అసెంబ్లీ సమావేశాలకు చంద్రబాబు గైర్హాజరు..! అసలు కారణం అదేనా: ఏం జరుగుతోంది..!
టీడీపీ అధినేత..మాజీ ముఖ్యమంత్రి..ప్రతిపక్ష నేత చంద్రబాబు తొలి అసెంబ్లీ సమావేశాలకు గైర్హాజరవుతున్నారు. ఈ నెలలో ఏపీ అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, టీడీపీఎల్పీ నేతగా ఎన్నికైన చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఎన్నికైనట్లే. ఈ సమావేశాలకు చంద్రబాబు హాజరు కావటం లేదని సమాచారం. అయితే, చంద్రబాబు తొలి సమావేశాలకు హాజరు కాకపోవటం వెనుక అసలు కారణం ఏంటి అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. జగన్ ముఖ్యమంత్రి హాజరవుతున్న తొలి సమావేశాలు ఇవే కావటమే కారణమా అనేది ఇప్పుడు చర్చ..

గుంటూరులో జగన్..బెజవాడలో చంద్రబాబు
ఏపీలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత జగన్ తొలిసారి జిల్లా పర్యటనకు వెళ్తున్నారు. గుంటూరులో జరుగుతున్న ప్రభుత్వ అధికారిక ఇఫ్తార్ విందులో జగన్ పాల్గొంటున్నారు. ఇదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు విజయవాడలో పార్టీ ఎంపి కేశినేని ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొంటున్నారు. జగన్ అధికారిక సమీక్షలు నిర్వహిస్తూ గత ప్రభుత్వంలోని లోపాలను సరి చేసే పని ప్రారంభించారు. ఇదే సమయంలో చంద్రబాబు పార్టీ పరాజయం మీద సమీక్షలు ఏర్పాటు చేసారు. మంగళవారం నుండి 7వ తేదీ వరకు లోక్‌సభ నియోజవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు.

అసెంబ్లీ సమావేశాలకు బాబు గైర్హాజరు..
ఓట్ ఆన్ అకౌంట్‌తో ఎన్నికల ముందు అసెంబ్లీ సమావేశాలు ముగిసాయి. ఇక, ఇప్పుడు కొత్త అసెంబ్లీ ఈ నెల 12లోగా కొలువు తీరాల్సి ఉంది. తొలి శాసనసభకు సంబంధించి ఈనెల 8న జరిగే కేబినెట్ సమావేశంలో అధికారికంగా నిర్ణయం తీసుకోనున్నారు. అయితే ఈ సమావేశాలకు ప్రతిపక్ష నేత హోదాలో చంద్రబాబు హాజరయ్యే పరిస్థితి కనిపించం లేదు. ఈనెల 7వ తేదీన చంద్రబాబు కుటుంబ సభ్యులతో కలిసి సింగపూర్ వెళ్తున్నారు. తిరిగి 14వ తేదీన తిరిగి అమారావతి చేరుకుంటారు. దీంతో..తొలి అసెంబ్లీ సమావేశాలకు ఆయన అందుబాటులో ఉండే అవకాశం లేదు. ఈ నెలలోనే ఏపీ అసెంబ్లీ తొలి విడత సమావేశాలు జరుగుతాయని సమాచారం ఉన్నా..చంద్రబాబు సరిగ్గా అదే సమయానికి చంద్రబాబు విదేశీ పర్యటనకు వెళ్తుండటం పైన అనేక రకాలుగా చర్చలు సాగుతున్నాయి.

ఓటమి నుండి బయటపడలేదా..
ఏపీలో తిరిగి విజయం ఖాయమని ఫలితాల రోజు ఉదయం కూడా చంద్రబాబు చాలా ధీమాగా ఉన్నారు. అయితే ఫలితాలు మాత్రం టీడీపీకి పూర్తి నిరాశ మిగిల్చాయి. ఊహించని ఫలితాలతో చంద్రబాబు సైతం ఆవేదన చెందారు. అసలు జగన్‌కు ఎందుకు ఓటు వేస్తారని ప్రశ్నించిన చంద్రబాబు..ఆ తరువాత జగన్ పైన సానుభూతితోనే ఓట్లు వేసారని..తమ పైన వ్యతిరేకతతో కాదని చెప్పుకొచ్చారు. ఇక, తొలి అసెంబ్లీ సమావేశాల్లో తొలుత ముఖ్యమంత్రి హోదా లో జగన్..ఆ తరువాత ప్రతిపక్ష నేత హోదాలో చంద్రబాబాబు ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేయాల్సి ఉంటుంది. లాంఛనంగా పరస్పర అభినందనలు ఉంటాయి. దీనికి హాజరు అవ్వటానికి అయిష్టత కారణంగానే..చంద్రబాబు విదేశీ పర్యటనకు వెళ్లాలని నిర్ణయించారనే వాదన వినిపిస్తోంది. మరి..దీని పైన వైసీపీ..టీడీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.
-
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!!












Click it and Unblock the Notifications