విశాఖలో జగన్ ప్రమాణస్వీకారం-హింట్ ఇచ్చేసిన టీడీపీ నేత ఆనం..!
ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఈసారి ఎన్నికల్లో నమోదైన భారీ పోలింగ్ శాతం అన్ని పార్టీల్లోనూ ఆశలు రేపింది. పెరిగిన పోలింగ్ శాతాలు తమకే అనుకూలమని అన్ని పార్టీలు చెప్పేసుకుంటున్నాయి. అధికార వైసీపీ నేతలు మరో అడుగు ముందుకేసి వైజాగ్ లో జూన్ 8 లేదా 9 తేదీల్లో జగన్ ప్రమాణస్వీకారం చేస్తారని, ఏయూనే వేదిక అని, ముహుర్తం ఇదేనని ఇలా చాలా అంశాలు తెరపైకి తెచ్చేస్తున్నారు. దీనిపై స్పందించిన నెల్లూరు టీడీపీ నేత ఆనం వెంకట రమణారెడ్డి ఇవాళ వీరికి మద్దతుగా ఓ ట్వీట్ చేశారు.
విశాఖలో జగన్ ప్రమాణస్వీకారంపై రాష్ట్రంలో వైసీపీ నేతలు చేస్తున్న ప్రచారంలో భాగంగా ఇప్పటికే నగరంలో హోటల్స్ అడ్వాన్స్ బుకింగ్ లు అయిపోతున్నాయని, ట్రావెల్ టికెట్లు కూడా ముందుగానే బుక్ అయిపోతున్నాయని కూడా చెప్తున్నారు. దీనిపై ఆనం వెంకట రమణారెడ్డి స్పందించారు. వైసీపీ నేతలు సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారాన్ని గుర్తుచేస్తూ ఎక్స్ లో సెటైర్లు వేస్తూ ఓ పోస్ట్ పెట్టారు.

"విశాఖకి టికెట్ ధరలు భారీగా పెంచేసిన ప్రైవేట్ ట్రావెల్స్ - జూన్ 8, 9 తేదీల్లో వైజాగ్ లో సీఎం ప్రమాణస్వీకారం ఉంటుందన్న వైసీపీ - వైజాగ్ కు వెళ్లేందుకు వైసీపీ శ్రేణులు, సీఎం జగన్ అభిమానుల ప్లానింగ్ - ఇదే అదనుగా విశాఖకు టికెట్ ధరలు డబుల్ చేసిన ప్రైవేట్ ట్రావెల్స్" అంటూ ఆనం వెంకటరమణారెడ్డి ట్వీట్ చేశారు. తద్వారా ఫలితాలు కూడా రాకుండానే జగన్ అభిమానులు చేస్తున్న హంగామాను ప్రస్తావించారు. ఇప్పటికే జగన్ పై నిత్యం ట్వీట్లు పెట్టే, విమర్శలు చేసే నేతగా పేరు తెచ్చుకున్న ఆనం.. ఇలా ట్వీట్ పెట్టేసరికి వైసీపీ అభిమానులకు సైతం దీనిపై ఎలా స్పందించాలో తెలియట్లేదు.
😂 విశాఖకి టికెట్ ధరలు భారీగా పెంచేసిన ప్రైవేట్ ట్రావెల్స్ – జూన్ 8, 9 తేదీల్లో వైజాగ్ లో సీఎం ప్రమాణస్వీకారం ఉంటుందన్న వైసీపీ – వైజాగ్ కు వెళ్లేందుకు వైసీపీ శ్రేణులు, సీఎం జగన్ అభిమానుల ప్లానింగ్ – ఇదే అదనుగా విశాఖకు టికెట్ ధరలు డబుల్ చేసిన ప్రైవేట్ ట్రావెల్స్
— Anam Venkata Ramana Reddy (@anamramana) May 26, 2024












Click it and Unblock the Notifications