కీలక నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్ధి ఖరారు - అక్కడే అసలు ట్విస్ట్..!!
రాజధాని జిల్లాలో కీలక నియోకవర్గం నుంచి టీడీపీ అభ్యర్దిని ఖరారు చేసింది.
వైసీపీ వర్సస్ టీడీపీ. వచ్చే ఎన్నికల కోసం వ్యూహాలు అమలు చేస్తున్నాయి. కీలక నియోజకవర్గాల్లో అభ్యర్దులను ఖరారు చేస్తున్నాయి. కొన్ని చోట్ల అధికారికంగా ప్రకటన చేస్తుంటే..మరి కొన్ని నియోజకవర్గాల్లో వేచి చూసే ధోరణితో ఉన్నాయి. టీడీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు ఖరారు చేసారు. వైసీపీ కూడా ఇప్పటి వరకు కొన్ని మినహా టీడీపీ సిట్టింగ్ లు ఉన్నచోట అభ్యర్దులను ఫైనల్ చేస్తోంది. టీడీపీ -జనసేన పొత్తు పైన అధికారికంగా నిర్ణయం తరువాత అన్ని నియోజకవర్గాల పైనా క్లారిటీ రానుంది.అదే క్రమంలో ప్రస్తుతం ఇరిగేషన్ మంత్రిగా ఉన్న అంబటి రాంబాబు ప్రాతినిధ్యం వహిస్తున్నసత్తెనపల్లి నుంచి టీడీపీ అభ్యర్ధి ఖరారయ్యారు. అయితే, అక్కడ కొత్త పొలిటికల్ గేమ్ మొదలైంది. సీఎం జగన్ నిర్ణయం కీలకం కానుంది.

అంబటి పై టీడీపీ - జనసేన ఫోకస్
వైసీపీ మంత్రిగా ఉన్న అంబటి రాంబాబు కొంత కాలంగా టీడీపీ -జనసేనకు టార్గెట్ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో అంబటిని ఓడించాలనేది ఈ రెండు పార్టీల లక్ష్యం. జనసేనాని వర్సస్ అంబటి రాంబాబు పలు సందర్భాల్లో మాటల తూటాలు పేలాయి. పవన్ ను అంబటి టార్గెట్ చేస్తే ఆరోపణలు గుప్పించారు. అంబటి పైన పవన్ కల్యాణ్ అదే స్థాయిలో కౌంటర్లు ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచి తిరిగి మంత్రి అంబటి పోటీ చేస్తారా లేదా అనేది మాత్రం స్పష్టత రావాల్సి ఉంది. ఈ సారి అక్కడ నుంచి మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే పోటీకి దిగుతారని పెద్ద ఎత్తున ప్రచారంసాగుతోంది. ఇదే క్రమంలో సత్తెనపల్లి సీటు కోసం టీడీపీ నుంచి పోటీ నెలకొని ఉంది. జనసేన నుంచి గుంటూరు జిల్లాలో కీలక బాధ్యతలు చూస్తున్న నేత ఆ సీటు పైన ఆశలు పెట్టుకున్నారు. టీడీపీ -జనసేన కలిసి పోటీ చేస్తే అక్కడ గెలుపు ఖాయమనే లెక్కల్లో ఇరు పార్టీల నేతలు ఉన్నారు. కానీ, తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలతో సత్తెనపల్లి సీటు నుంచి టీడీపీ అభ్యర్ధి ఖరారు అయ్యారు. జనసేనానితోనూ సన్నిహిత సంబంధాలు ఉన్న నేత కావటంతో ఆయనకే సీటు ఫైనల్ కానుందని సమాచారం.

టీడీపీలోకి కన్నా - సత్తెనపల్లి నుంచి పోటీ
బీజేపీకి రాజీనామా చేసిన సీనియర్ నేత కన్నా ఈ నెల 23న టీడీపీలో చేరటం ఖాయమైంది. ఆయన సత్తెనపల్లి నుంచి ఎన్నికల బరిలో దిగనున్నట్లు సమాచారం. గుంటూరు పశ్చిమం పైన ప్రచారం సాగుతున్నా.. జనసేనతో పొత్తు ఖాయమైతే సీట్ల సర్దుబాటు..టీడీపీ సీనియర్లకు ప్రాధాన్యతలో భాగంగా ముందస్తుగానే కన్నాకు సత్తెనపల్లి ఖరారు చేసినట్లు చెబుతున్నారు. కన్నా లక్ష్మీనారాయణ గతంలో పెదకూరపాడు నుంచి నాలుగు సార్లు..గుంటూరు పశ్చిమం నుంచి ఒక సారి ఎమ్మెల్యేగా గెలిచి ఉన్నారు. సత్తెనపల్లి నియోజకవర్గంలో రెండు మండలాల్లో కన్నాకు పట్టు ఉంది. టీడీపీ ఓట్ బ్యాంక్ తో పాటుగా కన్నా ఎంట్రీ కలిసి వస్తుందని టీడీపీ అంచనా వేస్తోంది. ఇప్పుడు కన్నా బరిలోకి దిగనుండటంతో..వైసీపీ నుంచి కూడా అదే సామాజిక వర్గానికి చెందిన మంత్రి అంబటి తిరిగి పోటీ చేస్తారా.. ప్రచారం సాగుతున్నట్లుగా ఆర్కే లేక మరొకరు బరిలోకి దిగుతారా అనేది స్పష్టత రావాల్సి ఉంది.
సామాజిక సమీకరణాలే కీలకం..
సత్తెనపల్లి నియోజకవర్గంలో ఎవరు గెలవాలన్నా సామాజిక సమీకరణాలే ప్రభావితం చేస్తాయి. బీజేపీకి రాజీనామా చేసిన వెంటనే కన్నా సత్తెనపల్లిలో ప్రత్యక్షమయ్యారు. 2019 ఎన్నికల్లో కోడెల శివ ప్రసాదరావు పైన అంబటి రాంబాబు 21 వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు. కానీ, ఇప్పుడు టీడీపీలో వర్గ పోరు కొనసాగుతోంది. ఇదే సమయంలో కన్నా టీడీపీ నుంచి పోటీ చేసేందుకు రంగం సిద్దం అవుతోంది. ఇటు కన్నాకు మద్దతుగా నిలిచే కీలక వ్యక్తులతో అంబటి టచ్ లోకి వెళ్లినట్లు సమాచారం. కన్నా కు సీటు ఖరారు మూడు నియోజకవర్గాలతో లింకు అయి ఉంది. అదే సమయంలో జనసేనతో పొత్తు కీలకంగా మారనుంది. దీంతో..ఇప్పుడు చివరి నిమిషంలో అనూహ్య మార్పులు జరిగితే మినహా సత్తెనపల్లి నుంచి కన్నా పోటీ చేయటం ఖాయంగా కనిపిస్తోంది.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications