ఆ ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలకు టీడీపీలో సీట్లు ఖరారు ? రాజ్యసభ పోరు కాగానే !
ఏపీలో అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే రాజ్యసభ ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. త్వరలో జరిగే రాజ్యసభ ఎన్నికలకు ఇవాళ నోటిఫికేషన్ కూడా వెలువడనుంది. ఇప్పటికే అధికార వైసీపీలో చేపట్టిన ఇన్ ఛార్జ్ ల మార్పుల నేపథ్యంలో కొందరు, అలాగే పార్టీలో అసంతృప్తితో మరికొందరు ఎమ్మెల్యేలు పార్టీని వీడేందుకు సిద్దమయ్యారు. అయితే రాజ్యసభ ఎన్నికలు వీరి దూకుడుకు బ్రేక్ వేశాయి. దీంతో తెరవెనుక ఓ ముగ్గురు ఎమ్మెల్యేలు తమ ప్లాన్ సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఉమ్మడి కృష్ణాజిల్లాలో గత ఎన్నికల్లో వైసీపీ తరఫున గెలిచిన ముగ్గురు ఎమ్మెల్యేలు కొలుసు పార్ధసారధి (పెనమలూరు), కొక్కిలిగడ్డ రక్షణనిధి (తిరువూరు), వసంత కృష్ణప్రసాద్ (మైలవరం) లకు ఈసారి వైసీపీ టికెట్లు నిరాకరించింది. వీరిలో పార్ధసారధిని గ్రాఫ్ బాగోలేదన్న పేరుతో పక్కనబెట్టగా.. రక్షణనిధికి ఈ మధ్యలో పార్టీలో చేరిన బెజవాడ ఎంపీ కేశినేని నాని అనుచరుడు నల్లగట్ల స్వామిదాస్ కారణంగా టికెట్ నిరాకరించారు. అలాగే చంద్రబాబు, లోకేష్ పై దూకుడుగా విమర్శలు చేయడం లేదనే కారణంతో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ను కూడా పక్కనబెట్టేశారు.

దీంతో ఈ ముగ్గురు ఇప్పుడు టీడీపీలో టచ్ లోకి వెళ్లిపోయారు. ఇప్పటికే టీడీపీ అధిష్టానం దూతలతో జరిపిన చర్చలు కూడా విజయవంతం కావడంతో పార్టీ మారడం ఒక్కటే మిగిలుంది. అయితే రాజ్యసభ ఎన్నికలకు ముందే పార్టీ మారితే అనర్హత వేటు పడే అవకాశం ఉండటంతో వీరంతా సైలెంట్ గా కనిపిస్తున్నారు. రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ ఇలాంటి వైసీపీ అసంతృప్త ఎమ్మెల్యేలను నమ్ముకునే అభ్యర్ధిని కూడా నిలబెడుతోంది.
మరోవైపు త్వరలో టీడీపీలో చేరబోతున్న ఈ ముగ్గురు వైసీపీ అసంతృప్త ఎమ్మెల్యేలకు టికెట్లు ఖరారైనట్లు సమాచారం. వీరిలో వసంత కృష్ణప్రసాద్ కు ప్రస్తుతం పార్ధసారధి ప్రాతినిధ్యం వహిస్తున్న పెనమలూరు సీటు ఖరారైనట్లు తెలుస్తోంది. దీంతో ఆయన స్ధానికంగా టీడీపీ నేతలతో భేటీలు అవుతున్నారు. అలాగే పెనమలూరు ఎమ్మెల్యే పార్ధసారధికి నూజివీడు టికెట్ ఖరారు చేశారు. మరోవైపు తిరువూరు ఎమ్మెల్యే రక్షణనిధికి అదే స్ధానంలో పోటీ చేసేందుకు టీడీపీ టికెట్లు ఖరారు చేయబోతున్నట్లు తెలుస్తోంది.
-
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!!












Click it and Unblock the Notifications