Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ప్రత్యేక హోదాపై పావులు, ఎవరికి షాక్?: 'కాంగ్రెస్' కేవీపీకి బాబు కౌంటర్

న్యూఢిల్లీ: తెలుగుదేశం పార్టీ నేతలు మంగళవారం నాడు కాంగ్రెస్ పార్టీకి కౌంటర్ ఇచ్చారు! ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే అంశంపై చర్చ చేపట్టాలని ఆ పార్టీ నోటీసులు ఇచ్చింది. హోదా అంశంపై రూల్‌ నెం.193 నిబంధన కింద లోకసభలో చర్చను చేపట్టాలని టిడిపి నోటీసు ఇచ్చింది.

భారత వైద్య మండలి చట్ట సవరణ బిల్లు, డెంటిస్ట్‌ అమెండ్‌మెంట్‌ బిల్లుపై ఇవాళ లోకసభ చర్చించనుంది. కాగా, ఏపీకి ప్రత్యేక హోదాను కోరుతూ రాజ్యసభ సభ్యుడు, కాంగ్రెస్ నేత గత సమావేశాల్లో ప్రయివేటు మెంబర్ బిల్లును ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే.

దానిపై అప్పుడు చర్చ జరిగింది. ఈ నెల 22వ తేదీన ప్రత్యేక హోదా పైన మళ్లీ చర్చ జరగనుంది. ఓటింగ్ జరిగే అవకాశముందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ టీడీపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతిస్తుందా అనే చర్చ సాగుతోంది. హోదా బిల్లుకు వైసిపి మద్దతు పలుకుతుంది.

తెలుగుదేశం పార్టీ మద్దతిస్తుందా లేదా అనే విషయమై ప్రధానంగా చర్చ సాగుతోంది. అయితే, ఏపీ ప్రయోజనాల కోసం ఏ బిల్లు పెట్టినా తాము మద్దతిస్తామని టిడిపి నేతలు చెబుతున్నారు. నిన్న జేసీ దివాకర్ రెడ్డి, నేడు టిజి వెంకటేష్‌లు అదే చెబుతున్నారు.

TDP gives notice on Special Status to AP

ప్రత్యేక హోదా ఏపీకి సంబంధించిన అంశం, ఏపీ టీడీపీ రాష్ట్ర ప్రయోజనాల కోసం పని చేస్తుందని, తాము

న్యూఢిల్లీ: తెలుగుదేశం పార్టీ నేతలు మంగళవారం నాడు కాంగ్రెస్ పార్టీకి కౌంటర్ ఇచ్చారు! ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే అంశంపై చర్చ చేపట్టాలని ఆ పార్టీ నోటీసులు ఇచ్చింది. హోదా అంశంపై రూల్‌ నెం.193 నిబంధన కింద లోకసభలో చర్చను చేపట్టాలని టిడిపి నోటీసు ఇచ్చింది.

భారత వైద్య మండలి చట్ట సవరణ బిల్లు, డెంటిస్ట్‌ అమెండ్‌మెంట్‌ బిల్లుపై ఇవాళ లోకసభ చర్చించనుంది. కాగా, ఏపీకి ప్రత్యేక హోదాను కోరుతూ రాజ్యసభ సభ్యుడు, కాంగ్రెస్ నేత గత సమావేశాల్లో ప్రయివేటు మెంబర్ బిల్లును ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే.

దానిపై అప్పుడు చర్చ జరిగింది. ఈ నెల 22వ తేదీన ప్రత్యేక హోదా పైన మళ్లీ చర్చ జరగనుంది. ఓటింగ్ జరిగే అవకాశముందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ టీడీపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతిస్తుందా అనే చర్చ సాగుతోంది. హోదా బిల్లుకు వైసిపి మద్దతు పలుకుతుంది.

తెలుగుదేశం పార్టీ మద్దతిస్తుందా లేదా అనే విషయమై ప్రధానంగా చర్చ సాగుతోంది. అయితే, ఏపీ ప్రయోజనాల కోసం ఏ బిల్లు పెట్టినా తాము మద్దతిస్తామని టిడిపి నేతలు చెబుతున్నారు. నిన్న జేసీ దివాకర్ రెడ్డి, నేడు టిజి వెంకటేష్‌లు అదే చెబుతున్నారు.

ప్రత్యేక హోదా ఏపీకి సంబంధించిన అంశం, ఏపీ టీడీపీ రాష్ట్ర ప్రయోజనాల కోసం పని చేస్తుందని, తాము బిల్లుకు మద్దతు పలుకుతామని జేసీ అన్నారు. టిజి వెంకటేష్ కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేశారని తెలుస్తోంది. అదే సమయంలో, విభజన నేపథ్యంలో పరువు పోగొట్టుకున్న కాంగ్రెస్ పార్టీ పరువు దక్కించుకునేందుకు ఈ బిల్లు తెరపైకి తెచ్చిందనేది టిడిపి వాదన.

ప్రత్యేక హోదా పైన కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే అసలు కేవీపీ ప్రయివేటు మెంబర్ బిల్లు పెట్టడం ఏమిటంటున్నారు. రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీకి బలం ఉందని, అక్కడ ఆ పార్టీ గట్టిగా నిలదీయాలని అడుగుతున్నారు.

ప్రత్యేక హోదా అంశం ద్వారా ఏ పార్టీకి ఆ పార్టీ ప్రయోజనం పొందాలని చూస్తోంది. అందులో భాగంగానే కేవీపీ బిల్లును ప్రవేశ పెట్టారని అంటున్నారు. వైసిపి కూడా దీనిని ప్రధానంగా లేవనెత్తుతోంది. ఈ విషయంలో మోడీని నిలదీయడం లేదని చంద్రబాబుపై వైసిపి దుమ్మెత్తి పోస్తోంది. విపక్షాల విమర్శల నేపథ్యంలో హోదా పైన టిడిపి ప్లాన్‌గా ముందుకెళ్తోంది.

గత సమావేశాల సమయంలో ప్రత్యేక హోదా ఇవ్వమని కేంద్రమంత్రులు తేల్చి చెప్పిన సమయంలో వైసిపి, కాంగ్రెస్ నుంచి ఎదురుదాడి తప్పించుకునేందుకు టిడిపి నేతలు బీజేపీ పైన కూడా నిప్పులు చెరిగారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ చేసిన పొరపాటు వల్లే ఇది జరిగిందని విమర్శించారు. వైసిపిని కూడా లాగారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+