జగన్ అదుపులో పెట్టుకోవాలి - క్షమాపణ చెప్పి తప్పు సరిదిద్దుకోవాలి : చంద్రబాబు..!!
వైసీసీ నేతలు సినీ హీరో రజనీకాంత్ పైన చేస్తున్న విమర్శలను టీడీపీ అధినేత చంద్రబాబు తప్పు బట్టారు. రజనీకాంత్ విజయవాడలో జరిగిన ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. చంద్రబాబు విజన్ పైన ప్రశంసలు కురిపించారు. చంద్రబాబు విజన్ ఏపీకి మేలు చేస్తుందని చెప్పుకొచ్చారు. దీని పైన వైసీపీ నేతలు సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. ఎన్టీఆర్ వెన్నుపోటు ఎపిసోడ్ నుంచి చంద్రబాబుకు రజనీకాంత్ మద్దతుగా ఉంటూ ఎన్టీఆర్ పైన ప్రశంసలా అంటూ నిలదీస్తున్నారు.
వైసీపీ టార్గెట్ రజనీకాంత్:చంద్రబాబు గురించి రజనీకాంత్ చెప్పిన అంశాల పై వైసీపీ ముఖ్య నేతలు స్పందించారు. మంత్రులు, మాజీలు వరుసగా రజనీకాంత్ లక్ష్యంగా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 1995లో జరిగిన వైస్రాయ్ ఎపిసోడ్ లో రజనీకాంత్ నాడు చంద్రబాబుకు మద్దతుగా నిలిచారని దుయ్యబట్టారు. ఎన్టీఆర్ నాడు చంద్రబాబు గురించి చెప్పిన అంశాలు రజనీ మర్చిపోయారా అంటూ నిలదీసారు. రజనీకాంత్ లక్ష్యంగా వైసీపీ నేతలు చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. బీజేపీతో స్నేహం కోసం రజనీకాంత్ ను చంద్రబాబు రంగంలోకి దించారని లక్ష్మీ పార్వతి ఆరోపించారు. ఇప్పుడు సోషల్ మీడియాలో రజనీకాంత్ పైన వ్యాఖ్యల పైన కామెంట్స్ మొదలయ్యాయి.

చంద్రబాబు డిమాండ్:ఇదే అంశం పైన చంద్రబాబు స్పందించారు. ట్వీట్ ద్వారా వైసీపీ నేతల తీరును ఖండించారు. అన్నగారి శత జయంతి కార్యక్రమంలో పాల్గొని ఆయనతో తన అనుబంధాన్ని...అనుభవాలను పంచుకున్న సూపర్ స్టార్ రజనీకాంత్ పై వైసీపీ మూకల అసభ్యకర విమర్శల దాడి అభ్యంతరకరం, దారుణమన్నారు. సమాజంలో ఎంతో గౌరవం ఉండే రజనీ కాంత్ లాంటి లెజెండరీ పర్సనాలటీపై కూడా వైసీపీ నేతలు చేస్తున్న నీచ వ్యాఖ్యలు అందరికీ బాధ కలిగిస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వ పోకడలపై ఆయన చిన్న విమర్శ చేయలేదు...ఎవరినీ చిన్న మాట అనలేదు. పలు అంశాలపై కేవలం తన అభిప్రాయాలు పంచుకున్నారు. అయినా తీవ్ర అహంకారంతో ఆయనపై చేస్తున్న ఆర్థం లేని విమర్శలను తెలుగు ప్రజలు ఎవరూ సహించరని పేర్కొన్నారు.
అన్నగారి శత జయంతి కార్యక్రమంలో పాల్గొని ఆయనతో తన అనుబంధాన్ని...అనుభవాలను పంచుకున్న సూపర్ స్టార్ @rajinikanth గారిపై వైసీపీ మూకల అసభ్యకర విమర్శల దాడి అభ్యంతరకరం, దారుణం. సమాజంలో ఎంతో గౌరవం ఉండే రజనీ కాంత్ లాంటి లెజెండరీ పర్సనాలటీపై కూడా వైసీపీ నేతలు చేస్తున్న నీచ వ్యాఖ్యలు అందరికీ… pic.twitter.com/CjyhyviDNb
— N Chandrababu Naidu (@ncbn) May 1, 2023
వైసీపీ స్పందిస్తుందా:శిఖరం లాంటి వ్యక్తిత్వం కలిగిన రజనీ క్యారెక్టర్ పై మీ పార్టీ నేతల విమర్శలు ఆకాశం పై ఉమ్మి వేయడమే. నోటిదూల నేతలను జగన్ అదుపులో పెట్టుకోవాలి....జరిగిన దానికి క్షమాపణ చెప్పి తమ తప్పు సరిదిద్దుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేసారు. గత శుక్రవారం విజయవాడ వచ్చిన రజనీకాంత్ టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి వెళ్లారు. ఆ తరువాత ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో రాజకీయాల పైన మాట్లాడవద్దని తన అనుభవం చెబుతోందంటూనే చంద్రబాబు గురించి చేసిన వ్యాఖ్యలతో వైసీపీ నేతలు సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. ఇప్పుడు చంద్రబాబు తాజా డిమాండ్ పైన వైసీపీ నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.












Click it and Unblock the Notifications