వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'పులివెందుల'పై ఈసికి టిడిపి ఫిర్యాదు, మర్రిపై కోడిగుడ్లు

By Srinivas
|
Google Oneindia TeluguNews

TDP complaints on Kadapa polling
హైదరాబాద్/మహబూబ్ నగర్: కడప జిల్లాలోని పులివెందుల, లింగాల, జమ్మలమడుగు ప్రాంతాల్లో పోలింగ్ ఏకపక్షంగా సాగుతుందని తెలుగుదేశం పార్టీ నాయకులు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్, కడప ఎంపి అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డి సోమవారం ఈసిన కలిశారు.

ప్రతి ఎన్నికలలోను ఒకే పార్టీకి 75 నుండి 95 శాతం పోలింగ్ నమోదవుతుందని, ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరపాలని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతపురం జిల్లా ఎస్పీ పైనా వారు ఫిర్యాదు చేశారు. అనంతపురం జిల్లా ఎస్పీ ఒక పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

తెరాస అభ్యర్థిపై కోడిగుడ్లు

మహబూబ్ నగర్ తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి మర్రి జనార్థన్ రెడ్డి కాన్వాయ్ పైన గద్వాల మండలం గాజులపల్లిలో సమీపంలో కోడిగుడ్లతో దాడి చేశారు. ఎన్నికల ప్రచారానికి వెళ్తున్న జనార్థన్ రెడ్డి కాన్వాయ్‌పై కాంగ్రెస్ కార్యకర్తలు గుడ్లతో దాడి చేశారు. దీంతో తెరాస కార్యకర్తలు తమ చేతులకు పని చెప్పారు.

రెండు పార్టీల కార్యకర్తలు ఘర్షణ పడ్డారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పోలీసులు రంగప్రవేశం చేసి స్వల్ప లాఠీఛార్జ్ చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఈ ఘటనలో పలువురు కార్యకర్తలు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

English summary
Telugudesam Party complained on Kadapa polling.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X