• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

తిరుమల వెంకన్న సాక్షిగా టిడిపి ధర్మ పోరాట దీక్ష...ఎన్నికల శంఖారావమా?

By Suvarnaraju
|

తిరుపతి: ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తానంటూ నరేంద్ర మోడీ మోసం చేశారంటూ టిడిపి తిరుపతి వేదికగా సోమవారం ధర్మదీక్ష నిర్వహిస్తోంది. గత ఎన్నికల సమయంలో తిరుమల వెంకన్న సాక్షిగా హోదా ఇస్తామని హామీ ఇచ్చి వంచన చేసిన నరేంద్ర మోదీ, బీజేపీలపై తమ పోరాటాన్ని టీడీపీ మరింత ఉధృతం చేసింది.

  ‘ధర్మ పోరాట దీక్ష’ను ప్రారంభించిన బాబు...కేంద్రం పై నిరసన!

  ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ పర్యటనకు విచ్చేసిన నరేంద్రమోడీ 2014 ఏప్రిల్‌ 30వ తేదీన శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం ప్రాంగణంలోని తారకరామా స్టేడియంలో మోదీ ప్రత్యేక హోదా ఇస్తామని, రాష్ట్ర విభజన చట్టంలోని అంశాలన్నీ అమలు చేస్తామని హామీ ఇచ్చారు. అయితే మోడీ ప్రధాని అయ్యాక వాటిని నెరవేర్చకుండా మోసగించారని టిడిపి కేంద్రంతో తెలగతెంపులు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నరేంద్ర మోడీ రాష్ట్రానికి చేసిన అన్యాయం గురించి ఇదే ఏప్రిల్‌ 30న అదే వేదిక నుంచి ప్రజలకు తెలియజెప్పే విధంగా టిడిపి భారీ స్థాయిలో ధర్మపోరాట బహిరంగ సభ నిర్వహిస్తోంది.

  ధర్మపోరాట దీక్ష...నినాదం ఇదే

  ధర్మపోరాట దీక్ష...నినాదం ఇదే

  "నమ్మక ద్రోహం-కుట్ర రాజకీయాలపై ధర్మ పోరాటం" అనే నినాదంతో టిడిపి తిరుపతి వేదికగా ధర్మదీక్ష సభను నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర ప్రభుత్వం మోసంపై గళమెత్తనున్నారు. ఈ సభకు రాష్ట్రంలోని టిడిపి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలందరూ, ఇతర ముఖ్య నేతలందరూ హాజరుకానున్నారు. మొత్తం మీద సుమారు లక్షన్నర వరకు జనం ఈ సభకు హాజరవుతారని అంచనా వేస్తున్నారు.

  టిడిపి...ఎన్నికల ప్రచారానికి నాంది

  టిడిపి...ఎన్నికల ప్రచారానికి నాంది

  కేంద్ర ప్రభుత్వంపై తెదేపా చేస్తున్న రాజీలేని పోరాటాన్ని ప్రజలకు తెలియజేయడంతోపాటు ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన వాగ్దానాలను ఏ విధంగా పక్కన పెట్టారన్నది ఈ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో సహా టిడిపి ముఖ్య నేతలు వివరించనున్నారు. సార్వత్రిక ఎన్నికలకు ఏడాది సమయం మాత్రమే ఉండటం, తిరుపతి నుంచే తెదేపా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించే సంప్రదాయం కలిగి ఉండటాన్ని బట్టి ఇది టిడిపి ఎన్నికల ప్రచారానికి నాందిగానే రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

  చంద్రబాబు...తొలిసారి బహిరంగ సభ

  చంద్రబాబు...తొలిసారి బహిరంగ సభ

  గడచిన నాలుగేళ్లుగా ప్రభుత్వపరంగా నిర్వహిస్తున్న సభల్లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొంటూ వచ్చే తప్ప ఏ సభ ను బహిరంగ సభగా టిడిపి పేర్కొనలేదు. అలాగే గతంలో నవ నిర్మాణ దీక్ష, అలాగే ఇటీవలే ధర్మ పోరాట దీక్ష నిర్వహించినా, ఆసందర్భంలో నిర్వహించిన సభలను టిడిపి బహిరంగ సభలుగా ప్రస్తావించలేదు. ఈ నేపథ్యంలో టిడిపి తిరుపతిలో నిర్వహిస్తున్న ఈ ధర్మ దీక్ష సందర్భంగా భారీ బహిరంగసభ ఏర్పాటు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

  ఇకపై టిడిపి...వరుస సభలు

  ఇకపై టిడిపి...వరుస సభలు

  మరోవైపు టిడిపి ఆవిర్భావం నుంచి ఆ పార్టీ చేపట్టే అన్ని కార్యక్రమాలను తిరుపతి నుంచే శ్రీకారం చుట్టడం ఆనవాయితీగా వస్తోంది. ఆ క్రమంలో కేంద్రంపై పోరాటానికి తిరుపతినే వేదికగా ఎంచుకున్నారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ సభ తర్వాత రాష్ట్రంలోని మిగతా 12 జిల్లాల్లోనూ సభలు నిర్వహించే యోచనలో పార్టీ ఉందని సమాచారం. ఇది ఓ రకంగా రానున్న ఎన్నికలకు శంఖారావంగా విశ్లేషిస్తున్నారు. ఈ సభను విజయవంతం చేసేందుకు చిత్తూరు జిల్లా శ్రేణులతో పాటు పార్టీ అధినాయకత్వం కృషి చేస్తోంది.

  చంద్రబాబు...పర్యటన...ఇలా...

  చంద్రబాబు...పర్యటన...ఇలా...

  ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం మధ్యాహ్నం సమయానికి తిరుపతి విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా తిరుమలకు వెళ్లి స్వామివారిని దర్శించుకుంటారు. ఆ తరువాత డైరెక్టుగా సభా వేదిక వద్దకు వస్తారు. సిఎం చంద్రబాబు సమక్షంలో గత ఎన్నికల సమయంలో ఆనాటి ఎన్డీయే ప్రధాని అభ్యర్థి మోదీ ప్రసంగ పాఠాన్ని ఎల్‌ఈడీ తెరలపై ప్రదర్శిస్తారు. ఆ తరువాత చంద్రబాబు అందులో మోదీ పేర్కొన్న ప్రతి అంశాన్నీ ప్రస్తావిస్తూ నాడు ఏమి హామీ ఇచ్చారు? ఇప్పుడు ఎలా వాగ్దాన భంగానికి పాల్పడ్డారో.. వివరించనున్నారు. తెలుగు ప్రజల ఇలవేల్పు సాక్షాత్తూ శ్రీవేంకటేశ్వరస్వామి సన్నిధిలోనే ఇచ్చిన హామీని ఏ విధంగా విస్మరించారనేది విశదీకరించనున్నారు.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Titupathi: The stage is set for Telugu Desam Party's Dharma Porata Deeksha in Tirupati on Monday. CM Chandrababu to explain how the Central Government has decieved AP people. The CM to give PowerPoint presentation on Modi's election campaign speech of 2014. Chandrababu to address large gathering at Tarakarama stadium from where Narendra Modi assured Special status for Andhra Pradesh.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more