట్లు సమాచారం. దీని ద్వారా ఉత్తరాంధ్రలో పార్టీకి మేలు చేస్తుందని భావిస్తున్నారు. అదే విధంగా పవన్ కల్యాణ్ భీమవరంతో పాటుగా తిరుపతి నుంచి పోటీ చేయటం ఖాయంగా కనిపిస్తోంది. గోదావరితో పాటుగా రాయలసీమ జిల్లాల్లో పవన్ ప్రభావం ఉండేలా ఆలోచన చేస్తున్నారు.

మూడు ప్రాంతాల్లో ప్రభావం
నారా లోకేష్ పైన తాజాగా సీఎం జగన్ బీసీ వర్గానికి చెందిన నేతను బరిలోకి దింపాలని నిర్ణయించారు. దీంతో, అక్కడ లోకేష్ పోటీ చేయకుండా బీసీ వర్గానికి చెందిన నేతనే బరిలోకి దింపాలని పీకే సూచించినట్లు సమాచారం. లోకేష్ ను టీడీపీకి కంచుకోటగా ఉన్న హిందూపురం నుంచి పోటీకి దింపే ఆలోచన జరుగుతోంది.

దీని ద్వారా లోకేష్ - పవన్ రాయలసీమ జిల్లాల నుంచి ప్రాతినిధ్యం వహించేలా కొత్త స్కెచ్ సిద్దం చేస్తున్నారు. ఇక.. నందమూరి బాలయ్యను గుడివాడ లేదా ఉండి నుంచి పోటీకి దింపాలి..దీని ద్వారా గోదావరి జిల్లాల్లో పవన్ - బాలయ్య కాంబినేషన్ పార్టీకి కలిసి వస్తుందని లెక్కలు వేస్తున్నారు. దీని పైన సర్వే నివేదికలు సిద్దం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. మార్పులతో మూడు రీజియన్లలోనూ పార్టీకి కలిసి వస్తుందని భావిస్తున్నారు.

కొత్త లెక్కలతో బరిలోకి
ఈ మార్పులు - చేర్పుల ద్వారా ఎదురయ్యే లాభ -నష్టాల పైన టీడీపీ అధినాయకత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. చంద్రబాబు కుప్పంలో పోటీ చేస్తూనే మరో నియోజకవర్గం ఉత్తరాంధ్రలో ఉండేలా వ్యూహ రచన చేస్తున్నారు. దీంతో ఉత్తరాంధ్రలో చంద్రబాబు, గోదావరి జిల్లాల్లో పవన్ - బాలయ్య, రాయలసీమలో పవన్ - లోకేష్...ఇలా పోటీలో ఉండటంతో మొత్తంగా సమీకరణాల పైన ప్రభావం పడుతుందని భావిస్తున్నారు.

చంద్రబాబు రెండు సీట్లలో పోటీ చేయటం ద్వారా రాజకీయంగా ఎదురయ్యే విమర్శల పైనా చర్చ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, తెలంగాణలో కేసీఆర్ - రేవంత్, గతంలో ఎన్టీఆర్ రెండు నియోజకవర్గాల్లో పోటీ చేసిన సంగతిని టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి మరో రెండు రోజుల్లో అధికారికంగా నిర్ణయం జరిగే అవకాశం ఉంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+