వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మేము బఫూన్లైతే...సీఎం జగన్ ఏంటి: ప్రజల కోసమే భరిస్తున్నాం: సీఎంపై ప్రివిలేజ్ నోటీసు..!

|
Google Oneindia TeluguNews

ఏపీ శాసనసభలో ఎస్సీ ..ఎస్టీ బిల్లుపైన ముఖ్యమంత్రి మాట్లాడే సమయంలో టీడీపీ నేతల మీద చేసిన వ్యాఖ్యలపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. ముఖ్యమంత్రి తమను మమల్ని సీఎం బఫూన్లు అని అంటున్నారు...మేము బఫూన్లైతే...సీఎం జగన్ ఏంటి... బఫూన్ల కంటే పెద్ద పదం వాడాల్సి వస్తుందంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. అదే సమయంలో ముఖ్యమంత్రి తాను అనని మాటలు అన్నారంటూ ముఖ్యమంత్రిపైన గతంలో సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చిన టీడీపీ..ఇప్పుడు మరోసారి సీఎంతో సహా మంత్రుల పైన ప్రివిలేజ్ నోటీసు ఇచ్చింది. నిన్న శాసనసభలో టీడీపీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి.. బఫూన్‌లంటూ అభ్యంతరకర భాష వాడటంపై ఈ నోటీసులు ఇచ్చారు.

లిక్కర్ బ్రాండ్స్ తగ్గిపోయాయని టీడీపీ మహిళా ఎమ్మెల్యే వ్యాఖ్యలు: సభలో నవ్వులే నవ్వులు లిక్కర్ బ్రాండ్స్ తగ్గిపోయాయని టీడీపీ మహిళా ఎమ్మెల్యే వ్యాఖ్యలు: సభలో నవ్వులే నవ్వులు

సీఎంపైన మరోసారి ప్రివిలేజ్ నోటీసులు

సీఎంపైన మరోసారి ప్రివిలేజ్ నోటీసులు

ముఖ్యమంత్రి జగన్ పైన మరోసారి టీడీపీ సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చింది. శాసనసభలో టీడీపీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి.. బఫూన్‌లంటూ అభ్యంతరకర భాష వాడటంపై టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ నోటీసులు అందజేశారు. సమావేశాలు ప్రారంభమైన నాటి నుంచి సీఎం జగన్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని నోటీసులో టీడీపీ పేర్కొంది. పాయింట్‌ ఆఫ్ ఆర్డర్‌ లేవనెత్తితే పాయింటే లేదని స్పీకర్‌ వ్యాఖ్యానించడం పట్ల కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రశ్నోత్తరాలు ప్రారంభానికి ముందే.. మంత్రులు, అధికార పార్టీ సభ్యులతో మాట్లాడించడాన్ని టీడీపీ నోటీసుల్లో పేర్కొంది. గత వారం ప్రతిపక్ష నేత చంద్రబాబు మార్షల్స్ ను ఉద్దేశించి చేయని వ్యాఖ్యలు చేసారంటూ..సీఎం సభను తప్పుదోవ పట్టించారంటూ ఇప్పటికే టీడీపీ ప్రివిలేజ్ నోటీసు ఇవ్వగా.. ఇప్పుడు మరో నోటీసు అందించింది.

మేము బఫూన్లైతే...సీఎం జగన్ ఏంటి

మేము బఫూన్లైతే...సీఎం జగన్ ఏంటి

అసెంబ్లీలో తాను అనని మాటలను అన్నట్లు చూపుతున్నారని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేసారు. తమ పార్టీ నేతలను సీఎం బఫూన్లు అని అంటున్నారు...మేము బఫూన్లైతే... సీఎం జగన్ ఏంటి... బఫూన్ల కంటే పెద్ద పదం వాడాల్సి వస్తుందంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. టీడీపీ కార్యకర్తలపై దాడులను నిరసిస్తూ నిర్వహించారు. రాష్ట్రంలో రివర్స్ పాలన సాగుతోందని మండిపడ్డారు. అసెంబ్లీలో ప్రభుత్వం టీడీపీ ఎమ్మెల్యేలకు మాట్లాడే అవకాశం ఇవ్వటం లేదని ఆరోపించారు. ప్రజాసమస్యలపై రాజీలేని పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. రివర్స్‌ టెండరింగ్‌ ఫార్స్ టెండరింగ్‌ మారిందన్నారు. పోలవరంలో రూ.750 కోట్లు ఆదా చేశామని దొడ్డిదారిన మళ్లీ వ్యయం పెంచారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం సలహాదారు ఇంట్లో కూర్చుని అన్ని సెటిల్ చేస్తున్నారని ఆరోపించారు. ఎన్ని తిట్టినా భరిస్తున్నామంటే ప్రజల కోసమే అని చంద్రబాబు స్పష్టం చేసారు.

రాష్ట్రంలో ఉన్మాది పాలన..

రాష్ట్రంలో ఉన్మాది పాలన..

ప్రభుత్వాన్ని విమర్శించినవారి ఆర్థికమూలాలపై దాడులు జరుగుతున్నాయని చంద్రబాబు మండిపడ్డారు. ఇది కొత్త తరహా దాడులని.. చరిత్రలో ఎప్పుడూ జరగలేదని బాబు అన్నారు. అట్రాసిటీ కేసు పెట్టి వేధిస్తున్నారని, మీడియా గొంతు నొక్కేశారని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యాన్ని సీఎం జగన్ అపహాస్యం చేస్తున్నారన్నారు. ప్రజలు తిరుగుబాటు చేసే రోజు అతి దగ్గర్లోనే ఉందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో ఉన్మాది పాలన నడుస్తోందన్నారు. జగన్ ఉన్మాది అని... పోలీసులు కూడా అలా మారొద్దని సూచించారు. గతంలో కొంతమందిని జగన్‌ జైలుకు తీసుకెళ్లారని... అలాంటి పరిస్థితిని పోలీసులు తెచ్చుకోవద్దని హితవు పలికారు. శాడిస్టు పాలన చేస్తూ రాక్షస ఆనందం పొందుతున్నారని అన్నారు. రాష్ట్రంలో టీడీపీ కార్యకర్తలపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయన్నారు.

English summary
TDP once again issued privilage notices to Assembly secretary on CM jagan and on Ministers. CBN serious on CM comments on TDp leaders in Assembly.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X