కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రంగంలోకి కెఈ: సోదరుడికి టిక్కెట్టు కోసమిలా, అభ్యర్ధి లేకుండానే టిడిపి ప్రచారం

By Narsimha
|
Google Oneindia TeluguNews

కర్నూల్: కర్నూల్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థిని ఇంతవరకు టిడిపి నిర్ణయించలేదు. పోటీ కోసం అభ్యర్థుల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. ఎమ్మెల్సీ అభ్యర్థిని ఎంపిక చేసుకొనేందుకు నేతలంతా ఏకాభిప్రాయానికి రావాలని చంద్రబాబునాయుడు సూచించారు. డిసెంబర్ 23న, మరోసారి కర్నూల్ నేతలు చంద్రబాబుతో సమావేశం కానున్నారు. మరో వైపు అభ్యర్థి ఎవరో తేలకుండానే టిడిపి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టింది.

కర్నూల్ నేతలకు బాబు షాక్: ఓట్లు తగ్గితే చర్యలు, 23న ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపిక కర్నూల్ నేతలకు బాబు షాక్: ఓట్లు తగ్గితే చర్యలు, 23న ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపిక

కర్నూల్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు 2018 జనవరి 12వ, తేదిన జరగనున్నాయి. నంద్యాల ఉప ఎన్నికల సమయంలో టిడిపి నుండి వైసీపీలో చేరిన శిల్పా చక్రపాణిరెడ్డి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దీంతో ఈ ఎన్నిక అనివార్యంగా మారింది.

టిడిపి, వైసీపీలు ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకొన్నాయి. ఈ ఎన్నికల్లో విజయం సాధించాలనే ఉద్దేశ్యంతో రెండు పార్టీలు సర్వ శక్తులను ఒడ్డనున్నాయి. అయితే టిడిపిలో ఎక్కువ మంది పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నందున ఏకాభిప్రాయం సాధించడం కత్తి మీద సాముగా మారింది.

ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రకటించకుండానే టిడిపి ప్రచారం

ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రకటించకుండానే టిడిపి ప్రచారం

కర్నూల్ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థిని ఇంకా నిర్ణయించలేదు. డిసెంబర్ 23వ, తేదిన అభ్యర్థిని నిర్ణయించే అవకాశం ఉంది. అయితే అప్పటివరకు నేతలంతా ఆ సమావేశానికి ఏకాభిప్రాయంతో రావాలని చంద్రబాబునాయుడు సూచించారు. అయితే అభ్యర్థి ఎంపికకు ఇంకా సమయం పట్టే అవకాశం ఉన్నందున ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాలని టిడిపి నిర్ణయం తీసుకొంది. టిడిపికి చెందిన ప్రజాప్రతినిధులతో డిసెంబర్ 20వ, తేది నుండి నియోజకవర్గాల వారీగా సమావేశాలను నిర్వహించనుంది.ఆదోని, ఆలూరు నియోజకవర్గాలకు చెందిన టిడిపి ప్రజా ప్రతినిధులతో టిడిపి జిల్లా నేతలు సమావేశం కానున్నారు.

అభ్యర్థిత్వం కోసం తీవ్రంగా పోటీ

అభ్యర్థిత్వం కోసం తీవ్రంగా పోటీ


కర్నూల్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టిడిపి నేతలు తీవ్రంగా పోటీ పడుతున్నారు. ఆరు మందికిపైగా తీవ్రంగా పోటీ పడుతున్నారు. మాజీ ఎమ్మెల్యే చల్లా రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రి కె.ఈ ప్రభాకర్‌ల మధ్య తీవ్రమైన పోటీ నెలకొందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. వీరితో పాటుగా మాండ్ర శివానందరెడ్డి, నంద్యాలకు చెందిన సజ్జల శ్రీధర్‌రెడ్డి, కర్నూలుకు చెందిన డి.వెంకటేశ్వరరెడ్డి, విష్ణువర్దన్‌రెడ్డి పేర్లు కూడ విన్పిస్తున్నాయి.

కె.ఈ ప్రభాకర్ కోసం డిప్యూటీ సీఎం కృష్ణమూర్తి ప్రయత్నాలు

కె.ఈ ప్రభాకర్ కోసం డిప్యూటీ సీఎం కృష్ణమూర్తి ప్రయత్నాలు

కర్నూల్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కె.ఈ ప్రభాకర్ బరిలోకి దిగేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే కెఈ ప్రభాకర్‌కు మద్దతుగా డిప్యూటీ సీఎం కెఈ కృష్ణమూర్తి జిల్లా పార్టీ నేతల మధ్య ఏకాభిప్రాయం సాధించేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రచారం సాగుతోంది.నంద్యాల పార్లమెంట్‌ సెగ్మెంట్‌ పరిధిలో ఎమ్మెల్యేల కోటా కింద మైనార్టీ నాయకుడు ఎన్‌ఎండీ ఫరూక్‌ను ఎమ్మెల్సీ చేసి శాసనమండలి చైర్మన్‌ను చేయడంతో ఈసారి కర్నూలు పార్లమెంట్‌ సెగ్మెంట్‌లో బీసీ కోటా కింద కేఈ ప్రభాకర్‌కు అవకాశం ఇవ్వాలని కేఈ సోదరులు బలంగా ప్రయత్నాలు సాగిస్తున్నారు.

ఏకాభిప్రాయానికి మంత్రి కాలువ ప్రయత్నాలు

ఏకాభిప్రాయానికి మంత్రి కాలువ ప్రయత్నాలు

కర్నూల్ జిల్లా ఇంచార్జీ మంత్రి కాలువ శ్రీనివాసులు టిడిపి నేతల మధ్య సమన్వయం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. వారం రోజుల క్రితం జరిగిన పార్టీ నేతల సమావేశంలో విడి విడిగా కాలువ శ్రీనివాసులు, టిడిపి ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు అభిప్రాయాలను సేకరించారు.ఈ అభిప్రాయాలను చంద్రబాబునాయుడుకు అందించారు. అదే రోజు మంత్రివర్గ సమావేశం తర్వాత చంద్రబాబునాయుడు పార్టీ నేతలతో సమావేశమయ్యారు. కానీ, అభ్యర్థి ఎంపిక విషయంలో ఏకాభిప్రాయం రాకపోవడంతో ఆ బాధ్యతను జిల్లా ఇంచార్జీ మంత్రి కాలువ శ్రీనివాసులకు అప్పగించారు.

English summary
Tdp is conducting assembly segments wise elected representatives meeting from dec 20 for local body MLC elections. Kurnool local body elections will conduct on Jan 12 2018.Tdp not yet finalized candidate for MLC elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X