వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

APSRTC బస్సుపై టార్పలిన్ కవర్-జగన్ సర్కార్ పై టీడీపీ ట్వీట్- ఆర్టీసీ ఫైర్ తో డిలీట్-అంతా ఫేక్

|
Google Oneindia TeluguNews

ఏపీలో వైసీపీ వర్సెస్ టీడీపీ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. వైసీపీ సర్కార్ తప్పిదాల్ని కనిపెట్టి వాటిని ప్రజల్లోకి విస్తృతంగా ప్రచారం చేసేందుకు అందివచ్చిన ప్రతీ అవకాశాన్నీ సద్వినియోగం చేసుకోవాలని టీడీపీ భావిస్తోంది. తద్వారా వైసీపీని బదనానం చేసి తామే ప్రత్యామ్నాయమని నిరూపించుకునే ప్రయత్నం చేస్తోంది. అయితే ఇందులో ఒక్కోసారి తప్పటడుగులు పడుతున్నట్లు తెలుస్తోంది. లేదా టీడీపీని బదనాం చేసేందుకు ఇలాంటి ట్వీట్లు వెలుస్తున్నట్లు అర్ధమవుతోంది. తాజాగా ఇలాంటిదే ఓ ఘటన చోటు చేసుకుంది.

ఆర్టీసీ బస్సుపై టార్పలిన్ కవర్

ఆర్టీసీ బస్సుపై టార్పలిన్ కవర్

ఏపీలో ఓ ఆర్టీసీ బస్సుపై టార్పలిన్ కవర్ కప్పి ఉంచిన ఫొటోలు ఈ మధ్య వైరల్ అయ్యాయి. రోడ్డుపై ప్రయాణిస్తున్న బస్సుపై టార్పలిన్ కవర్ కప్పాల్సిన అవసరమేమొచ్చిందనే ప్రశ్నలూ తలెత్తాయి. ఆర్టీసీ బస్సులో ప్రయాణికులు ఉండగా టార్పలిన్ కవర్ ఎందుకు కప్పారనే అనుమానాలూ వ్యక్తమయ్యాయి.

దీంతో సదరు బస్సులో ప్రయాణికులు కాకుండా ఇంకేదో ఉందనే ప్రచారం జరిగింది. ఇదే అదనుగా విపక్ష టీడీపీ దీన్ని అందిపుచ్చుకునే ప్రయత్నం చేసింది. ఆర్టీసీ బస్సుపై టార్పలిన్ కప్పి ఏదో రవాణా చేస్తున్నారనే అర్ధం వచ్చేలా ట్వీట్ చేసింది.

 టీడీపీ ట్వీట్ పై ఆర్టీసీ సీరియస్

టీడీపీ ట్వీట్ పై ఆర్టీసీ సీరియస్

ఆర్టీసీ బస్సుపై టార్పలిన్ కప్పి ఉంచినట్లు టీడీపీ సోషల్ మీడియాలో పెట్టిన ట్వీట్ పై ఆర్టీసీ భగ్గుమంది. బస్సులో స్కూలు పిల్లల కోసం పుస్తకాలు తరలిస్తుంటే మీరు ఇలా దుష్ప్రచారం చేయడమేంటని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు ట్వీట్ తోనే కౌంటర్ ఇచ్చింది. ఆ బస్సులో ప్రయాణికులు లేరని, బస్సులో లీకులు కూడా లేవని క్లారిటీ ఇచ్చింది. విద్యాశాఖ ఆదేశాలతో పుస్తకాలను మాత్రమే అందులో తరలిస్తున్నామని, వర్షాలు కురుస్తున్నందున టార్పలిన్ కప్పాల్సి వచ్చిందని వెల్లడించింది.

 ట్వీట్ డిలీట్ చేసిన టీడీపీ ?

ట్వీట్ డిలీట్ చేసిన టీడీపీ ?

అయితే ఆర్టీసీ ఆగ్రహంతో టీడీపీ సదరు ట్వీట్ ను డిలీట్ చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు విద్యార్దుల పుస్తకాలపై శ్రద్ధ వహించినందుకు ఆర్టీసీకి అభినందలు అని తెలిపింది. ఎందుకు పట్టాలు కప్పాల్సి వచ్చిందనే విషయం తెలియజేసినందుకు ధన్యవాదాలు చెప్పింది. పోస్టు డిలీట్ చేయడం జరుగుతుంది. మీరు కోరిన విధంగా అని వెల్లడించింది. చివర్లో పొరబాట్లు సహజమని కూడా తెలిపింది. దీంతో ఈ వ్యవహారం ఇప్పుడు సోషల్ మిడియాలో వైరల్ అవుతోంది.

మొత్తం వివాదమే ఫేక్ ?

మొత్తం వివాదమే ఫేక్ ?

అయితే ఈ మొత్తం వ్యవహారంలో మరో ట్విస్ట్ కనిపిస్తోంది. టీడీపీ చేసినట్లుగా చెబుతున్నట్లుగా చెబుతున్న సదరు ట్వీట్ Telugu Desam Political Wing అనే పేరుతో కనిపిస్తోంది. కానీ వాస్తవంగా టీడీపీ పొలిటికల్ వింగ్ ట్విట్టర్ హ్యాండిల్ మాత్రం TeluguDesamPoliticalWingTDPoliticalWING పేరుతో ఉంది. అలాగే ఆర్టీసీ ట్విట్టర్ హ్యాండిల్ లో ఆర్టీసీ బస్సు గురించి కానీ కవర్ గురించి కానీ ఎలాంటి ట్వీట్లూ కనిపించడం లేదు. దీంతో ఈ మొత్తం వ్యవహారం ఫేక్ అని అర్ధమవుతోంది. వైసీపీ, టీడీపీ మధ్య సాగుతున్న పొలిటికల్ వార్ లో భాగంగా కొందరు ఈ ఫేక్ ట్వీట్లను ప్రచారం చేస్తున్నట్లు తెలుస్తోంది.

English summary
tdp has deleted the fake tweet on apsrtc bus covering with tarpauline cover after apsrtc anger.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X