కీలక జిల్లాలో చంద్రబాబు మార్క్ అభ్యర్దుల ఎంపిక - సీనియర్లలో ఉత్కంఠ..!!

వచ్చే ఎన్నికలు హోరా హోరీగా మారుతున్నాయి. జగన్ ఓటమే లక్ష్యంగా చంద్రబాబు, పవన్ వ్యూహాలు సిద్దం చేస్తున్నారు. అధికారం నిలబెట్టుకొనేందుకు సీఎం జగన్ అడుగులు వేస్తున్నారు. వైసీపీ అభ్యర్దుల ఎంపిక తుది దశకు చేరుకుంది. టీడీపీ, జనసేన సీట్ల సర్దబాటు పై ఒక అంచనాకు వచ్చారు. ఇప్పుడు బీజేపీ ఎంట్రీతో సీట్ల కేటాయింపు లో కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో టీడీపీలో సీట్ల ఖరారు సీనియర్లలో ఉత్కంఠను పెంచుతోంది.

సీట్ల లెక్కలు : ఉమ్మడి కృష్ణా జిల్లాలో 2019 ఎన్నికల్లో టీడీపీ కేవలం రెండు స్థానాల్లోనే విజయం సాధించింది. టీడీపీకి గట్టి పట్టు ఉన్న ఈ జిల్లాలో తిరిగి మెజార్టీ సీట్లు సాధించటమే లక్ష్యంగా చంద్రబాబు అభ్యర్దుల కసరత్తు చేస్తున్నారు. వైసీపీ నుంచి టీడీపీలోకి వస్తున్న వారికి సీట్లు ఖాయం చేసారు. అదే ఇప్పుడు ఆ నియోజకవర్గాల్లోని సీనియర్లలో టెన్షన్ పెంచుతోంది. జిల్లాలో జనసేనకు విజయవాడ పశ్చిమం సీటు కేటాయింపు ఖాయమైంది. అవనిగడ్డను జనసేన కోరుకుంటోంది. ఇప్పుడు బీజేపీ పొత్తు ఖాయంగా కనిపిస్తున్న వేళ రెండు సీట్లలో మార్పులు ఖాయంగా కనిపిస్తున్నాయి. జిల్లాలోని పదహారు సీట్లలో 10 సీట్లకు సంబంధించి అభ్యర్థులను దాదాపు నిర్ణయించారు. పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథికి ఖరారు చేశారు.

TDP-Janasena Seats almost finalised in Krishna District, to be allotted for BJP as Alliance

పొత్తుల్లో ఎవరెక్కడ : గన్నవరం నుంచి వైసీపీ నుంచి వచ్చి టీడీపీలో చేరిన యార్లగడ్డ వెంకట్రావుకు ఇచ్చారు. మైలవరం సీటు వ్యవహారం పార్టీకి క్లిష్టంగా మారింది. గుడివాడ నుంచి వెనిగళ్ల రామ్మోహన్‌, గన్నవరంలో యార్లగడ్డ వెంకట్రావు, మచిలీపట్నంలో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, విజయవాడ సెంట్రల్‌లో బొండా ఉమామహేశ్వరరావు, పామర్రులో వర్ల కుమార్‌ రాజా, నందిగామలో తంగిరాల సౌమ్య, జగ్గయ్యపేటలో శ్రీరాం రాజగోపాల్‌ తాతయ్య టీడీపీ తరఫున నిలబడనున్నారు. విజయవాడ పశ్చిమ సీటును పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించారు. ఆ పార్టీ తరఫున పోతిన వెంకట మహేశ్‌ నిలబడనున్నారు. మైలవరం నుంచి వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ టీడీపీలోకి వచ్చేందుకు ఆసక్తిగా ఉన్నారు. వీరిద్దరిలో ఈ సీటు ఎవరికి ఇవ్వాలన్నది టీడీపీ నిర్ణయించాల్సి ఉంది. విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహనరావును తిరిగి అదే స్థానంలో కొనసాగిస్తున్నారు.

TDP-Janasena Seats almost finalised in Krishna District, to be allotted for BJP as Alliance

పోటీలో నిలిచేదెవరు : అవనిగడ్డ, పెడన సీట్లకు టీడీపీ నుంచి ఇన్‌చార్జులుగా మండలి బుద్ధ ప్రసాద్‌, కాగిత కృష్ణ ప్రసాద్‌ ఉన్నారు. ఈ రెండు సీట్లలో ఒకదానిని జనసేన ఆశిస్తోంది. తిరువూరు రిజర్వుడు సీటులో అభ్యర్ధి విషయం కూడా కొలిక్కి రాలేదు. ఈ నియోజకవర్గానికి ప్రస్తుతం శ్యావల దేవదత్‌ ఇన్‌చార్జిగా ఉన్నారు. అయితే, ఇటీవల పార్టీలో చేరిన కొలికపూడి శ్రీనివాసరావు కూడా ఈ సీటు కోసం రంగంలోకి దిగారు. బీజేపీ నేత, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్‌ గతంలో ఈ సీటుకు ప్రాతినిధ్యం వహించారు. టీడీపీతో బీజేపీ పొత్తు కుదిరితే ఈ సీటును ఆయన ఆశించే అవకాశముంది. దీంతో..ఈ జిల్లాలో పొత్తుల్లో కేటాయించే సీట్లు..టీడీపీ నుంచి ఖరారయ్యే సీట్లు..అభ్యర్దుల తుది ఎంపిక పైన ఆసక్తి కొనసాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+