అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

భీమవరంపై చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ ఎందుకు?

|
Google Oneindia TeluguNews

వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పయనిస్తోన్న తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఇప్పటికే 156 నియోజకవర్గాలను పూర్తిస్థాయిలో సమీక్షించారు. ఇంకా సమీక్షించాల్సిన నియోజకవర్గాలు కేవలం 19. గతంలో ఎన్నడూ లేనివిధంగా దూకుడుగా పనిచేస్తోన్న చంద్రబాబు ఎక్కడికక్కడ గెలుపు గుర్రాలను ఖరారు చేసుకుంటూ వస్తున్నారు. తాను తెప్పించుకున్న సర్వే ప్రకారం గెలుపు కష్టం అనుకున్న ఇన్ ఛార్జిలను కేవలం పనిచేయమని చెబుతున్నారు. వారికి సీటుపై ఎటువంటి హామీ ఇవ్వడంలేదు.

పార్టీ అధ్యక్షురాలితో సమీక్ష

పార్టీ అధ్యక్షురాలితో సమీక్ష

ఉండవల్లిలోని తన నివాసంలో పశ్చిమ గోదావరి జిల్లా పార్టీ అధ్యక్షురాలు సీతారామలక్ష్మితో గంటలన్నర సమయం భేటీ అయ్యారు. భీమవరం నియోజకవర్గంలో నెలకొన్న పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. వీటితోపాటు జిల్లాలోని ఇతర నియోజకవర్గాల పరిస్థితిపై ఆరా తీశారు. భీమవరం నియోజకవర్గంలో పార్టీ సభ్యత్వ నమోదు చాలా తక్కువగా ఉందని, రానున్న రోజుల్లో మీకిచ్చిన లక్ష్యాలను చేరుకోవాలని చెప్పారు.

ఇదే పనితీరు మున్ముందు కూడా కొనసాగించాలి..

ఇదే పనితీరు మున్ముందు కూడా కొనసాగించాలి..


భీమవరంలో పార్టీ పరిస్థితి ఆశాజనకంగా ఉందని, వచ్చేది ఎన్నికల కాలం కాబట్టి ఇదే పనితీరును మున్ముందు కూడా కొనసాగించాలన్నారు. నాయకులంతా సహకరించుకుంటూ ముందుకు సాగడమే ముఖ్యమని ఉద్భోదించారు. జనసేనతో పొత్తుకు సంబంధించి జిల్లా అంతా విస్త్రతమైన చర్చ జరుగుతోందని సీతారామలక్ష్మి ప్రస్తావించారు. పొత్తుల సంగతి తాను చూస్తానని, నాయకులు మాత్రం కష్టపడి పనిచేయాల్సిందేనని, ప్రజలతో కలిసి మెలిసి వ్యవహరించాల్సిందేనన్నారు. పాలకొల్లు, తణుకు, ఆచంట నియోజకవర్గాల్లో టీడీపీ పనితీరు 100కు 100 శాతం బాగుందని, జిల్లాలోని ఇతర నియోజకవర్గాలు కూడా ఇదే పనితీరును కనపరిచేలా చూడాలంటూ సీతారామలక్ష్మిని ఆదేశించారు.

టీడీపీ, జనసేన బలం కలగలిసి విజయాన్నందించాలి

టీడీపీ, జనసేన బలం కలగలిసి విజయాన్నందించాలి

భీమవరం నియోజకవర్గంలో పార్టీ పటిష్టంగా ఉన్నప్పటికీ గత ఎన్నికల్లో మూడోస్థానంలో నిలబడింది. జనసేనాని పవన్ కల్యాణ్ పోటీచేయడంతో టీడీపీకి ఇటువంటి పరిస్థితి ఎదురైంది. జనసేనతో పొత్తు ఉంటుందని వార్తలు వస్తున్న తరుణంలో ఈ నియోజకవర్గంపై చంద్రబాబు ప్రత్యేకంగా దృష్టిసారించారు. ఎప్పటికప్పుడు పార్టీ పరిస్థితిని సమీక్షించడంతోపాటు బలోపేతానికి చర్యలు చేపడుతున్నారు. కచ్చితంగా ఈసారి మనం అధికారంలోకి రాబోతున్నామంటూ పార్టీ శ్రేణులను ఉత్సాహపరుస్తున్నారు. జనసేనతో పొత్తు కుదిరితే భీమవరం ఆ పార్టీకి కేటాయిస్తారనే ఉద్దేశంతో తెలుగు తమ్ముళ్లు పనిచేయడం మానేశారనే వార్తలు రావడంతో పార్టీ అధ్యక్షురాలిని పిలిచి మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ఎక్కడి నుంచి పోటీచేస్తారనే విషయం ఖరారు కాలేదు. తిరుపతి, పిఠాపురం, కాకినాడ రూరల్ తోపాటు గాజువాక, భీమవరం పేర్లు కూడా వినపడుతున్నాయి. చంద్రబాబు ప్రత్యేకంగా భీమవరం నియోజకవర్గంపై దృష్టి కేంద్రీకరించడంతో అభ్యర్థి ఏ పార్టీకి చెందినవారైనా సరే టీడీపీ బలం, జనసేన బలం కలిసి వైసీపీ ఓడించాలనేది లక్ష్యంగా ఉంది.

English summary
The situation of the party in Bhimavaram is promising and as the election period is coming, they want to continue the same performance in the future as well
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X