టిడిపి మూడో జాబితా, వారికి ఇక డౌటే- అనూహ్య ఎంపిక..!!
టిడిపి మూడో జాబితా విడుదలైంది. 13 ఎంపీ స్థానాలతో పాటు 11 అసెంబ్లీ స్థానాలకు చంద్రబాబు తమ అభ్యర్థులను ప్రకటించారు. మైలవరం, పెనమలూరు నియోజకవర్గం అభ్యర్థులను ఖరారు చేశారు. గంటా తో సహా పలువురు సీనియర్ల సీట్లపై ఇంకా స్పష్టత రాలేదు.
చంద్రబాబు నాయుడు తమ పార్టీ నుంచి పోటీ చేసే ఎంపీ ఎమ్మెల్యేల అభ్యర్థుల పేర్లతో మూడో జాబితాను విడుదల చేశారు. తొలి జాబితాలో 94 మంది, రెండో జాబితాలో 34 మంది పేర్లను ఖరారు చేసిన చంద్రబాబు, ఈసారి 11 ఎమ్మెల్యే 13 ఎంపీ స్థానాలకు తమ అభ్యర్థులను ప్రకటించారు. శ్రీకాకుళం- గౌతు శిరీష, పాతపట్నం నుంచి గోవిందరావు, శ్రీకాకుళం నుంచి గొందు శంకర్, శృంగవరపు కోట నుంచి కోల లలిత కుమారి, కాకినాడ సిటీ నుంచి వనమాడి వెంకటేశ్వరరావు, అమలాపురం నుంచి అయినా బత్తుల ఆనందరావు, పెనమలూరు నుంచి బోడె ప్రసాద్, మైలవరం నుంచి వసంత వెంకటకృష్ణ ప్రసాద్, నరసరావుపేట నుంచి చదలవాడ అరవింద్ బాబు, చీరాల నుంచి మాలకొండయ్య యాదవ్, సర్వేపల్లి నుంచి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్లు ప్రకటించారు.

ఎంపీ అభ్యర్థులుగా శ్రీకాకుళం నుంచి కింజరపు రామ్మోహన్ నాయుడు, విశాఖ నుంచి మోత్కుపల్లి భరత్, అమలాపురం నుంచి గంటి హరీష్ కుమార్, ఏలూరు నుంచి పుట్టా మహేష్ యాదవ్, విజయవాడ నుంచి కేశినేని చిన్ని, గుంటూరు నుంచి పెమసాని చంద్రశేఖర్, నరసరావుపేట నుంచి లావు శ్రీకృష్ణదేవరాయలు, బాపట్ల నుంచి కృష్ణ ప్రసాద్, నెల్లూరు నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, చిత్తూరు నుంచి డి ప్రసాద్ రావు, కర్నూలు నుంచి పంచలింగాల నాగరాజు, నంద్యాల నుంచి బైరెడ్డి శబరి, హిందూపూర్ నుంచి బికే పార్థసారధి పేర్లు ప్రకటించారు. సీట్ల పైన ఆశలు పెట్టుకున్న సీనియర్ లీడర్లు దేవినేని ఉమా, గంటా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణమూర్తి, కళా వెంకట్రావు పేర్లు ఈ జాబితాలో లేవు. దీంతో సీనియర్లలో మరింత ఉత్కంఠ పెరుగుతుంది.












Click it and Unblock the Notifications