టీడీపీ కార్పొరేటర్ల పక్క చూపులు .. రెండు నెలల్లో విశాఖలో టీడీపీ ఖాళీ వ్యాఖ్యల మతలబు అదేనా !!
విశాఖపట్నంలో కార్పొరేషన్ ఎన్నికలు ముగిసిన తర్వాత అసలు రాజకీయం మొదలైంది. విశాఖ పై పట్టు కొనసాగించడానికి వైసిపి శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో తాజాగా టిడిపి కార్పొరేటర్లు వైసీపీ ఎమ్మెల్యే ని కలవడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. విశాఖలో రెండు నెలల్లో టిడిపి లేకుండా చేస్తామని వైసీపీ కీలక నేత ప్రకటించడం వెనుక టిడిపిని ఖాళీ చేయాలనే ఆలోచన ఉందన్న చర్చ స్థానికంగా హాట్ టాపిక్ గా మారింది.

గ్రేటర్ విశాఖలో ఎన్నికల తర్వాత మారుతున్న రాజకీయం
గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ముగిసాయి.ఈ ఎన్నికల్లో విజయం సాధించడం కోసం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్ళింది. ఎంపీ విజయసాయిరెడ్డి గ్రేటర్ విశాఖలో వైసీపీ జెండా ఎగరవేయడానికి సాయశక్తులా కృషి చేశారు. ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు. ఇదే సమయంలో మంత్రి అవంతి శ్రీనివాస్, కన్న బాబు తదితరులు కూడా ఎన్నికల పై ఫోకస్ పెట్టి పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. గ్రేటర్ విశాఖలో అధికార వైసిపి కల నెరవేరింది .

టీడీపీ మరో రెండు నెలల్లో విశాఖలో లేకుండా చేస్తామన్న ఎంపీ సాయి రెడ్డి
98 డివిజన్లు కలిగిన కార్పొరేషన్లో వైసిపి 58 డివిజన్ లను గెలుచుకున్నప్పటికీ పాలకమండలిలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ బలంగా ఉండటం ఏమాత్రం జీర్ణించుకోలేక పోతోంది. అందుకే గ్రేటర్ విశాఖలో కొత్త సమీకరణాలు తెరమీదకు వచ్చాయి . ఈ క్రమంలోని ఎంపీ విజయసాయిరెడ్డి తెలుగుదేశం పార్టీకి అంతిమ ఘడియలు ప్రారంభమయ్యాయని , 2024లో తెలుగుదేశం పార్టీ అనేది ఉండదని , మరో రెండు నెలల కాలంలో జీవీఎంసీ లో టిడిపి లేకుండా చేస్తామని వ్యాఖ్యలు చేశారు.

గాజువాక వైసీపీ ఎమ్మెల్యేను కలిసిన టీడీపీ కార్పొరేటర్లు .. చంద్రబాబుకు షాక్ ,
ఆయన వ్యాఖ్యానించిన 24 గంటల లోపే పొలిటికల్ వైబ్రేషన్స్ మొదలయ్యాయి . గాజువాక అసెంబ్లీ పరిధిలో టీడీపీ కార్పొరేటర్లు ఎమ్మెల్యే గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డిని కలవటం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఇక టీడీపీ హైకమాండ్ ఎమ్మెల్యేను కలవడానికి కారణం చెప్పాలని షోకాజ్ నోటీసులు జారీ చేయగా, అధికార వైసీపీ మాత్రం తెలుగుదేశం పార్టీని ఖాళీ చేసే వ్యూహంతో ముందుకు వెళుతుందని తాజా పరిణామాలతో అర్థమవుతుంది.

ఇదిలా ఉంటే ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి తో భేటీ పై టిడిపి కార్పొరేటర్లు వివరణ ఇచ్చారు.
షోకాజ్ నోటీసులకు వివరణ ఇచ్చిన కార్పొరేటర్లు .. అయినా అనుమానమే !!
తాము అభివృద్ధికి సహకరించాలని ఎమ్మెల్యే నాగిరెడ్డిని కోరామని, అందుకోసమే ఆయనను కలిశామని టిడిపి కార్పొరేటర్లు చెబుతున్నారు. అంతకుమించి తమకు వేరే ఆలోచన ఏదీ లేదన్నారు.ఎమ్మెల్యే నాగిరెడ్డి భేటి పై దుష్ప్రచారం చేస్తున్నారని వారంటున్నారు . ఏది ఏమైనా టిడిపి కార్పొరేటర్ల వైసీపీ ఎమ్మెల్యే ని కలవడం, రెండు నెలల్లో విశాఖలో టిడిపి లేకుండా చేస్తామని విజయ సాయి రెడ్డి పేర్కొనడం వెనుక వైసిపి ఆపరేషన్ ఆకర్ష్ ఉన్నట్లుగా చర్చ జరుగుతుంది.
అందులో భాగంగానే టీడీపీ కార్పొరేటర్లు కొందరు పక్క చూపులు చూస్తున్నారని సమాచారం .
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!!











Click it and Unblock the Notifications