చిన్న శ్రీను కుమార్తె సిరి సహస్ర కు సీటు ఖరారులో బిగ్ ట్విస్ట్..!!
స్థానిక ఎన్నికల వేళ రాజకీయం ఆసక్తిగా మారుతోంది. మున్సిపల్ ఎన్నికలకు రేపు (ఆదివారం) నామినేషన్లకు చివరి రోజు. కూటమి పార్టీలు.. వైసీపీ తమ అభ్యర్ధులను ప్రకటిస్తున్నాయి. ఈ లిస్టు ల ఖరారు వేళ కొత్త సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి. సామాజిక లెక్కలు కీలకంగా మారుతు న్నాయి. ఇదే సమయంలో వైసీపీ నుంచి టీడీపీలో చేరిన చిన్ని శ్రీను తన కుమార్తెకు సీటు అంశం పైన హామీ పొందారు. ఇప్పుడు జాబితాలు వెల్లడిస్తున్న వేళ సిరి సహస్రకు దక్కే సీటు పైన కొత్త అంశాలు ప్రచారంలోకి వస్తున్నాయి.
వైసీపీలో సుదీర్ఘ కాలం పని చేసిన మజ్జి శ్రీను తన కుమార్తెతో కలిసి టీడీపీలో చేరారు. ఆ సమయం లోనే తన కుమార్తెకు స్థానిక ఎన్నికల్లో సీటు పైన హామీ దక్కించుకున్నారు. ఆ తరువాత టీడీపీ ముఖ్య నేతలను కలిసి వారి మద్దతు కూడగట్టారు. తనకు పట్టు ఉన్న ప్రాంతాల్లోని వైసీపీ కేడర్ ను టీడీపీలోకి తీసుకొచ్చారు. ఇక.. స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదల అయింది. సిరి సహస్రకు ఈ ఎన్నికలలో విజయనగరం మేయర్ లేదా జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ గా అవకాశం ఇస్తామని టీడీపీ నుంచి హామీ ఉంది. అయితే, విజయనగరం మేయర్ స్థానంలోనూ చివరి నిమిషం వరకు సిరి సహస్ర పేరు రేసులో వినిపించింది. అయితే, స్థానిక టీడీపీ నేతలు... సమీకరణాలతో సిరి సహస్ర కు ఈ సీటు దక్క లేదు. టీడీపీ నుంచి మేయర్ అభ్యర్థిగా అవనపు భార్గవి ని టీడీపీ నాయకత్వం ప్రకటించింది.

మారుతున్న సమీకరణాలు
మరోవైపు వైసీపీ నుంచి కోలగట్ల శ్రావణి మేయర్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ సీటుని జనరల్ మహిళ కేటగిరీగా రిజర్వ్ చేశారు. మేయర్ సీటు విషయంలో టీడీపీ స్థానిక నేతలు అంతా ఎమ్మెల్యేతో సమావేశమై.. పార్టీ నుంచి ఎవరికి ఇచ్చినా గెలిపించుకోవాలని డిసైడ్ అయ్యారు. కాగా, ఈ సీటును తొలుత జనసేన కోరింది. అయినా.. చివరి నిమిషంలో దానిని టీడీపీ ఖాతాలోకి మార్చారు. అయితే, టీడీపీలో ఇప్పటికే సుదీర్ఘ కాలంగా ఉన్న ఆశావహులు మేయర్ రేసులోకి వచ్చారు. కాగా.. చివరకు భార్గవి పేరును ప్రకటించారు. దీంతో... సిరి సహస్రకు విజయనగరం జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ సీటు ఇస్తారని చెబుతున్నారు. అటు వైసీపీ నుంచి ఈ సీటులో బొత్సా తన కుమార్తె అనూష ను బరిలోకి దించుతున్నారు. ఈ సీటు కోసం టీడీపీ సీనియర్లు పెద్ద సంఖ్యలో పోటీ పడుతున్నారు. దీంతో.. సిరి సహస్రకు జెడ్పీ సీటు కేటాయింపు ఖాయమని చెబుతున్నా... కొంత సస్పెన్స్ మాత్రం కంటిన్యూ అవుతోంది.













Click it and Unblock the Notifications
