వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జ‌గ‌న్‌కు అవ‌గాహ‌న లేదు..చెప్పుడు మాట‌లు వింటారు : భ‌విష్య‌త్‌పై భ‌రోసా ఇస్తేనే.. చంద్ర‌బాబు..!

|
Google Oneindia TeluguNews

ఏపీ శాస‌న‌స‌భా సమావేశాల‌కు ముందుగానే ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ల‌క్ష్యంగా విప‌క్ష నేత చంద్ర‌బాబు విమర్శ‌లు స్టార్ట్ చేసారు. విప‌క్ష నేత‌గా జ‌గ‌న్ ఉన్న స‌మ‌యంలో తాను ముఖ్య‌మంత్రి ఏదైతే విమ‌ర్శ‌లు చేసారో..ఇప్పుడూ అవే కొనసాగిస్తున్నారు. జ‌గ‌న్‌కు అవ‌గాహ‌న లేద‌ని..చెప్పుడు మాట‌లు వింటారంటూ చంద్ర‌బాబు చెప్పుకొచ్చారు. సీఎం స్థాయిలో ఉన్న వ్య‌క్తి భ‌విష్య‌త్ పైన భ‌రోసా ఇస్తేనే పెట్టుబ‌డులు వ‌స్తాయని పేర్కొన్నారు.

కట్నంలో మోటార్ బైక్ ఇవ్వలేదని... భార్యను హత్య చేసిన భర్త...! కట్నంలో మోటార్ బైక్ ఇవ్వలేదని... భార్యను హత్య చేసిన భర్త...!

వైసీపీది అదే సిద్దాంతం...

వైసీపీది అదే సిద్దాంతం...

మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు పార్టీ నేత‌ల‌తో స‌మావేశ‌మ‌య్యారు. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ పైన ప‌రోక్షంగా విమ‌ర్శ‌లు చేసారు. అవ‌గాహ‌న లేకుండా పోవ‌టం..చెప్పుడు మాట‌లు విన‌డం..టీడీపీ పైన బుర‌ద జ‌ల్ల‌డ‌మే వైసీపీ త్రిసూత్రంగా పెట్టుకుందంటూ చంద్ర‌బాబు విమ‌ర్శించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే నేతల నాయకత్వ సామర్థ్యం బయటపడు తుందన్నారు. అసెంబ్లీలో తన కంటే మిగతావారి వాయిస్ ఎక్కువగా వినబడాలని దిశానిర్దేశం చేశారు. పార్టీ, ప్రజల పట్ల బాధ్యత తూచా తప్పకుండా నిర్వర్తించాలన్నారు. సమస్యల పరిష్కారంపై టీడీపీ పోరాట పటిమ ప్రజల్లోకి వెళ్లాలని చంద్ర‌బాబు స్ప‌ష్టం చేసారు. రాష్ట్రాభివృద్ధి, పేదల సంక్షేమమే లక్ష్యంగా ముందుకెళ్లాలని కొత్త ప్రభుత్వానికి టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు సూచించారు.

అది ప్ర‌భుత్వ బాధ్య‌తే..

అది ప్ర‌భుత్వ బాధ్య‌తే..

రైతు రుణమాఫీ 4, 5వ విడతలు చెల్లించడం ప్రభుత్వానిదే బాధ్యత అని పేర్కొన్నారు. 10శాతం వడ్డీతో సహా రైతులకు ఇచ్చిన బాండ్లను గౌరవించాలన్నారు. భవిష్యత్తు ఉందంటేనే ఎవరైనా రాష్ట్రానికి వస్తారని, పెట్టుబడులు పెడతారని చంద్రబాబు చెప్పారు. టీడీపీ కార్యకర్తలు, నేతలపై దాడులను, దౌర్జన్యాలను ఖండిస్తూ టీడీఎల్పీ తీర్మానం చేసింది. కార్యకర్తల రక్షణ కోసం టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. కార్యకర్తల రక్షణ కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయించారు. గత 37 ఏళ్లలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నామని గుర్తుచేశారు. ఎన్టీఆర్ హయాంలో, ఆ తర్వాత అనేక అవమానాలు భరించామని, ప్రజల అండదండలతోనే అన్నింటిని తట్టుకుని నిలబడ్డామని చెప్పుకొచ్చారు. రాష్ట్రం కోసం, ప్రజల కోసం పట్టుదలతో పోరాడుదామని పిలుపునిచ్చారు. కార్యకర్తల్లో, నాయకుల్లో ఆత్మవిశ్వాసం పెంచాల్సిన అవసరం ఉందని చంద్రబాబు పేర్కొన్నారు.

అసెంబ్లీ స‌మావేశాల్లో ఇలా...

అసెంబ్లీ స‌మావేశాల్లో ఇలా...

టీడీపీ శాస‌న‌స‌భా ప‌క్ష స‌మావేశంలో ఎలా వ్య‌వ‌హ‌రించాల‌నే అంశం పైన చర్చించారు. శాస‌న‌స‌భలో ఉప నేత‌లుగా అచ్చం నాయుడు..ప‌య్యావుల కేశ‌వ్‌ల్లో ఒక‌రికి అవ‌కాశం ఇవ్వాల‌ని దాదాపు ఒక నిర్ణ‌యానికి వ‌చ్చారు. అదే విధంగా మ‌రొక‌రికి పీఏసీ ఛైర్మ‌న్‌గా సిఫార్సు చేయ‌నున్నారు. ప్ర‌భుత్వం ఏర్పాటు చేసే క‌మిటీల్లో క్రియా శీల‌కంగా వ్య‌వ‌హ‌రించా ల‌ని చంద్ర‌బాబు నిర్ధేశించారు. ఎట్టి ప‌రిస్థితుల్లో పార్టీ వాయిస్ వినిపించ‌టంలో వెనుక‌డుగు వేయ‌వ‌ద్ద‌ని స్ప‌ష్టం చేసారు.

English summary
TDP Chief Chandra Babu once again serious comments on YCP. He directed party MLA's to play active role in Assembly sessions. Chandra Babu asked govt to continue loan waiver.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X