జగన్ ఇలాకాలో టీడీపీ అభ్యర్దిగా.. ఏరి కోరి - రిటర్న్ గిఫ్ట్..గేమ్ షురూ..!!
స్థానిక ఎన్నికల్లో కొత్త సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి. మున్సిపల్ పోరు ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది. కూటమి- వైసీపీ మధ్య నువ్వా నేనా అన్నట్లుగా రాజకీయం మారుతోంది. ఏకపక్షం గా విజయం సాధించాలని కూటమి.. ధీటుగా ఎదుర్కోవాలని వైసీపీ హోరా హోరీగా స్థానిక ఎన్నికల్లో తల పడుతున్నాయి. జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో రెండు పార్టీల అభ్యర్దులను ఖరారు చేసారు. ఇక్కడ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
పులివెందుల కేంద్రంగా బిగ్ ఫైట్ నడుస్తోంది. వైసీపీ - టీడీపీ మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్దులను ప్రకటించారు. వైసీపీ నుంచి వైఎస్ మనోహర్ రెడ్డి సతీమణి వైఎస్ ప్రమీలమ్మ పోటీలో ఉన్నారు. టీడీపీ నుంచి తూగుట్ల గీతాకుమారి పేరును అధికారికంగా ఖరారు చేసింది. ఈమె మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ తూగుట్ల మధుసూదన్ రెడ్డి సతీమణి. కాగా.. ప్రమీలమ్మ గతంలోనూ మున్సిపల్ ఛైర్మన్ గా పని చేసారు. మారుతున్న రాజకీయ సమీకరణాల వేళ ఇక్కడ గెలుపు రెండు పార్టీలకు ప్రతిష్ఠాత్మంగా మారింది. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు నియోజకవర్గం కుప్పం మున్సిపాల్టీలో విజయం సాధించింది. ఇప్పుడు దీనికి ప్రతిగా పులివెందులలో విజయం కోసం టీడీపీ కొత్త వ్యూహాలు సిద్దం చేస్తోంది.

టీడీపీ - వైసీపీ వ్యూహ ప్రతివ్యూహాలు
అందులో భాగంగా ఏరి కోరి అభ్యర్దిని ఖరారు చేసింది. పులివెందులో పార్టీ గెలుపు బాధ్యతలను బీటెక్ రవికి అప్పగించారు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత పులివెందుల జెడ్పీటీసీని టీడీపీ గెలుచుకుంది. ఇప్పుడు అదే తరహాలో పులివెందుల మున్సిపాలిటీ గెలవాలని వ్యూహాలు సిద్దం చేస్తోంది. అటు వైసీపీ నుంచి ఎంపీ అవినాశ్ రెడ్డి వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. ఎన్నిక వేళ పట్టణంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇక్కడ ప్రమీలమ్మ గెలుపు పైన వైసీపీ శ్రేణులు ధీమాగా ఉన్నాయి. టీడీపీ మాత్రం పులివెందులతో పాటుగా కడప మేయర్ సీటు గెలుస్తామని ధీమాగా చెబుతోంది. దీంతో.. ఇప్పుడు పులివెందులలో మున్సిపల్ ఎన్నికల వేళ చోటు చేసుకుంటున్న రాజకీయం ఉత్కంఠగా మారుతోంది.












Click it and Unblock the Notifications
