విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తీరు మారకపోతే ఇక అంతే, మీ చరిత్ర తెలుసు, గుంటూరు నేతలకు బాబు క్లాస్

గుంటూరు జిల్లాకు చెందిన పార్టీ నాయకులకు టిడిపి అధినేత చంద్రబాబునాయుడు క్లాస్ తీసుకొన్నారు. పద్దతిని మార్చుకోకపోతే తానే ప్రత్యామ్నాయాన్ని చూసుకొంటానని బాబు హెచ్చరించారు. పార్టీ నాయకులతో ముఖామఖి సమావేశం

By Narsimha
|
Google Oneindia TeluguNews

అమరావతి:ప్రభుత్వ పనులపై నిత్యం తీరిక లేకుండా బిజీ బిజీగా గడుపుతున్న టిడిపి అధినేత చంద్రబాబునాయుడు ఇక పార్టీ కార్యక్రమాలపై కూడ దృష్టికేంద్రీకరించారు. గుంటూరుజిల్లాలో పార్టీ నాయకుల తీరుపై మండిపడ్డారు. పద్దతిని మార్చుకోవాలని పార్టీ నాయకులకు హితవు పలికారు. లేకపోతే ప్రత్నామ్నాయం చూసుకొంటామని ఆయన హెచ్చరించారు.

జిల్లాల వారీగా పార్టీ నాయకుల పనితీరును అంచనావేయాలని పార్టీ అధినేత చంద్రబాబునాయుడు భావిస్తున్నారు. ఈ మేరకు బాబు ఆయా జిల్లాల్లో పార్టీ నాయకుల పనితీరు పట్ల నివేదికలను తెప్పించుకొంటున్నారు.

గుంటూరు జిల్లాకు చెందిన మంత్రులు, ఎంపి, ఎంఏల్ఏలు, ప్రజాప్రతినిధులతో చంద్రబాబునాయుడు సమావేశమయ్యారు.జిల్లాల్లో పార్టీ నాయకుల తీరు తెన్నుల పట్ల ఆయన అసంతృప్తిని వ్యక్తం చేశారు.

త్వరలోనే గుంటూరు జిల్లాకు చెందిన పార్టీ నాయకులతో విడివిడిగా సమావేశం కానున్నట్టు బాబు ప్రకటించారు. నాయకులు వ్యవహరిస్తున్న తీరు పార్టీకి తీవ్రంగా నష్టం చేస్తోందనే అభిప్రాయాన్ని బాబు వ్యక్తం చేస్తున్నారు.

పనితీరు మార్చుకోకపోతే మార్చేస్తాను

పనితీరు మార్చుకోకపోతే మార్చేస్తాను

గుంటూరు జిల్లాలా మంత్రులు,ఎంఏల్ఏలు, ఎంపిలతో సమావేశం సందర్భంగా కొందరు నాయకుల తీరును చంద్రబాబునాయుడు ప్రత్యేకించి ప్రస్తావించారు. ఈ మేరకు ఆయానాయకులు తమ పద్దతులను మార్చుకోవాలని లేకపోతే ప్రత్యామ్యాయాలను చూసుకొంటానని బాబు హెచ్చరించారు. ఈ నాయకుల తీరుతో పార్టీకి తీవ్రంగా నష్టం వాటిల్లుతోందని బాబు చెప్పారు. పనితీరును మార్చుకోవాలని బాబు పార్టీ నాయకులకు సూచించారు. లేకపోతే తానే వారి స్థానంలో కొత్త వారిని చూసుకొంటానని చంద్రబాబునాయుడు పార్టీ నాయకులను హెచ్చరించారు.

మీ చరిత్ర నా దగ్గర ఉంది

మీ చరిత్ర నా దగ్గర ఉంది

గుంటూరు జిల్లాకు చెందిన ఎంపిలు, ఎంఏల్ఏలు,. మంత్రులతో బాబు సమావేశమైన సందర్భంలో ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలాన్ని రేపుతున్నాయి. మీ చరిత్ర నా దగ్గర ఉంది. ఎవరు ఏమిటో తెలిపే చరిత్ర నా వద్ద ఉందని ప్రజాప్రతినిధులను ఉద్దేశించి బాబు చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనాన్ని కల్గిస్తున్నాయి.చంద్రబాబునాయుడు ఈ సమావేశంలో ఘాటుగానే వ్యాఖ్యలు చేయడంతో పార్టీ నాయకులు ఖంగుతిన్నారు.

కొందరు నేతలపై ప్రత్యక్షంగానే బాబు వార్నింగ్

కొందరు నేతలపై ప్రత్యక్షంగానే బాబు వార్నింగ్

గుంటూరు జిల్లాకు చెందిన కొందరు ఎంఏల్ఏలు చేస్తున్న పనులు, వారి వ్యవహరిస్తున్న తీరు పార్టీకి నష్టం కల్గించేలా ఉందని ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడుడు భావిస్తున్నారు. ఈ మేరకు వారికి నేరుగానే బాబు వార్నింగ్ ఇచ్చాడు.ఎంఏల్ఏ కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులు ఏం చేసినా అది ఎంఏల్ఏకే అంటుకొంటుందని బాబు చెప్పారు.కొందరు ఎంఏల్ఏలు చేయకూడని పనులు చేస్తున్నారని బాబు గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. ఎంఏల్ఏలు, వారి బంధువులు, కుటుంబసభ్యులు ఏమేమీ చేస్తున్నారో తన వద్ద ప్రతి ఒక్కరి చరిత్ర ఉందని బాబు తేల్చి చెప్పారు.

అన్నం సతీష్, మోదుగుల వేణుగోపాల్ రెడ్డిపై బాబు అసంతృప్తి

అన్నం సతీష్, మోదుగుల వేణుగోపాల్ రెడ్డిపై బాబు అసంతృప్తి

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎంఏల్ఏ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి తీరుపై టిడిపి చీఫ్ చంద్రబాబునాయుడు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. పార్టీ నాయకులను అందరినీ కలుపుకొని వెళ్ళాలని బాబు మోదుగుల వేణుగోపాల్ రెడ్డికి సూచించారు. లేకపోతే పార్టీకి నష్టం వాటిల్లుతోందని బాబు చెప్పారు. ఈ మేరకు పనిచేయాలని ఆయన మోదుగులకు సూచించారు.అందరూ ఓట్లు వేస్తేనే గెలిచిన విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆయన సూచించారు.బాపట్లకు చెందిన సతీష్ పై బాబు ఆగ్రహన్ని వ్యక్తం చేశారు.ఎన్నికల్లో ఓటమిపాలైతే ఎంఏల్ సి గా పార్టీ అవకాశం ఇచ్చింది.అయితే ఆ గౌరవాన్ని నిలుపుకోవాలని సతీష్ కు సూచించారు బాబు.సూర్యలంక రిసార్ట్స్ లో టూరిజం ఉద్యోగిపై చేయి చేసుకోవడం, ఎంపిపి పదవి విషయాన్ని తేల్చకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు.

రావెల తీరును తప్పుబట్టిన బాబు

రావెల తీరును తప్పుబట్టిన బాబు

రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు వ్యవహరశైలితో పార్టీకి నష్టం వాటిల్లిన విషయాన్ని బాబు ప్రస్తావించారు. గుంటూరు జిల్లా పరిషత్ చైర్మెన్ జానీమూనం, మంత్రి రావెల కిషోర్ బాబు మద్య చోటుచేసుకొన్న వివాదం పార్టీ పరువు పోయేలా చేసిందని ఆయన చెప్పారు. ఇద్దరూ పార్టీకి కొత్తవారైనా పార్టీ వారిని గౌరవించిన విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆయన సూచించారు.

ముఖాముఖి పార్టీ నేతలతో బాబు సమావేశం

ముఖాముఖి పార్టీ నేతలతో బాబు సమావేశం

గుంటూరు జిల్లాకు చెందిన పార్టీ నాయకులతో చంద్రబాబునాయుడు ముఖాముఖి సమావేశం కానున్నారు. ఈ మేరకు ముఖాముఖి సమావేశం ద్వారా ఆయా నేతల చిట్టాను, వారి ప్రవర్తన తీరును బాబు చెప్పే అవకాశం ఉంది.అంతేకాదు పార్టీకి ఏ రకంగా నష్టం వాటిల్లుతోంది. ఏ రకంగా వ్యవహరించాలనే దానిపై ముఖాముఖి సమావేశంలో ఆయా నాయకులకు బాబు సూచించనున్నారు. ఈ వారం రోజుల్లో ముఖా ముఖి సమావేశానికి పార్టీ నాయకుల నుండి పిలుపు రానుంది. అయితే ఎవరెవరికీ ఈ పిలుపు వస్తోందనే విషయమై పార్టీ నాయకులు ఆందోళన చెందుతున్నారు.

పదిహేను రోజుల్లో సమస్యను పరిష్కరించాలి

పదిహేను రోజుల్లో సమస్యను పరిష్కరించాలి

ఎంపిపి, జిల్లా పరిషత్ చైర్మెన్ , ఇతర పదవుల పంపిణీ విషయంలో చోటుచేసుకొన్న వివాదాలను ఇతర జిల్లాల్లో పరిష్కరించుకొన్నట్గుగానే గుంటూరు జిల్లాల్లో కూడ పరిష్కరించుకోవచ్చనే అభిప్రాయాన్ని ఆయన గుర్తు చేశారు.అయితే ఎందుకు ఇబ్బంది కలుగుతోందని బాబు ప్రశ్నించారు.15 రోజుల్లో సమన్వయ కమిటీని ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించుకోవాలని బాబు గుంటూరు జిల్లా నాయకులకు సూచించారు.నాయకులు పద్దతిని మార్చుకోకపోతే తానే కొత్తవారిని చూసుకొంటానని బాబు హెచ్చరించారు.

English summary
Tdp chief Chandrababu naidu warned to Guntur Party leaders on wednes day. chandrababu naidu ordered to some party leaders change their attitude .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X