TDP AI Anchors : ఏఐ యాంకర్లతో టీడీపీ న్యూస్ బులిటెన్లు-అసలు టార్గెట్ ఇదే...!

ఏపీలో ఎన్నికల సీజన్ వచ్చేసింది. మరో ఆరేడు నెలల్లో అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ రావడం ఖాయం. దీంతో రాజకీయ పార్టీలు స్పీడు పెంచుతున్నాయి. ముఖ్యంగా జనాన్ని ఆకట్టుకునేందుకు అందివచ్చిన ఏ ఒక్క అవకాశాన్నీ వదులుకోవడం లేదు. ఇదే క్రమంలో ఉమ్మడి ఏపీలో ఐటీ రంగానికి ఆద్యులుగా చెప్పుకునే చంద్రబాబు.. తన సొంత పార్టీ టీడీపీలోనూ ఐటీ పరిజ్ఞానం వాడకంలో ముందున్నారు.

టీడీపీ అధినేత చంద్రబాబు.. ఇప్పుడు టీవీ ఛానళ్లలో హల్ చల్ చేస్తున్న ఏఐ న్యూస్ యాంకర్ల తరహాలో తమ పార్టీలోనూ వీరి వాడకాన్ని మొదలుపెట్టేశారు. పార్టీ కార్యక్రమాలు, రోజువారీ షెడ్యూల్స్, ఇతర ప్రచారాలను ఏఐ న్యూస్ యాంకర్లతోనే చేయించాలని నిర్ణయించిన చంద్రబాబు... తాజాగా తన కుమారుడు నారా లోకేష్ యువగళం పాదయాత్రలో తొలిసారిగా దీన్ని ఆవిష్కరించారు. కనిగిరిలో లోకేష్ పాదయాత్రకు సంబంధించిన వివరాలతో టీడీపీ ఏఐ న్యూస్ యాంకర్ వైభవి తొలి బులిటెన్ చదివింది.

Tdp introduced AI anchors for party campaign through news bulletins

అనంతరం విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్ధి రేసులో ఉన్న కేశినేని నాని సోదరుడు కేశినేని శివనాథ్(చిన్ని) ఇవాళ అను అనే ఏఐ న్యూస్ యాంకర్ తో తాను చేపడుతున్న కార్యక్రమాలను చదివించారు. దీంతో టీడీపీలో వరుసగా రెండో ఏఐ న్యూస్ యాంకర్ తెరపైకి వచ్చినట్లయింది. ఇలా రాబోయే రోజుల్లో మరింత మంది ఏఐ యాంకర్లను ఎక్కడికక్కడ ఏర్పాటు చేసి వారితో వార్తల తరహాలో తమ పార్టీ కార్యక్రమాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లి విస్తృతంగా ప్రచారం చేసుకోవాలని టీడీపీ భావిస్తోంది. ఇలా ఏఐ న్యూస్ యాంకర్ల వాడకం వల్ల పలు ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

టీడీపీ ఏఐ న్యూస్ యాంకర్ల వాడకం వెనుక చౌకగా ప్రచారంతో పాటు రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయాల ప్రభావం కూడా ఉంది. ప్రస్తుతం టీడీపీకి అండగా ఉంటున్న ఈటీవీ, ఏబీఎన్, టీవీ5 వంటి ఛానళ్లను ఎల్లో మీడియాగా ప్రచారం చేస్తోంది. దీంతో ఆయా ఛానళ్లను ఎంతో కాలం నమ్ముకునే పరిస్ధితి లేదు. ఇలాంటి తరుణంలో ఏఐ యాంకర్లతో తామే పార్టీ కార్యక్రమాల్ని, విశ్లేషణల్ని జనంలోకి సోషల్ మీడియా ద్వారా తీసుకెళితే ఎక్కువగా ప్రయోజనం ఉంటుందని చంద్రబాబు భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+