ఇక్కడ విజయం సాధించిన పార్టీదే రాష్ట్రంలో అధికారం?

ఈనెల 25వ తేదీన విశాఖపట్నంలో ఉత్తరాంధ్ర ప్రాంత తెలుగుదేశం పార్టీ సదస్సును నిర్వహిస్తున్నారు.

వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడం తెలుగుదేశం పార్టీకి అత్యంత కీలకం. అందుకే పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తన సహజ స్వభావానికి విరుద్ధంగా దూకుడుగా రాజకీయం చేయడంతోపాటు సీనియర్లను కూడా తప్పించేస్తున్నారు. ప్రస్తుతం ఆయన దృష్టి 34 అసెంబ్లీ నియోజకవర్గాలు, 5 ఎంపీ స్థానాలు ఉన్న ఉత్తరాంధ్రపై పడింది. ఈనెల 25వ తేదీన విశాఖపట్నంలో ఉత్తరాంధ్ర ప్రాంత తెలుగుదేశం పార్టీ సదస్సును నిర్వహిస్తున్నారు.

 ఇక్కడ గెలిచిన పార్టీదే అధికారం

ఇక్కడ గెలిచిన పార్టీదే అధికారం

ఉత్తరాంధ్రాలో గెలిచిన పార్టీయే ఇప్పటిదాకా ఏపీలో అధికారం చేపట్టిన సెంటిమెంట్ ఉంది. 2014 ఎన్నికల్లో చంద్రబాబు గెలిచారు అంటే ఉత్తరాంధ్రాలో 25 నియోజకవర్గాలు సాధించడంవల్లే. 2019లో వైసీపీ గెలిచింది అంటే.. ఇక్కడ 28 నియోజకవర్గాలను కైసవం చేసుకొని తెలుగుదేశం పార్టీని 6 స్థానాలకు పరిమితం చేసింది. మార్చి నెలలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం కేంద్రంగా వరుసగా సమావేశాలు నిర్వహిస్తుండటంతోపాటు పలు కార్యక్రమాలను కూడా చేపడుతోంది.

యువతకే ఎక్కువ ప్రాధాన్యం

యువతకే ఎక్కువ ప్రాధాన్యం

గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్ తో పాటు జీ 20 సదస్సులకు విశాఖను వేదికగా చేసింది. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయాన్ని ప్రారంభించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. వీటిని గమనించిన చంద్రబాబు వెంటనే ఉత్తరాంధ్రపై పూర్తిస్థాయిలో దృష్టిసారించారు. ఇక్కడి మూడు ఉమ్మడి జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో పార్టీ సీనియర్ నేతలంతా తమలో తాము కలహించుకుంటూ గ్రూపు రాజకీయాలు నడుపుతున్నారు.

వీరివల్ల పార్టీ బలోపేతం కంటే నష్టమే ఎక్కువ జరుగుతోందని బాబు తెప్పించుకున్న సర్వేలో తేలింది. దీంతో పతివాడ నారాయణస్వామి లాంటివారిని పక్కన పెట్టేశారు. యువతకు ఎక్కువ ప్రాధాన్యం కల్పించాలని నిర్ణయించారు.

వారసులకు ఇవ్వాలంటూ పట్టుబడుతున్న సీనియర్లు

వారసులకు ఇవ్వాలంటూ పట్టుబడుతున్న సీనియర్లు

తమకు టికెట్లు ఇవ్వకపోయినా తమ వారసులకు టికెట్లు ఇవ్వాలంటూ వీరంతా పట్టుబడుతున్నారు. వీరంతా జూనియర్లను, యువతను ఎదగనీయకుండా చేస్తున్నారనే ప్రధాన ఆరోపణ ఉంది. గంటా శ్రీనివాసరావు, చింతకాయల అయ్యన్నపాత్రుడు మధ్య విభేదాలు అలాగే కొనసాగుతున్నాయి. ఇటీవలే గంటాను ఉద్దేశించి అయ్యన్న వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

అలాగే అచ్చెన్నాయుడు, కళావెంకట్రావు వర్గాల మధ్య పోరు నడుస్తోంది. విజయనగరంలో అశోక్ గజపతి రాజుతో ప్రత్యర్థి వర్గానికి పొసగడంలేదు. మొదటి నుంచి పార్టీ కోసం పనిచేయకుండా టికెట్ల టైంలో మాత్రం అధినేత వద్దకు వస్తున్నారని, ఇటువంటివారిని తప్పించాలని రాబిన్ శర్మ బృందం సూచించింది.

కంచుకోటను కాపాడుకోవాలని..

కంచుకోటను కాపాడుకోవాలని..


ఈనెల 25న నిర్వహించే ప్రాంతీయ సదస్సును భారీస్థాయిలో నిర్వహించబోతున్నారు. మూడు జిల్లాల నుంచి వేల సంఖ్యలో పార్టీ ప్రతినిధులు హాజరుకాబోతున్నారు. సదస్సు ద్వారా చంద్రబాబు ఒక సందేశం ఇవ్వనున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

ఉత్తరాంధ్రలో పార్టీకి పనిచేసేవారే రేపటి ఎన్నికల్లో అభ్యర్థులవుతారు అనే ప్రకటన చేయబోతున్నట్లు తెలుస్తోంది. వైసీపీ, జనసేన కూడా ఉత్తరాంధ్రపై దృష్టిసారించిన క్రమంలో పార్టీ ఆవిర్భవం నుంచి టీడీపీకి కంచుకోటగా ఉన్న ఉత్తరాంధ్రను కాపాడుకునేందుకు చంద్రబాబు మరోసారి రంగంలోకి దిగబోతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+