గుడివాడ సహా కీలక నియోజకవర్గాల్లో చంద్రబాబు అభ్యర్దుల ఖరారు..!!
వచ్చే ఎన్నికల్లో అభ్యర్దుల ఎంపిక కసరత్తు చంద్రబాబు ముమ్మరం చేసారు. జనసేనతో పొత్తు వేళ కొన్ని చోట్ల పార్టీ ఇంఛార్జ్ లను మారుస్తున్నారు. లోక్ సభ అభ్యర్దుల పైనా క్లారిటీ ఇస్తున్నారు. పోటీ..వివాదాలు ఉన్న నియోజకవర్గాల్లో నేతలను పిలిచి తన నిర్ణయం ఏంటో స్పష్టం చేస్తున్నారు. అందులో భాగంగా తాజాగా గుడివాడతో సహా పలు ముఖ్య నియోజకవర్గాల్లో అభ్యర్దులను చంద్రబాబు ఖరారు చేసారు. సీటు ఇవ్వలేని వారికి భవిష్యత్ పై హామీ ఇచ్చారు.
చంద్రబాబు కసరత్తు
అసెంబ్లీ సీట్లలో అభ్యర్దుల ప్రకటన పైన చంద్రబాబు కసరత్తు వేగవంతం చేసారు. గుడివాడ నియోజకవర్గం నుంచి ఎన్నారై వెనిగళ్ల రాము ఖరారు చేసారు. ప్రస్తుతం అక్కడ రావి వెంకటేశ్వర రావు ఇంఛార్జ్ గా ఉన్నారు. కొంత కాలంగా రాము పార్టీ కార్యక్రమాలతో పాటుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

ఈ సారి గుడివాడలో గెలుపు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న చంద్రబాబు అక్కడ కొడాలి నాని పైన ధీటైన అభ్యర్ది ని బరిలోకి దించాలని నిర్ణయించింది. సామాజిక సమీకరణాలు.. సర్వే నివేదికల ఆధారంగా ఫైనల్ గా వెనిగళ్ల రాము వైపే చంద్రబాబు మొగ్గు చూపారు. రావి వేంకటేశ్వరరావుకు ఎమ్మెల్సీ ఇస్తానని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. గుడివాడతో సహా పలు కీలక నియోజకవర్గాల్లో అభ్యర్దుల పైన చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు.
ఇంఛార్జ్ ల ఖరారు
నెల్లూరు జిల్లా కావాలిలో కావ్య క్రిష్ణారెడ్డిని ఇంఛార్జ్ గా నియమించే అవకాశాలు ఉన్నాయి. అక్కడ సుబ్బానాయుడు ఇంఛార్జ్ గా ఉన్నారు. దీంతో క్రిష్ణారెడ్డిని పిలిచి చంద్రబాబు మాట్లాడారు. నెల్లూరు ఎంపీ సీటుకు పోటీ చేయాలని సూచించారు. అందుకు క్రిష్ణారెడ్డి తనకు ఎంపీ సీటు వద్దని..కావలి నుంచి పోటీ చేస్తానని..అందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. కావలిలో ఉన్న రాజకీయ సమీకరణాలతో కావ్య క్రిష్ణారెడ్డి వైపే చంద్రబాబు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.
అదే విధంగా ఉదయగిరి లో ఇంఛార్జ్ గా ఉన్న బొల్లినేని రామారావు వచ్చే ఎన్నికల్లో పోటీకి విముఖంగా ఉన్నారు. దీంతో..ఎన్నారై సురేశ్ రంగంలోకి వచ్చారు. ఈ ఇద్దరి మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు రామారావు తిరిగి తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. స్థానికంగా ఉన్న పరిస్థితులు..గెలుపు అవకాశాలు పరిశీలించి సీటు ఖరారు చేస్తానని చంద్రబాబు ఇద్దరు నేతలకు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
సర్వేల ఆధారంగా ఎంపిక
రాజంపేట ఎంపీ స్థానానికి టీడీపీ అభ్యర్థి గా సుగవాసి బాలసుబ్రమణ్యం పేరు దాదాపు ఖరారైంది. కొద్ది రోజుల క్రితం ఆయనను చంద్రబాబు పిలిపించి మాట్లాడారు. బాలసుబ్రమణ్యం తండ్రి పాలకొండ రాయుడు కడప జిల్లాలో కీలక నేగా వెలుగొందారు. గతంలో ఎమ్మెల్యేగా కూడా పని చేసారు. సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకొని బాలసుబ్రమణ్యం ఎంపిక చేసినట్లు చెబుతున్నారు.
అదే విధంగా... జనసేనకు సీట్ల కేటాయింపు పైనే టీడీపీ నియోజకవర్గాల్లో అభ్యర్దులను ఖరారు చేయాలని భావిస్తున్నారు. జనసేనకు 30 సీట్లు ఇచ్చేందుకు సూత్రప్రాయంగా నిర్ణయం జరిగింది. బీజేపీ పొత్తుకు కలిసి వస్తుందా లేదా అనేది స్పష్టత వచ్చిన తరువాత జనసేనకు కేటాయించే సీట్లను అధికారికంగా ప్రకటించనున్నారు. వచ్చే వారం నుంచి రాజకీయంగా చంద్రబాబు యాక్టివ్ కానున్నారు.
-
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!!












Click it and Unblock the Notifications