పేదలను కాపాడటానికే అప్పులు, టీడీపీ వల్లే ఏపీ విశ్వసనీయతకు దెబ్బ : మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బుగ్గన రాజేంద్రనాథ్ కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ ఉన్న నిధులు, కేటాయింపులు తదితర అంశాలపై చర్చించారు. ఆ తరువాత మీడియాతో మాట్లాడిన బుగ్గన రాజేంద్రనాథ్ అనరాక్ కంపెనీ అంతర్జాతీయ న్యాయస్థానంలో ఉన్న ఆర్బిట్రేషన్ కేసుపై చర్చించినట్లుగా బుగ్గన రాజేంద్రనాథ్ వెల్లడించారు. ఈ కేసుపైన మాట్లాడటమే కాకుండా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మాట్లాడిన ఆయన తెలుగుదేశం పార్టీ వల్లే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్షీణించింది అంటూ టీడీపీని టార్గెట్ చేశారు.

అనరాక్ సంస్థపై కేంద్రమంత్రితో చర్చించిన బుగ్గన అనేక అంశాలు వెల్లడి
అనరాక్ కంపెనీ అంశంపై నిర్మల సీతారామన్ తో చర్చించినట్లుగా వెల్లడించిన ఆయన, ఆ సంస్థకు అవసరమైన బాక్సైట్ సరఫరా చేసేలా ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు . ఇక ఈ కేసు న్యాయపరంగా పరిష్కారమైతే రాష్ట్రానికి పెద్ద కంపెనీ వస్తుందని బుగ్గన రాజేంద్రనాథ్ చెప్పారు. అంతేకాదు 2008లో అప్పటి ప్రభుత్వం అనరాక్ కు బాక్సైట్ సరఫరా చేయలేక పోయిందని వెల్లడించారు. ఐఐఎఫ్టి, ఐఐపీ ఏర్పాటుకు రాష్ట్రంలో ఇప్పటికే స్థలాన్ని కూడా కేటాయించిందని బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ సంస్థలు ఏర్పాటు గురించి కూడా కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ తో చర్చించానని ఆయన వెల్లడించారు.

ఏపీ అప్పులపాలు అయిందని టీడీపీ దుష్ప్రచారంపై మండిపడిన బుగ్గన
ఇక విద్యాసంస్థలు, నైపుణ్యాభివృద్ధి సంస్థలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వీలైనంత ఎక్కువగా ఉండాలన్నది సీఎం జగన్మోహన్ రెడ్డి ఉద్దేశమని బుగ్గన రాజేంద్రనాథ్ స్పష్టం చేశారు. ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేశారు బుగ్గన రాజేంద్రనాథ్ . ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పులపాలై పోయిందంటూ తెలుగుదేశం పార్టీ అనవసరపు రాద్ధాంతం చేస్తుందని బుగ్గన రాజేంద్రనాథ్ మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై టిడిపి నేతలు చేస్తున్న విమర్శలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

కరోనా కష్ట కాలంలో పేదలను కాపాడటం కోసమే అప్పులు
కరోనా కష్టకాలంలో పేదలను కాపాడడం కోసం అప్పులు తీసుకువచ్చామని బుగ్గన రాజేంద్రనాథ్ వెల్లడించారు. కానీ టిడిపి తన రాజకీయ లబ్దికోసం ప్రస్తుత ప్రభుత్వంపై అనవసరపు దుష్ప్రచారం చేస్తోందని పేర్కొన్నారు. టిడిపి పాలనా సమయంలో కరోనా మహమ్మారి లేనప్పటికీ, పుట్టెడు అప్పులు చేశారని బుగ్గన రాజేంద్రనాథ్ దుయ్యబట్టారు. ఇప్పుడు కరోనా మహమ్మారి కారణంగా రాష్ట్ర ఆదాయం గణనీయంగా పడిపోయిందని వెల్లడించారు బుగ్గన. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను చక్కదిద్దడం కోసమే అప్పులు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. కరోనా మహమ్మారి పంజా విసిరిన కష్ట కాలంలోనూ ప్రజా సంక్షేమాన్ని ఏపీ ప్రభుత్వం విడనాడ లేదని స్పష్టం చేశారు.

ఏపీ విశ్వసనీయత దెబ్బ తినేలా టీడీపీ తీరు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వసనీయత దెబ్బతినేలా తెలుగుదేశం పార్టీ ప్రవర్తిస్తోందని బుగ్గన మండిపడ్డారు. టిడిపి ప్రవర్తన కారణంగానే మొత్తం రాష్ట్రానికి నష్టం కలుగుతుందని ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేసే అప్పులపై టిడిపి అనవసర రాద్ధాంతం అని నిప్పులు చెరిగారు. అప్పులపై టీడీపీ నేతలు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తమ రాజకీయ లబ్ధి కోసం రాష్ట్రం నాశనమై పోయినా పర్వాలేదు అనే తరహాలో టిడిపి ఆలోచిస్తోందని మంత్రి బుగ్గన అసహనం వ్యక్తం చేశారు. టిడిపి దుర్మార్గానికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని బుగ్గన రాజేంద్రనాథ్ హెచ్చరించారు.
Recommended Video
-
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!!












Click it and Unblock the Notifications