Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

చెప్పిన మాటను ఆయన పెద్ద మనసుతో విన్నారు చంద్రబాబు

ప్రభుత్వాలు మంచి విధానాలు రూపొందిస్తే డబ్బు ఖర్చు పెట్టకుండానే ప్రజలకు మేలు చేయవచ్చని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. ఎలా మేలు జరుగుతుందనేదానికి వాజ్ పేయీ హయాంలో నిర్మించిన స్వర్ణ చతుర్భుజి జాతీయ రహదారులతోపాటు తాను తెచ్చిన ఐటీ విధానాలే నిదర్శనమన్నారు. ఢిల్లీలో ఆయన జాతీయ మీడియాతో మాట్లాడుతూ పలు విషయాలను పంచుకున్నారు.

Recommended Video

    జగన్ బటన్ క్లిక్... ఎమ్మెల్యేలూ అవుట్ *Andhra Pradesh | Telugu OneIndia
     దేశ రహదారుల ముఖచిత్రమే మారిపోయింది

    దేశ రహదారుల ముఖచిత్రమే మారిపోయింది


    అప్పట్లో తాను మలేషియా పర్యటనకు వెళ్లిన సమయంలో రోడ్లను చూసి వాటితో మన రోడ్లను పోల్చి చూసి ప్రధానమంత్రిగా ఉన్న వాజ్ పేయీ దృష్టికి తీసుకువెళ్లానని, ఆయన పెద్దమనసుతో విన్నారని, తర్వాత స్వర్ణ చతుర్భుజికి ఆమోదముద్ర వేశారని గుర్తు చేశారు. తర్వాత దేశ రహదారుల ముఖచిత్రమే మారిపోయిందన్నారు. ఐటీలో కొత్త విధానం తీసుకురావడంతోపాటు సైబరాబాద్ నిర్మాణానికి తాను శ్రీకారం చుట్టానని, ఆ తర్వాత ఐటీలో తెలుగువారి ప్రాబల్యం రెక్కలు కట్టుకొని ఎగిరిందన్నారు. ప్రపంచంలోని ఐటీ నిపుణుల్లో తెలుగువారి వాటా 30 శాతంగా ఉందని, విదేశాల్లోని రాజకీయాలను మనవాళ్లు ప్రభావితం చేయగలిగే స్థాయికి చేరారన్నారు.

     ఏపీలో ప్రజలు తిరుగుబాటుకు సిద్ధంగా ఉన్నారు!

    ఏపీలో ప్రజలు తిరుగుబాటుకు సిద్ధంగా ఉన్నారు!


    రాజకీయాల్లో ఓడొచ్చు.. గెలవొచ్చు.. కానీ మనం ప్రవేశపెట్టిన విధానాలవల్ల భావితరాలకు మేలు కలిగితే ఎంతో సంతృప్తినిస్తుందని, సైబరాబాద్ ను చూస్తే తనకు అదే భావన కలుగుతుందని చెప్పారు. విభజిత ఏపీ అభివృద్ధికి తాను వేసిన పునాదులను ప్రస్తుత ముఖ్యమంత్రి దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని, అందుకే ప్రజలు తిరుగుబాటుకు సిద్ధమయ్యారని చంద్రబాబు విమర్శించారు. జగన్ ప్రభుత్వాన్నిఇంటికి పంపే సమయం కోసం ప్రజలు వేచిచూస్తున్నారని, అరాచకం సాగిస్తూ అభివృద్ధిని గాలికొదిలేశారని మండిపడ్డారు. ఏపీ అన్నిరంగాల్లో కుప్పకూలిపోయిందన్నారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, అప్పులు తప్ప అభివృద్ధి లేదని, వ్యవస్థలన్నింటినీ నాశనం చేశారన్నారు.

    తలసరి ఆదాయం ఎక్కువే ఉంది

    తలసరి ఆదాయం ఎక్కువే ఉంది


    2029కల్లా ఏపీని దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిపేలా పునాదులు వేసినప్పటికీ జగన్ వైఖరితో ప్రయోజనం లేకుండాపోయిందని, రాష్ట్ర అభివృద్ధికి కీలకమైన పోలవరం, అమరావతి నిర్మాణానికి పూనుకుంటే ఆ రెండింటినీ నాశనం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో ఏ వర్గం ప్రజలు ఇప్పుడు సంతోషంగా లేరని, కొవిడ్ తోపాటు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం సహా అనేక విపత్తులు ఎదురైనా మిగతా దేశాలతో పోలిస్తే మనదేశం తట్టుకొని నిలబడిందని, యూరప్ దేశాలతో సహా అనేక దేశాలతో పోలిస్తే దేశ ఆర్థిక వ్యవస్థ గట్టిగా ఉందని, తలసరి ఆదాయం ఎక్కువే ఉందని చంద్రబాబు విశ్లేషించారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+