కూటమి నేతల గాలి తీసిన జలీల్ ఖాన్.. తాట తీస్తారంటూ వార్నింగ్

మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ మరోసారి వార్తల్లో నిలిచారు. కూటమి నేతలపై ఆయన సైటెర్లు వేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎవరూ ఊహించని విధంగా బీజేపీ నేత సుజనా చౌదరి విజయవాడ పశ్చిమ నియోజకవర్గం టికెట్‌ను దక్కించుకున్నారు. సుజనా చౌదరికి టికెట్ కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ..పోతిన మహేష్ జనసేనకు రాజీనామా చేసి అధికార పార్టీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ కూడా వైసీపీలో చేరాలని చూసినప్పటికీ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని బుజ్జగించడంతో ఆయన టీడీపీలో కొనసాగుతున్నారు.

తాజాగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో కూటమి నేతలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి, ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం కావడంతో మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్‌ను ప్రచారానికి ఆహ్వానించారు. కార్యకర్తలను ఉద్దేశించి జలీల్ ఖాన్ మాట్లాతున్న సమయంలో సుజనా చౌదరి, కేశినేని చిన్ని ఇద్దరు ఏదో సమాలోచనలు చేస్తూ కనిపించారు.

tdp ex mla jaleel khan satires on own party leaders

దీన్ని గమనించిన జలీల్ ఖాన్ వారిపై తనదైనశైలిలో కౌంటర్లు వేశారు. హాలో సుజనా చౌదరిగారు ..ఓయ్ ..ఓయ్..హాలో.. ఎమ్మెల్యేగారు, ఎంపీగారు అని గట్టిగా పిలిచారు. మీ రహస్యాలు ఏమైనా ఉంటే మీ ఇంట్లో మాట్లాడుకోండి.. ఇలా పబ్లిక్‌లో కాదు. మీకోసం రెండు గంటల నుంచి 2 వేల మంది ఎదురు చూస్తున్నారు.

1 టౌన్‌లో ఉండే కాపులు, ముస్లింలు చాలా మర్యాద ఇస్తారు...తిక్క లేచిందంటే తాట తీస్తారు. వీళ్లని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలంటూ కూటమి నేతలను జలీల్ ఖాన్ హెచ్చరించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+