జగన్ సతీమణి భారతికి కవిత పిలుపు: 'తెలంగాణ' పాయింట్ లాగిన కొత్తకోట
హైదరాబాద్: నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత... బతుకమ్మ వేడుకలకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతిని ఆహ్వానించడంపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత శుక్రవారం నాడు భగ్గుమన్నారు.
కల్వకుంట్ల కవితపై తెలంగాణ టీడీపీ ప్రధాన కార్యదర్శి కొత్తకోట దయాకర్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణను వ్యతిరేకించిన వైసిపి అధినేత జగన్ కుటుంబాన్ని బతుకమ్మ పండుగకు ఎలా ఆహ్వానిస్తారని పాయింట్ లాగారు.
తెలంగాణ సాధన కోసం అప్పట్లో అన్ని పార్టీలు ఏకమై పోరాడాయని గుర్తు చేశారు. ఇప్పుడు రైతుల ఆత్మహత్యలపై కూడా అలాగే పోరాడుతాయని చెప్పారు. రైతుల పక్షాన నిలవడానికి విపక్షాలన్నీ ఏకమైతే కేసీఆర్‌కు అంత బాధ ఎందుకో చెప్పాలన్నారు.

కాగా, గురువారం కవిత లోటస్ పాండుకు వెళ్లారు. ఆమె జగన్‌తో భేటీ అయినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే, ఆమె జగన్ సతీమణి భారతితో భేటీ అయ్యారు. బతుకమ్మ వేడుకలకు ఆహ్వానించారు. దీని పైన టిడిపి మండిపడింది.
స్వచ్ఛ ఏపీకి పాటుపడాలి: చంద్రబాబు
జాతిపిత మహాత్మా గాంధీ స్ఫూర్తితో అందరూ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్‌కు పాటుపడాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు. స్వచ్ఛ భారత్ ఏడాది సందర్భంగా చంద్రబాబు శుక్రవారం ఉదయం గుంటూరులో గాంధీ బొమ్మ నుంచి పరేడ్ మైదానానికి కాలి నడకన బయలుదేరారు.
ఈ సందర్భంగా మాట్లాడారు. నెలలో ఒక్కరోజు స్వచ్ఛ కార్యక్రమానికి కేటాయించాలన్నారు. జిన్నా టవర్ వద్ద గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. చెత్త నుంచి విద్యుత్ తయారు చేసేలా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు చొరవ చూపాలన్నారు. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు!












Click it and Unblock the Notifications