Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

టీడీపీ విమర్శల మధ్య ... కరోనా టైంలో ... నేడు వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకం ప్రారంభం

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కరోనా కష్టకాలంలో, ఒక పక్క ప్రతిపక్ష టీడీపీ విమర్శల మధ్య నేడు పొదుపు సంఘాల మహిళలకు జీరో వడ్డీ పథకాన్ని అందించనున్నారు . ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీవ్రమైన ఆర్ధిక కష్టాలలో ఉన్నప్పటికీ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం సాహసోపేతమైన నిర్ణయం అని వైసీపీ శ్రేణులు అంటుంటే , ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలు విడిచి పెట్టి కేవలం ఎన్నికల స్టంట్ గా ఇలాంటి స్కీమ్ లు అందిస్తున్నారని మండిపడుతున్నారు టీడీపీ నేతలు .

 రుణాలపై వడ్డీ భారం ప్రభుత్వానిదేనని పొదుపు సంఘాలకు సీఎం జగన్ లేఖ

రుణాలపై వడ్డీ భారం ప్రభుత్వానిదేనని పొదుపు సంఘాలకు సీఎం జగన్ లేఖ

ఒక పక్క కరోనాతో రాష్ట్రం సతమతమవుతున్న వేళ సంక్షేమ పథకాలఅమలులో మాత్రం సీఎం జగన్ తన మార్కు చూపిస్తున్నారు . ఇక ఈ క్రమంలోనే వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకాన్ని నేడు సీఎం జగన్‌ లాంఛనంగా ప్రారంభించనున్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో పొదుపు సంఘాల అక్క చెల్లమ్మల ఖాతాలకు సున్నా వడ్డీ డబ్బులను జమ చేసే బటన్‌ను నొక్కి ఆయన ఈ పథకాన్నిప్రారంభిస్తున్నారు. ఇప్పటికే మీ రుణాలపై వడ్డీ భారం ప్రభుత్వానిదేనని పొదుపు సంఘాలకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి లేఖ రాశారు.

 సీఎం క్యాంపు కార్యాలయంలో జీరో వడ్డీ పథకాన్ని ప్రారంభించనున్న సీఎం జగన్

సీఎం క్యాంపు కార్యాలయంలో జీరో వడ్డీ పథకాన్ని ప్రారంభించనున్న సీఎం జగన్

ఇక నేడు ఆ భారాన్ని ప్రభుత్వం తనపై వేసుకునేందుకు ముహూర్తంగా నిర్ణయించారు . కష్ట కాలంలోనూ సంక్షేమ పథకాల అమలులో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం వెనకడుగు వెయ్యకుండా ముందు సాగుతుంది . పొదుపు సంఘాల మహిళలకు మేలు చేకూర్చటమే లక్ష్యంగా సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం తో నేడు వడ్డీ డబ్బుల జమకు సంబంధించిన బటన్ ను క్యాంపు కార్యాలయంలో నొక్కనున్నారు. ఇక బటన్ నొక్కగానే సెర్ప్, మెప్మాల పరిధిలోని గ్రామ, పట్టణ ప్రాంతాల్లో ఉండే 8,78,874 పొదుపు సంఘాల ఖాతాల్లో సీఎఫ్‌ఎంఎస్‌ ద్వారా ఒకే సారి డబ్బులు జమ అవుతాయని సెర్ప్‌ సీఈవో రాజాబాబు తెలిపారు.

Recommended Video

    Fake News Buster EP 13 : లాక్ డౌన్ పొడిగించమని ప్రభుత్వానికి టాస్క్ ఫోర్స్ సూచన..! ఇది నిజామా ?
     పొదుపు సంఘాల మహిళలకు .1,400 కోట్ల మేర లబ్ధి

    పొదుపు సంఘాల మహిళలకు .1,400 కోట్ల మేర లబ్ధి

    ఒకపక్క రాష్ట్రంలో నెలకొన్న కరోనా మహమ్మారి విపత్తు, మరో పక్క ప్రతిపక్ష పార్టీల విమర్శలు , ఇంకోపక్క ఆర్ధికఇబ్బందులు ఎన్ని ఉన్నా సరే సీఎం జగన్ మాత్రం జీరో వడ్డీ పథకాన్ని నేడు పునఃప్రారంభించి పొదుపు సంఘాల మహిళలకు రూ.1,400 కోట్ల మేర లబ్ధి చేకూర్చనున్నారు . రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో 6.95 లక్షల సంఘాలకు వడ్డీ లేని రుణాల క్రింద రూ.975 కోట్ల సాయం అందనుంది. ఇక పట్టణ ప్రాంతాల్లోని పొదుపు సంఘాలకు 1.83 లక్షల సంఘాలకు వడ్డీ లేకుండా రూ.425 కోట్ల చొప్పున లబ్ధి చేకూరుతుంది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+