బిజెపితో చంద్రబాబు వన్ సైడ్ లవ్వేనా - ఢిల్లీలో ఏం జరుగుతుంది..!!

ఏపీలో ఎన్నికల రాజకీయం కొత్త మలుపులు తీసుకుంటుంది. 2014 పొత్తులు రిపీట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. బిజెపి జనసేన తో పొత్తు ఉంటుందని చంద్రబాబు సంకేతాలు ఇచ్చారు. చంద్రబాబుతో మరోసారి కలిసేందుకు బిజెపి సిద్దమేనా..వన్ సైడ్ లవ్వా..ఢిల్లీలో అసలు ఏం జరుగుతుంది.

చంద్రబాబు కొత్త లెక్కలు
ఏపీలో ఎలాగైనా అధికారం దక్కించుకోవాలనేది టిడిపి అధినేత చంద్రబాబు లక్ష్యం. ఎందుకోసం పొత్తుల పట్టారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ తో పొత్తు దాదాపు ఖరారు అయింది. బిజెపితో పొత్తుకు సిద్ధమని ఢిల్లీ వేదిక చంద్రబాబు సంకేతాలు ఇచ్చారు. ఢిల్లీ పర్యటనలో టిడిపి అధినేత చంద్రబాబు పొత్తులకు సిద్ధమని స్పష్టం చేశారు.

tdp

తెలంగాణలో మాత్రం పొత్తు ఉండదని తేల్చి చెప్పారు. ఏపీలో ఎవరితో పొత్తు అనేది స్పష్టం చేయకపోయినా చంద్రబాబు వ్యాఖ్యలు బిజెపి వైపు మొగ్గుచూపుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 2014లో జగన్ ఓడించేందుకు టిడిపి బిజెపి జనసేన కలిసి పనిచేశాయి. ఆ ఎన్నికల్లో టిడిపి అధికారంలోకి రాగా బిజెపి భాగస్వామిగా ఉంది ఆ సమయంలో జనసేన అధికారంలో భాగస్వామి కాలేదు కానీ ఇప్పుడు జనసేన సీట్ల తో పాటు పవర్ షేరింగ్ లోను భాగస్వామి అవ్వటం ఖాయంగా కనిపిస్తుంది.

ఢిల్లీ వేదికగా ప్రతిపాదన
వీటన్నిటికీ సిద్ధపడే చంద్రబాబు పొత్తుల ప్రతిపాదన చేసినట్లు కనిపిస్తుంది. ఏపీ నేతలు మాత్రం ఇప్పటివరకు తమకు జనంతో జనసేనతో మాత్రమే పొత్తని చెప్తూ వస్తున్నారు. బిజెపికి ఏపీలో ప్రత్యక్షంగా ఎవరితో పొత్తులు లేకపోయినా అవసరమైన సమయంలో వైసీపీ టిడిపి నుంచి మద్దతు లభిస్తూనే ఉంది. ఏపీ కంటే తెలంగాణలో బలం చాటుకోవటం బిజెపికి అవసరంగా మారింది. కానీ తెలంగాణలో టిడిపి తో పొత్తుకు బిజెపి సుముఖంగా లేదు. ఫలితంగా తెలంగాణ ఎన్నికల తర్వాతనే ఏపీ పొత్తుల పైన చర్చించాలని గతంలో నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసినీయ సమాచారం.

ఇప్పుడు తెలంగాణలో పొత్తులు అవకాశం లేదని తేల్చిన చంద్రబాబు, ఏపీలో మాత్రం సమయానికి అనుగుణంగా నిర్ణయాలు ఉంటాయని వెల్లడించారు. ఇప్పటివరకు బిజెపి నుంచి టీడీపీతో పొత్తు పైన ఎటువంటి సానుకూల సంకేతాలు కనిపించలేదు. ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ ఉన్న టిడిపి ఒక రాష్ట్రంలోనే పొత్తుకు సిద్ధం కావడం అనేది ఇప్పుడు రాజకీయంగా చర్చకు కారణం అవుతుంది.

బీజేపీ సిద్దమేనా
కొద్ది రోజుల క్రితం జరిగిన ఎన్డీఏ సమావేశానికి పవన్ కళ్యాణ్ ని ఆహ్వానించిన బిజెపి టిడిపిని పిలవలేదు. ఇప్పుడు చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో తన ప్రతిపాదనను బిజెపి నేతలకు తెలియజేయడం కోసమే ఈ వ్యాఖ్యలు చేసినట్లు అభిప్రాయం వ్యక్తం అవుతుంది. దీనిపైన ఇప్పటివరకు బిజెపి నేతలు ఎవరు స్పందించలేదు.

 BJP

2019 ఎన్నికల సమయంలో తోటి చేసుకున్న పరిణామాలు ప్రధాని మోడీపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను పదేపదే గుర్తుచేస్తున్న బిజెపి నేతలు ఇప్పుడు తిరిగి అదే పార్టీతో పొత్తు పైన ఏ రకంగా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారుతుంది. బిజెపితో ప్రాథమికంగా చర్చల తర్వాతనే చంద్రబాబు ఈ ప్రతిపాదన చేశారా.. లేక ముందుగానే తన నుంచే ప్రతిపాదన చేయటం ద్వారా బిజెపి స్పందన కోసం ఎదురుచూస్తున్నారా అనేది మరికొద్ది రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+