బిజెపి మాజీ మంత్రి మాణిక్యాలరావు అవినీతిపై ఆధారాలు:టిడిపి నేత సంచలనం

పశ్చిమగోదావరి జిల్లా: కేంద్ర-రాష్ట్ర రాజకీయ పరిణామాల మధ్య తలెత్తిన విభేథాల నేపథ్యంలో ఇటీవల మంత్రి పదవికి రాజీనామా చేసిన బిజెపి నేత పైడికొండల మాణిక్యాల రావుపై పశ్చిమగోదావరి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ ముళ్ళపూడి బాపిరాజు సంచలన ఆరోపణలు చేశారు. మంత్రి హోదాను అడ్డుపెట్టుకొని అవినీతికి పాల్పడిన ఎమ్మెల్యే మాణిక్యాలరావుకు టిడిపి నాయకులను విమర్శించే అర్హత లేదని జిల్లా బాపిరాజు మండిపడ్డారు.

కేవలం ఆరోపణలు చేయడం కాదని...మాజీ మంత్రి మాణిక్యాల రావు అవినీతిపై తమ వద్ద ఆధారాలు ఉన్నాయంటూ బాపిరాజు స్పష్టం చేశారు. ఒకవైపు బిజెపి నేతలు టిడిపి అధినేత చంద్రబాబు, లోకేష్ తో సహా తెలుగుదేశం ప్రభుత్వం అవినీతిపై వివిధ ఆరోపణలు చేస్తున్ననేపథ్యంలో బిజెపి నాయకుడు మాణిక్యాలరావుపై టిడిపి నేత బాపిరాజు ఆరోపణలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

TDP leader alleges on BJP leader Manikyala rao corruption creat sensation

ఎపికి చివరి బడ్జెట్ లోనూ అన్యాయం జరిగిన నేపథ్యంలో టిడిపి-బిజెపి ల మధ్య విభేధాలు మొదలై అవి తీవ్ర రూపం దాల్చి ఎపి మంత్రి వర్గం నుంచి భాజపా మంత్రులు, కేంద్ర మంత్రి వర్గం నుంచి టిడిపి మంత్రులు వైదొలిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లా చైర్మన్ ముళ్ళపూడి బాపిరాజు మీడియాతో మాట్లాడుతూ మంత్రి హోదాలో ఆయన పాల్పడిన అవినీతిపై తమ వద్ద అనేక ఆధారాలు ఉన్నాయన్నారు. రహదారులు, నిట్‌ గోడ నిర్మాణంలోను కాంట్రాక్టర్‌ నుంచి సొమ్ములు వసూలు చేసిన ఆధారాలు తమవద్ద ఉన్నాయంటూ ఆయన ఆరోపించారు.

మరోవైపు అసెంబ్లీలో ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు బిజెపి మంత్రి కామినేని శ్రీనివాస్ ఇటీవలికాలం వరకు నిర్వహించిన వైద్యశాఖ గురించి మాట్లాడుతూ ఆ శాఖలో అనేక సమస్యలు ఉన్నాయని పేర్కొనడం గమనార్హం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+