పార్టీ నేతలకు చంద్రబాబు హెచ్చరిక - రాష్ట్రాన్ని పునర్ నిర్మించాలి: పార్టీ సభ్యత్వ ప్రారంభం..!!

టీడీపీ అధినేత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేసారు. పార్టీలోని కొందరు నేతలను ఉద్దేశించి వార్నింగ్ ఇచ్చారు. టీడీపీ సభ్యత్వ నమోదును ఆయన లాంఛనంగా ప్రారంభించారు. టీడీపీ సభ్యత్వం కోరుకొనే వారువాట్స్ యాప్, టెలిగ్రామ్, మన టీడీపీ యాప్ ద్వారా తమ సభ్యత్వం పొందే అవకాశం కల్పించారు. ముందుగా ఉండవల్లి గ్రామానికి చెందిన వారితో సభ్యత్వం నమోదు ప్రారంభమైంది. అదే సమయంలో చంద్రబాబు ఏపీని తిరిగి నిర్మించాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చారు. పార్టీ కొందరు నేతలకు ప్రాధాన్యత ఇచ్చినా..వారు పార్టీని వీడి ద్రోహం చేసారని వ్యాఖ్యానించారు.

వారి ఆటలు ఇక సాగవ్..

వారి ఆటలు ఇక సాగవ్..

అయినా..వారి కంటే సమర్ధులను టీడీపీ అక్కడ నేతలుగా తయారు చేస్తుందన్నారు. ఇదే సమయంలో...ఫీల్డ్ లో పని చేయకండా తప్పించుకొనే వారి ఆటలు ఇక సాగవ్ అంటూ చంద్రబాబు హెచ్చరించారు. అటువంటి వారికి చెక్ తప్పదన్నారు. ఎవరు పని చేసారు..ఎవరు తప్పించుకుంటున్నారనేది మానిటర్ చేసే వ్యవస్థ అందుబాటులోకి వచ్చిందని వెల్లడించారు. కొందరు పని చేయకుండా..పార్టీ కార్యాలయం చుట్టూ తిరుగతూ ఉంటారని పేర్కొన్నారు.

కార్యకర్తలకు రూ 2 లక్షల భీమా

కార్యకర్తలకు రూ 2 లక్షల భీమా

ఈ సారి మాత్రం పార్టీ కోసం పని చేసేవారు..ప్రజల్లో ఉన్న వారికే టిక్కెట్లు దక్కుతాయని చంద్రబాబు స్పష్టం చేసారు. పార్టీకి చంద్రబాబు లక్ష రూపాయాల విరాళం ఇచ్చారు. చంద్రబాబుతో పాటు రాష్ట వ్యాప్తంగా తెలుగుదేశం నాయకులు ఆన్​లైన్​లో సభ్యత్వ నమోదు చేపట్టారు. 100 రూపాయలు చెల్లింపు ద్వారా పార్టీ సభ్యత్వం పొందే అవకాశమిచ్చారు. సభ్యత్వం కార్డు పొందిన వారికి రూ. 2 లక్షల బీమా సౌకర్యాన్ని తెలుగుదేశం కల్పించింది.

అమరావతి పైనా కీలక వ్యాఖ్యలు

అమరావతి పైనా కీలక వ్యాఖ్యలు

అచ్చెన్నాయుడు, నారా లోకేశ్​లు తమ సభ్యత్వాన్ని రెన్యువల్ చేసుకున్నారు. లోకేష్ సైతం పార్టీ సభ్యత్వం గురించి వివరించారు. దేశంలో ఏ పార్టీకి లేని బలం టీడీపీ సొంతమని చెప్పారు. అన్న ఎన్టీఆర్ దేవుడు అయితే..చంద్రన్న రాముడని చెప్పుకొచ్చారు. ప్రతీ కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందన్నారు.

ప్రతి ఒక్కరూ సభ్యత్వ నమోదులో చురుగ్గా పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. అమరావతి నుంచి మహిళా రైతులు సైతం పాల్గొన్నారు. అమరావతి నిర్మాణం పూర్తి కావాలంటే తిరిగి చంద్రబాబు సీఎం కావాలని కోరుతూ..సభ్యత్వం తీసుకోవటంతో పాటుగా విరాళాలు ప్రకటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+