వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీడీపీ చేతికి కేంద్రం అస్త్రం - వైసీపీ కౌంటర్ ప్లాన్ రెడీ..!!

|
Google Oneindia TeluguNews

ఏపీలో రాజకీయం కొత్త టర్న్ తీసుకుంటోంది. టీడీపీ ఇప్పటి వరకు వైసీపీ ప్రభుత్వం పైన చేస్తున్న విమర్శలకు మద్దతుగా అన్నట్లుగా కేంద్రం తాజాగా ప్రస్తావించిన అంశాలు చర్చకు కారణమయ్యాయి. ఏపీలో ఆర్దిక పరిస్థితి.. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అప్పుల గురించి టీడీపీ పదే పదే ఆరోపణలు చేస్తోంది. దీని పైన సీఎం జగన్ తో సహా ఏపీ మంత్రులు పలు సందర్భాల్లో స్పష్టత ఇచ్చారు. చంద్రబాబు కంటే తాను తక్కువగానే అప్పులు చేసినట్లుగా స్వయంగా సీఎం పలు బహిరంగ సభల్లో వెల్లడించారు. టీడీపీ అధినేత చంద్రబాబు.. జనసేనాని పవన్ తో సహా పలువురు నేతలు ఏపీ మరో శ్రీలకంలా మారుస్తున్నారంటూ ఆరోపణలు చేసారు. దీని పైనా సీఎం స్పందించారు. తాము తీసుకొచ్చిన అప్పులతో పేదలకు మేలు చేస్తున్నామని చెబుతున్నారు.

ఏపీలో రాజకీయంలో కొత్త ట్విస్ట్

ఏపీలో రాజకీయంలో కొత్త ట్విస్ట్

ఇక, ఇప్పుడు కేంద్రం తాజాగా శ్రీలంక లో సంక్షోభ పరిస్థితులను వివరిస్తూ.. ఏపీతో సహా 11 రాష్ట్రాల అర్దిక పరిస్థితిని ప్రస్తావించింది. అందులో ఏపీ..తెలంగాణ సైతం ఉన్నాయి. ఏపీలో రుణ పరిమితి మేరకే తాము అప్పులు తీసుకుంటున్నామని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. కేంద్రం ఏపీ గురించి శ్రీలంక పైన చర్చ సమయంలో ప్రస్తావించటం పైన వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఇప్పుడు టీడీపీ దీనిని ప్రచారాస్త్రాంగా మలచుకొనే అవకాశం కనిపిస్తోంది. అదే అఖిలపక్ష సమావేశంలో టీడీపీ నుంచి హాజరైన రాజ్యసభ సభ్యుడు కనకమేడల ఆర్దిక క్రమశిక్షణ పాటించని రాష్ట్రాల పైన ఎటువంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని డిమాండ చేసారు. ఇక, పోలవరం విషయంలోనూ కేంద్రం ఇచ్చిన సమాధానం ఇప్పుడు చేతికి అస్త్రంగా మారే ఛాన్స్ కనిపిస్తోంది.

టీడీపీ చేతికి అస్త్రంగా మారుతోందా

టీడీపీ చేతికి అస్త్రంగా మారుతోందా

ప్రాజెక్టు నిర్మాణానికి వ్యూహం లేదని..కాంట్రాక్టు నిర్వహణ సరిగా లేదంటూ స్పష్టం చేసింది. దీని కారణంగానే 2022లో ప్రాజెక్టు పూర్తి కాలేదని చెప్పుకొచ్చింది. దీని పైన టీడీపీ సైతం ఇప్పుడు వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశం ఉంది. కేంద్రం చెప్పిన సమాధానం పైన రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సిద్దం అవుతోంది. దీంతో..ఇప్పుడు వైసీపీ అలర్ట్ అయింది. కేంద్రం ఏపీ ప్రభుత్వం పైన ప్రస్తావించిన అంశాలు - ఆర్దిక పరిస్థితి పైన సమాధానం ఇవ్వటానికి సిద్దం అవుతోంది. అదే సమయంలో.. కేంద్రం చేసిన అప్పుల పైన సమాధానం ఇవ్వాలని ఇతర పక్షాలతో నిలదీసేందుకు సిద్దం అవుతోంది. ఈ మూడేళ్ల కాల పాలనలో అప్పులతో పాటుగా పోలవరంలో ఏం జరిగిందీ వివరించాలని వైసీపీ ముఖ్య నేతలు నిర్ణయించారు.

కౌంటర్ ప్లాన్ తో వైసీపీ సిద్దం

కౌంటర్ ప్లాన్ తో వైసీపీ సిద్దం


పార్లమెంట్ వేదికగా కేంద్రం గతంలో చంద్రబాబు హయాంలో 1.62 లక్షల కోట్ల ఖర్చుకు వివరాలు ఇవ్వలేదని చెప్పిన అంశాన్ని హైలైట్ చేయాలని భావిస్తోంది. కాగ్ దీనికి సంబంధించి లెక్కలు అడిగినా.. 51 వేల కోట్ల రూపాయాల మేరకే ఇవ్వటంతో..మిగిలిన 1.51 లక్షల కోట్ల సంగతి తేలాల్సి ఉందని కేంద్రం స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది. దీంతో పాటుగా.. పోలవరం నిర్మాణంలో నాడు చంద్రబాబు ప్రభుత్వ హయాంలో చేసిన పొరపాట్లు.. ఇప్పుడు పోలవరం పూర్తి చేయాటానికి అడ్డండిగా మారాయనేది వైసీపీ వాదన. ఇప్పటి వరకు కేంద్రం పైన ఆచి తూచి స్పందిస్తూ వచ్చిన జగన్ ప్రభుత్వం.. ఇప్పుడు అన్ని అంశాలను బటయ పెట్టేందుకు సిద్దం అవుతోంది. తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలపైన మౌనంగా ఉండటం సరి కాదనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మొత్తం పరిణామాల పైన కౌంటర్ ఇవ్వటానికి సిద్దం అవుతోంది.

English summary
TDP may Target YSRCP Govt with latest developments which took place in parliament. YCP also preparing counter plan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X