పెద్దిరెడ్డీ.. నేను అనుకునుంటే నువ్వు..? చంద్రబాబు
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నిప్పులు చెరిగారు. కుప్పంలో ఆయన మాట్లాడారు. పెద్దిరెడ్డీ నీ తడాఖా ఏంటో చూస్తానని, తమషాగా ఆటలాడుతున్నావని, మాపై తప్పుడు కేసులు పెట్టి పైశాచిక ఆనందం పొందుతున్నాడంటూ మండిపడ్డారు. 14 సంవత్సరాలు నేను కూడా అలాగే అనుకొనివుంటే నువ్వు జిల్లాలో తిరిగేవాడివా? ఇదే కుప్పంలో ప్రజల్ని రూ.50 కోట్లు అడుగుతావా? కప్పం కట్టాలని బెదిరిస్తావా?నువ్వొక రాజకీయ నాయకుడివేనా? అంటూ ప్రశ్నించారు. రౌడీలను ప్రోత్సహిస్తామంటే 'ఖబడ్డార్' అన్నారు.
రాష్ట్రం అంధకారంలోకి వెళ్లకూడదని పోరాడుతున్నామని, తప్పుడు కేసులు పెట్టి మమ్మల్ని అడ్డుకోవాలనుకుంటున్నారని, తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వైఎస్, షర్మిల, జగన్ పాదయాత్రలు చేశారని, ఆ యాత్రకు పోలీసు భద్రత కల్పించామన్నారు. ఇప్పుడు వీరు మాత్రం నా నియోజకవర్గంలో నేను తిరుగుతానంటే అడ్డుపడుతున్నారని ధ్వజమెత్తారు. పోలీసు వ్యవస్థలో కొందరు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని, చట్టాలను అతిక్రమించిన పోలీసులు నేరస్తులేనని గుర్తుచేశారు.

జిల్లా ఎస్పీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై దాడులకు వచ్చారా? లా అండ్ ఆర్డర్ ను కాపాడేందుకు వచ్చారా? అని ప్రశ్నించారు. టీడీపీ నాయకులను బయట తిరగనివ్వకుండా చేయాలనే ఉద్దేశంతో చేసిన కుట్రలో భాగంగానే కందుకూరు, గుంటూరు ఘటనలు జరిగాయని, ఇప్పుడు కుప్పంలోను అలాగే చేస్తున్నారన్నారు. పోలీసులపై ప్రయివేటు కేసులు పెట్టి బోనెక్కించడం ఖాయమన్నారు. 5 కోట్ల ప్రజలు ఒకవైపు, జగన్ మరోవైపు ఉన్నారని, వైసీపీ నాయకులు రాష్ట్రాన్ని కాపాడతారా? సైకో పక్కనుంటారా ఆలోచించుకోవాలన్నారు.












Click it and Unblock the Notifications