ఏపీలో ఎన్నికల ఫలితాలపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు..!!
తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారాన్ని వేగవంతం చేశారు. చిత్తూరు జిల్లాలో ప్రారంభించిన ప్రచారం ప్రస్తుతం ఉమ్మడి అనంత జిల్లాలో కొనసాగుతుంది. రాప్తాల్లో చంద్రబాబు ముఖ్యమంత్రి జగన్ లక్ష్యంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరు అధికార పార్టీ దౌర్జన్యాలకు భయపడాల్సిన అవసరం లేదన్నారు. వచ్చే ఎన్నికల ఫలితాలపై చంద్రబాబు ఆసక్తికర విశ్లేషణ చేశారు.
రాప్తాడులో చంద్రబాబు
ముఖ్యమంత్రి జగన్ సిద్ధం కార్యక్రమం ప్లాప్ షో అయిందని టిడిపి అధినేత చంద్రబాబు ఏదేవా చేశారు. డబ్బులు, బిర్యానీ ఇచ్చిన జనం రావట్లేదని పేర్కొన్నారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను జగన్ నెరవేర్చలేదని విమర్శించారు. జగన్ తన హయాంలో 9 సార్లు విద్యుత్ చార్జీలు పెంచారని చెప్పుకొచ్చారు. టిడిపి హయాంలో ఎప్పుడు కరెంట్ చార్జీలు పెంచలేదని గుర్తు చేశారు. రైతుల మోటార్లకు మీటర్లు బిగించి వారికి ఉరితాడు వేశారని చంద్రబాబు ధ్వజమెత్తారు. రాప్తాల్లో పిల్ల సైకో ఉన్నాడంటూ వైసీపీ అభ్యర్థి తోపుదుర్తి పై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.

టార్గెట్ జగన్
ఫ్యానుకు ఓటేసిన ప్రజలు అదే ఫ్యాన్ కు ఉరేసుకునే పరిస్థితికి వచ్చారని వ్యాఖ్యానించారు. రాప్తాడు ఇసుక బెంగళూరులో దొరుకుతుందని.. ఇసుక అక్రమ రవాణా వెనక తోపుదుర్తి ఉన్నారని ఆరోపించారు. కియా పరిశ్రమ ఏపీకి రావడం మన రేంజ్ .. జాకీ పరిశ్రమ ఏపీ నుంచి తరలిపోవడం వైసీపీ రేంజ్ అంటూ చంద్రబాబు వివరించారు. రాయలసీమలో 52 సీట్లలో 49 సీట్లు వైసిపికి ఇచ్చారని, కానీ ఐదేళ్ల పాలనలో ఏ మొరగబెట్టారని ప్రశ్నించారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో అన్ని సీట్లు గెలవాలని చంద్రబాబు నిర్దేశించారు.

గెలుపు పై ధీమా
పోలవరం పూర్తి చేస్తానని చెప్పిన జగన్ గోదావరిలో ముంచారంటూ గజమెత్తారు. తోపుదుర్తి బ్రదర్స్ అరాచకాలకు అడ్డు లేకుండా పోయిందన్నారు. ఎక్కడ చూసినా దోపిడీలు కమిషన్ లేనని ఆరోపించారు. తోపుదుర్తి బ్రదర్స్ రాప్తాడు ఆటోనగర్ భూములు కూడా మింగేయాలనుకున్నారని చెప్పుకొచ్చారు. ప్రకాష్ రెడ్డి చేసిన అరాచకాలను వదిలిపెట్టేది లేదని వడ్డీతో సహా చెల్లిస్తామని హెచ్చరించారు. కేంద్రం, రాష్ట్రంలో వచ్చేది ఎన్డీఏ ప్రభుత్వమేనని 140 పైగా అసెంబ్లీ స్థానాలు, 24 ఎంపీ స్థానాలు గెలుస్తామని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు కడప ఎంపీ సీటు కూడా గెలవబోతున్నామంటూ చంద్రబాబు చెప్పుకొచ్చారు.












Click it and Unblock the Notifications